hyderabadupdates.com movies `అమ‌రావ‌తి` ప‌నులా.. ఇక‌, చిటెక‌లో!

`అమ‌రావ‌తి` ప‌నులా.. ఇక‌, చిటెక‌లో!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి సంబంధించిన ప‌నులు పూర్త‌వ్వాలంటే.. ఇప్ప‌టివ‌ర‌కు ప్ర‌యాస‌లు ప‌డాల్సి వ‌స్తోంద‌న్న‌ది వాస్త‌వం. ప్ర‌ధాన కార్యాల‌యాల‌న్నీ.. త‌లా ఒకచోట ఉండ‌డంతో అమ‌రావ‌తిలో భూములు కొనాలన్నా.. విక్ర‌యించాల‌న్నా.. ఆయా కార్యాల‌యాల చుట్టూ తిరిగే ప‌రిస్థితి ఉంది. దీంతో ప‌నులు స‌కాలంలో పూర్తి కావ‌డం లేద‌న్న‌ది కూడా వాస్త‌వం. ఈ నేప‌థ్యంలో స‌ర్కారు కొన్నాళ్లుగా.. చేసిన ప్ర‌య‌త్నాలు ఫ‌లించాయి. తాజాగా అమ‌రావ‌తిలోనే అన్నీ అయ్యేట్టుగా కార్యాల‌యాన్ని అందుబాటులోకి తెచ్చారు.

ఏపీ పుర‌పాల‌క, ప‌ట్ట‌ణాభివృద్ది శాఖ ప్ర‌ధాన కార్యాలయాన్ని అమ‌రావ‌తిలోని రాయ‌పూడిలో ఏర్పాటు చేశారు. దీనిని సీఎం చంద్ర‌బాబు ఈనెల 13న‌(సోమ‌వారం) ప్రారంభించ‌నున్నారు. ఫ‌లితంగా రాజ‌ధాని అమ‌రావ‌తికి సంబంధించిన అన్ని ప‌నులు, కార్య‌క‌లాపాలు ఇక్క‌డ నుంచే జ‌ర‌గ‌నున్నాయి. ప్ర‌జా రాజ‌ధానిలో పాల‌నా సౌల‌భ్యం కొరకు అన్ని హెచ్ వో డీలు ఒకే చోటకు చేర‌నున్నాయి. త‌ద్వారా ప్ర‌జ‌లంద‌రికీ అందుబాటులో ఉండేలా స‌రికొత్త హంగుల‌తో నిర్మించిన భ‌వ‌నాల నుంచే కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌నున్నారు.

ముఖ్యంగా అమ‌రావ‌తికి భూములిచ్చిన‌ రైతులు త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకొనేందుకు ఇప్ప‌టి వ‌ర‌కు విజయవాడ‌, మంగ‌ళ‌గిరిలోని కార్యాల‌యాల చుట్టూ ప‌నులు మానుకుని రావాల్సి వ‌చ్చేంది. ఈ కార్యాల‌యం అందుబాటులోకి రావ‌డంతో వారు ఇక్క‌డే త‌మ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించుకునేందుకు అవ‌కాశం ఏర్ప‌డింది. రాజ‌ధాని అమ‌రావ‌తిని ప్ర‌తిబింబించేలా భ‌వ‌నం ముందు `ఏ`అక్ష‌రంతో ఎలివేష‌న్ చేశారు.

అమరావతిలో సీడ్ యాక్సిస్ రోడ్ జంక్షన్ వద్ద రాయపూడి సమీపంలో మున్సిప‌ల్ శాఖ ప్ర‌ధాన కార్యాలయం నిర్మాణాన్ని 2017లో ప్రారంభించారు. వైసీపీ హ‌యాంలో ఆగిపోయినా.. ఇటీవ‌ల దీనిని పూర్తి చేశారు.  

మొత్తం 4.32 ఎకరాల విస్తీర్ణంలో జీ ప్లస్ 7 భవనంగా రూపొందించిన ఈ నిర్మాణంలో పార్కింగ్ కోసం 1.36 ఎకరాలు, ఓపెన్ స్పేస్ 0.96 ఎకరాలు, ఎస్టీపీ 0.39 ఎకరాల్లో నిర్మాణం చేశారు. దీనిలోనే పుర‌పాల‌క శాఖ మంత్రి అందుబాటులో ఉంటారు. ప్రిన్సిపల్ సెక్రటరీ, పబ్లిక్ హెల్త్ ఈఎన్ సీ, ఏడీసీఎల్ అధికారులు కూడా ఇక్క‌డ నుంచే కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌నున్నారు.

Related Post

మంత్రులతో భేటీ… క్లారిటీ ఇచ్చిన డిప్యూటీ సీఎంమంత్రులతో భేటీ… క్లారిటీ ఇచ్చిన డిప్యూటీ సీఎం

సింగరేణి బొగ్గు స్కాం ఆరోపణలు, ఆ నేపథ్యంలో మీడియాలో రకరకాల కథనాలు, కాంగ్రెస్ కీలక నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలపై సోషల్ మీడియాలో గుసగుసలు…ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలలో ఈ టాపిక్ లపై హాట్ డిబేట్ లు నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే సీఎం

కాంగ్రెస్ వ‌దుల‌కుంది.. మోడీ ఓన్ చేసుకున్నారు!కాంగ్రెస్ వ‌దుల‌కుంది.. మోడీ ఓన్ చేసుకున్నారు!

రాజ‌కీయాల్లో ఏ చిన్న అవ‌కాశం వ‌చ్చినా.. ప్ర‌త్య‌ర్థులు దానిని త‌మ‌కు అనుకూలంగా మార్చుకుంటారు. ముఖ్యంగా జాతీయ రాజ‌కీయాల్లో 2014 త‌ర్వాత అనేక మార్పులు సంత‌రించుకున్నాయి. ప్ర‌ధాని పీఠంపై కూర్చున్న న‌రేంద్ర‌ మోడీ.. వ్యూహాత్మ‌క అడుగులు వేయ‌డంలో త‌న‌కు తానే సాటి అనిపించుకున్నారు.

Shanakar Vara Prasad’s Team Sends Heartfelt Birthday Wishes to NayantharaShanakar Vara Prasad’s Team Sends Heartfelt Birthday Wishes to Nayanthara

Team Mana Shankara Vara Prasad Garu extended warm birthday greetings to the ever-graceful actress Nayanthara, celebrating her charm and star power. The team shared their heartfelt wishes, calling her elegance