hyderabadupdates.com movies అమెరికా, వెనిజులా వార్.. ఇండియాకు జాక్ పాట్ తగిలినట్టేనా?

అమెరికా, వెనిజులా వార్.. ఇండియాకు జాక్ పాట్ తగిలినట్టేనా?

వెనిజులాలో అమెరికా చేసిన దాడి ఇప్పుడు గ్లోబల్ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. అక్కడ ప్రభుత్వం మారితే మనకేంటి అని లైట్ తీసుకోకండి. ఈ పరిణామం ఇండియాకు ఒక రకంగా ‘శుభవార్త’ మోసుకొచ్చేలా ఉంది. అక్కడ జరిగే మార్పులు మన స్టాక్ మార్కెట్ కు న్యూట్రల్ గా అనిపించినా, మన ప్రభుత్వ ఆయిల్ కంపెనీలకు మాత్రం కాసుల వర్షం కురిపించే ఛాన్స్ ఉందని మార్కెట్ నిపుణులు అంటున్నారు.

అసలు మ్యాటర్ ఏంటంటే.. మన ONGC విదేశ్ లిమిటెడ్ కు వెనిజులా నుంచి రావాల్సిన బకాయిలు చాలానే ఉన్నాయి. అక్కడ అమెరికా ఎంట్రీతో, పెట్రోలియస్ డి వెనిజులా రీస్ట్రక్చరింగ్ జరిగితే.. దాదాపు 1 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 8000 కోట్లు) పెండింగ్ అమౌంట్ రికవరీ అయ్యే ఛాన్స్ ఉంది. 2014 నుంచి డివిడెండ్స్ రూపంలో రావాల్సిన దాదాపు 536 మిలియన్ డాలర్లు అక్కడ ఇరుక్కుపోయాయి. ఇప్పుడు ఆంక్షలు తొలగిపోతే ఆ డబ్బు ఇండియాకు రావడం ఖాయం.

ఇక సామాన్యుడి జేబు విషయానికి వస్తే.. వెనిజులా నుంచి ఆయిల్ సప్లై పెరిగితే అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గే అవకాశం ఉంది. లాంగ్ టర్మ్ లో ఆయిల్ ధరలు తగ్గడం మన ఎకానమీకి బూస్ట్ ఇస్తుంది. తక్కువ ఆయిల్ ధరలు ఉంటే అమెరికాలో ద్రవ్యోల్బణం తగ్గి, డాలర్ వీక్ అవుతుంది. ఇది మనలాంటి ఎమర్జింగ్ మార్కెట్లకు కలిసొచ్చే అంశం.

ఉక్రెయిన్ యుద్ధం తర్వాత మనం రష్యా ఆయిల్ మీద ఎక్కువగా ఆధారపడ్డాం. ఇప్పుడు వెనిజులా నుంచి ‘హెవీ క్రూడ్ ఆయిల్’ అందుబాటులోకి వస్తే.. మన రిఫైనరీలకు పండగే. ఇది మన ఆయిల్ ఇంపోర్ట్ స్ట్రాటజీని మార్చేసి, రష్యా మీద ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. రిలయన్స్ వంటి కంపెనీలకు కూడా ముడి చమురు సోర్సింగ్ లో ఆప్షన్లు పెరుగుతాయి.

షార్ట్ టర్మ్ లో కొంచెం గందరగోళం ఉన్నా, వెనిజులా ఎపిసోడ్ ఇండియాకు పాజిటివ్ గానే కనిపిస్తోంది. గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం సేఫ్ అని నిపుణులు సూచిస్తున్నారు. స్టాక్ మార్కెట్ లో ONGC, ఆయిల్ ఇండియా వంటి షేర్ల మీద కన్నేసి ఉంచడం మంచిది. మార్కెట్ ఒడిదుడుకులు ఉన్నా, సెలెక్టివ్ గా ఇన్వెస్ట్ చేసేవారికి ఇది మంచి టైమ్.

Related Post

టీమ్ ఇండియాలోకి కొత్త కుర్రాడుటీమ్ ఇండియాలోకి కొత్త కుర్రాడు

భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ స్థానంలో యువ సంచలనం ఆయుష్ బదోనీని బీసీసీఐ ఎంపిక చేసింది. 2026 సంవత్సరంలో భారత జాతీయ జట్టుకు

Mana Sankara Vara Prasad Garu Censor Buzz Sparks Strong ExpectationsMana Sankara Vara Prasad Garu Censor Buzz Sparks Strong Expectations

The upcoming Telugu film Mana Sankara Vara Prasad Garu has created a wave of excitement after its censor report generated highly positive feedback. The development was officially shared by producers