hyderabadupdates.com Gallery అమెరికా బెదిరింపుల‌కు భ‌యప‌డం : ఇరాన్

అమెరికా బెదిరింపుల‌కు భ‌యప‌డం : ఇరాన్

అమెరికా బెదిరింపుల‌కు భ‌యప‌డం : ఇరాన్ post thumbnail image

ఇరాన్ : మ‌రో యుద్దానికి తెర తీయ‌నున్నాడా అమెరికా బాస్ ట్రంప్. ఆయ‌న గ‌త కొంత కాలంగా ప‌లు దేశాలపై పెత్త‌నం చెలాయించేందుకు ప్ర‌య‌త్నం చేస్తూనే ఉన్నారు. ఆ మధ్య‌న ఇండియాను బెదిరించారు. ర‌ష్యాతో సంబంధం తెంచు కోవాల‌ని ఒత్తిడి చేశాడు. ఆపై సుంకాలు విధించాడు. ఆపై హెచ్ 1 బి వీసాల‌ను ఇచ్చేది లేదంటూ బాంబు పేల్చాడు. రోజుకో ప్ర‌క‌ట‌న చేస్తూ ప్ర‌పంచంలో ఒక భ‌యాన‌క వాతావ‌ర‌ణం సృష్టించే ప్ర‌యత్నం చేస్తున్నాడు. ఈ త‌రుణంలో ఇరాన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. అణుబాంబును ప్ర‌యోగిస్తామ‌ని ప్ర‌క‌టించాడు. దీనిపై ఇరాన్ స్పందించింది. డోంట్ కేర్ అంటూ స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై సైనిక చర్య తీసుకుంటామని పదే పదే బెదిరించడం ప‌ట్ల త‌ప్పు ప‌ట్టింది. నీకు అంత సీన్ లేదంటూ మండిప‌డింది.
ఈ మేర‌కు ఇరాన్ సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ ట్రంప్ పై , ఆయ‌న చేసిన కామెంట్స్ పై నిప్పులు చెరిగాడు. ఇక్క‌డ చేతులు క‌ట్టుకుని ఎవ‌రూ లేర‌ని , త‌మ‌కు కూడా స‌రైన బ‌ల‌గం ఉందంటూ ప్ర‌కటించాడు. ఎలాంటి చ‌ర్య‌ల‌నైనా ఎదుర్కొనే స‌త్తా త‌మ‌కు ఉందని ప్ర‌క‌టించాడు. అన్నింటిని త‌ట్టుకునే సామ‌ర్థ్యం, శ‌క్తి త‌మ‌లో ఉంద‌ని, వెన‌క్కి త‌గ్గ‌బోమంటూ వెల్ల‌డించాడు ఖ‌మేనీ. ఈ సంద‌ర్భంగా ఇరాన్ అణుశక్తి చీఫ్ గురువారం మీడియాతో మాట్లాడాడు. ఏ దేశం కూడా ఇరాన్ అణుశక్తి హక్కును హరించదని స్ప‌ష్టం చేశాడు. రాన్ అణు కార్యక్రమం అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ నిబంధనల ప్రకారం కొనసాగుతోందని అన్నాడు మొహమ్మద్ ఎస్లామి ఇరాన్ .
The post అమెరికా బెదిరింపుల‌కు భ‌యప‌డం : ఇరాన్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

మాజీ కేంద్ర మంత్రి చిదంబ‌రం అరెస్ట్ త‌ప్ప‌దా..?మాజీ కేంద్ర మంత్రి చిదంబ‌రం అరెస్ట్ త‌ప్ప‌దా..?

న్యూఢిల్లీ : మాజీ కేంద్ర మంత్రి పి . చిదంబ‌రం అరెస్ట్ కాక త‌ప్ప‌దా. ఆ దిశ‌గా ఈడీ రంగంలోకి దిగింది. ఎయిర్‌సెల్ మాక్సిస్ డీల్‌లో మనీలాండరింగ్ నేరానికి సంబంధించి అప్పటి కేంద్ర ఆర్థిక మంత్ర కాంపిటెంట్ అథారిటీ నుండి అందుకున్న

KTR: ప్రజా తీర్పును గౌరవిస్తాం – కేటీఆర్‌KTR: ప్రజా తీర్పును గౌరవిస్తాం – కేటీఆర్‌

  జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ఫలితం చూస్తే బీజేపీ, కాంగ్రెస్‌ కుమ్మక్కు రాజకీయం ఫలించినట్టే కనిపిస్తోందని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. బీజేపీకు డిపాజిట్‌ కూడా రాలేదని… ‘ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌’ సమీకరణం బాగానే పనిచేసిందని చెప్పారు. ఎన్నికలకు

ఎమ్మెల్యే గాలి జనార్ధన్ రెడ్డి ఇంటికి నిప్పుఎమ్మెల్యే గాలి జనార్ధన్ రెడ్డి ఇంటికి నిప్పు

రాయ‌చూర్ జిల్లా : క‌ర్ణాట‌క‌లోని రాయ‌చూర్ జిల్లాలో బీజేపీ వ‌ర్సెస్ కాంగ్రెస్ పార్టీల మ‌ధ్య ప‌చ్చ గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటోంది. ఇప్ప‌టికే ఇరు వ‌ర్గాల మ‌ధ్య చోటు చేసుకున్న ఆధిప‌త్య పోరు చివ‌ర‌కు దాడులు చేసుకునేంత దాకా వెళ్లింది. ఒక‌రు మృతి