hyderabadupdates.com movies అప్పుల కష్టాల నుండి ఐపీఎల్ హీరో వరకు..

అప్పుల కష్టాల నుండి ఐపీఎల్ హీరో వరకు..

లక్నో సూపర్ జెయింట్స్ కొత్త సెన్సేషన్ ముకుల్ చౌదరి ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్. కేకేఆర్ పై అతను చేసిన విధ్వంసం వెనుక ఒక పోరాటం ఉంది. రాజస్థాన్‌లోని జుంజును జిల్లాకు చెందిన ముకుల్, తన తండ్రి కన్న కలను నిజం చేసే క్రమంలో ఎన్నో త్యాగాలు చేశాడు. సరిహద్దులో దేశాన్ని కాపాడే జవాన్లు ఎక్కువగా ఉండే ఆ నేల నుండి వచ్చిన ముకుల్, నిన్న మైదానంలో కూడా ఒక జవాన్ లాగే పట్టువదలకుండా పోరాడి జట్టును గెలిపించాడు.

ముకుల్ ప్రయాణం పూల బాట ఏమీ కాదు. తండ్రి తన కొడుకును క్రికెటర్ చేయాలనే పట్టుదలతో అప్పులు చేసి మరీ అతనికి శిక్షణ ఇప్పించాడు. ఒకానొక దశలో ఆర్థిక ఇబ్బందుల వల్ల తన ఇల్లు కూడా అమ్ముకోవాల్సి వచ్చిందంటే వారి పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. క్రికెట్ కిట్ కొనడానికి, అకాడమీ ఫీజులు కట్టడానికి ముకుల్ తండ్రి పడిన కష్టం ఇప్పుడు ఫలించింది. ఐపీఎల్ వేలంలో రూ. 2.60 కోట్లు దక్కగానే, ముకుల్ చెప్పిన మొదటి మాట “మా నాన్న చేసిన అప్పులు తీర్చి, మా కుటుంబానికి ఒక సొంత ఇల్లు కట్టడమే నా మొదటి లక్ష్యం” అని.

లక్నో హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ ముకుల్ లోని అసలైన హిట్టర్ ను ముందే గుర్తించాడు. ఒక వీడియోలో లాంగర్ మాట్లాడుతూ, “వచ్చే నాలుగు నెలల్లో ఇతన్ని ఇండియాలోనే అత్యంత భయంకరమైన నంబర్ 6 లేదా 7 బ్యాటర్ గా మారుస్తాను” అని సవాల్ చేశాడు. దానికి తగ్గట్టుగానే నెట్స్ లో ముకుల్ కు ప్రత్యేకంగా పవర్ హిట్టింగ్ నేర్పించారు. కేవలం ఒక బౌలర్ గా వచ్చిన ముకుల్ ను పక్కా ఆల్ రౌండర్ గా మార్చడంలో లాంగర్ అగ్రెసివ్ కోచింగ్ మైండ్‌సెట్ కీలక పాత్ర పోషించింది.

మ్యాచ్ అనంతరం ముకుల్ మాట్లాడుతూ, తను ఒత్తిడి కంటే అవకాశానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని చెప్పాడు. “దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు, దీన్ని వాడుకుని పేరు తెచ్చుకోవడమే నా పని. చివరి బంతి వరకు క్రీజులో ఉంటే నేను గెలవగలననే నమ్మకం నాకుంది” అని ముకుల్ ధీమా వ్యక్తం చేశాడు. లైట్ల వెలుతురులో ఇది అతనికి కేవలం రెండో మ్యాచ్ మాత్రమే అయినప్పటికీ, ఏమాత్రం బెరకకుండా కెమెరాన్ గ్రీన్ వంటి బౌలర్లపై హెలికాప్టర్ షాట్లు కొట్టి తన బలాన్ని చూపించాడు.

Related Post

యేలేటి వారు… ఎన్నాళ్లకెన్నాళ్లకుయేలేటి వారు… ఎన్నాళ్లకెన్నాళ్లకు

ఇప్పుడు తెలుగు సినిమా ఎంతో ఎదిగిపోయింది.. సరికొత్త సినిమాలు తీస్తోంది అని కాలర్ ఎగరేస్తున్నాం కానీ.. రెండు దశాబ్దాల ముందు టాలీవుడ్ ఒక మూసలో సినిమాలు చేస్తున్న టైంలో ఐతే లాంటి అద్భుతమైన సినిమాతో సంభ్రమాశ్చర్యాలకు గురి చేసిన దర్శకుడు.. చంద్రశేఖర్ యేలేటి.

అమెరికా వీసా లాటరీపై బాంబు వేసిన ట్రంప్ సర్కార్అమెరికా వీసా లాటరీపై బాంబు వేసిన ట్రంప్ సర్కార్

అమెరికా వెళ్లాలనుకునే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు ఇది నిజంగా పెద్ద షాకింగ్ న్యూస్. దశాబ్దాలుగా కొనసాగుతున్న హెచ్ 1బి వీసా ‘లాటరీ విధానానికి’ ట్రంప్ ప్రభుత్వం మంగళం పాడింది. ఇకపై అదృష్టం ఉంటే వీసా వస్తుంది అనుకోవడం కుదరదు. దీని స్థానంలో అత్యధిక