hyderabadupdates.com Gallery అమ‌రావ‌తి రాజ‌ధాని నిర్మాణం ప‌నులు వేగ‌వంతం చేయాలి

అమ‌రావ‌తి రాజ‌ధాని నిర్మాణం ప‌నులు వేగ‌వంతం చేయాలి

అమ‌రావ‌తి రాజ‌ధాని నిర్మాణం ప‌నులు వేగ‌వంతం చేయాలి post thumbnail image

అమరావతి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాజధాని నిర్మాణ పనులపై క్యాంప్ కార్యాలయంలో శ‌నివారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వ‌హించారు. సమీక్షకు హాజర‌య్యారు మంత్రి నారాయణ, సీఆర్డీఏ, ఏడీసీ ఉన్నతాధికారులు, రాజధాని నిర్మాణ పనులు చేస్తోన్న సంస్థల ప్రతినిధులు. ప్రస్తుతం రాజధానిలో వివిధ దశాల్లో రూ.57,821 కోట్ల విలువైన ప‌నులు కొన‌సాగుతున్నాయి. హౌసింగ్, రోడ్లు, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎల్పిఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో పాటు అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం వంటి ఐకానిక్ భవనాల నిర్మాణం జ‌రుగుతోంది. వైసీపీ ప్రభుత్వం నిలిపివేసిన, రద్దు చేసిన పనులకు సంబంధించి ఉన్న వివాదాలు, సమస్యలు పరిష్కరించి పనులు చేపట్టింది సీఆర్డీఏ. నాటికి నేటికి నిర్మాణ వ్యయం పెరగడం సహా పలు సవాళ్లను అధిగమించి టెండర్లు పూర్తి చేసి పనులు అప్పగించింది.
ప్ర‌స్తుతం అమ‌రావ‌తి రాజధానిలో పనులు చేస్తున్నారు 20 వేల మంది కార్మికులు, నిపుణులు. ఏ నిర్మాణ సంస్థ ఎంత మేర పనులు చేసింది..? టార్గెట్ ను ఎంత మేరకు చేరుకున్నారనే విషయంలో పనుల వారీగా సీఎం సమీక్ష చేప‌ట్టారు. ఎంత మంది కార్మికులు పని చేయాలి, ఎంత మంది పనిచేస్తున్నారు… ఎంత మిషనరీ ఉపయోగించాలి, ఎంత ఉపయోగిస్తున్నారు అనే విషయంపై సమగ్రంగా చ‌ర్చించారు నారా చంద్ర‌బాబు నాయుడు. వారం, నెల టార్గెట్ పెట్టుకుని పనులు పూర్తి చేయాలని ఆదేశించారు .వర్షాకాలం వచ్చే సమయానికి పూర్తి చేయాల్సిన పనులపై తాము పెట్టుకున్న లక్ష్యాలను వివరించారు ఉన్న‌తాధికారులు. రాజధాని నిర్మాణమనేది కేవలం ఒక కాంట్రాక్ట్ వర్క్ గా చూడొద్దని, ఇప్పుడు పనులు చేపట్టే వారంతా చరిత్రలో భాగస్వాములువుతున్నట్టేన‌ని భావించాల‌ని స్ప‌ష్టం చేశారు సీఎం.
The post అమ‌రావ‌తి రాజ‌ధాని నిర్మాణం ప‌నులు వేగ‌వంతం చేయాలి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

తెలంగాణ‌కు అద‌నంగా ఐపీఎస్ అధికారుల‌ను కేటాయించండితెలంగాణ‌కు అద‌నంగా ఐపీఎస్ అధికారుల‌ను కేటాయించండి

ఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఐపీఎస్ అధికారుల సంఖ్య‌ను కేటాయించాల‌ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. కేంద్ర హోం శాఖ మంత్రి తో ముఖ్య‌మంత్రి భేటీ అయ్యారు. రాష్ట్ర విభ‌జ‌న

రెండు వేర్వేరు కేసుల‌పై పై సిట్ ఏర్పాటురెండు వేర్వేరు కేసుల‌పై పై సిట్ ఏర్పాటు

హైద‌రాబాద్ : తెలంగాణ డీజీపీ శివ ధ‌ర్ రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రెండు వేర్వేరు కేసుల‌కు సంబంధించి సిట్ ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపారు. దీనికి సిటీ పోలీస్ క‌మిష‌న‌ర్ స‌జ్జ‌నార్ ప‌ర్య‌వేక్షిస్తార‌ని తెలిపారు. మంగ‌ళ‌వారం డీజీపీ మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్

త‌లసేమియా వ్యాధిపై 10న హైద‌రాబాద్ లో ర‌న్త‌లసేమియా వ్యాధిపై 10న హైద‌రాబాద్ లో ర‌న్

కుప్పం : ఎన్టీఆర్ ఆశయ సాధనలో ముందుంటామని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు. ఆపన్నులను ఆదుకునేందుకు ట్రస్ట్ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని స్పష్టం చేశారు. కుప్పం నియోజకవర్గంలో నాలుగు రోజుల పర్యటనలో భాగంగా పలు