hyderabadupdates.com movies అయిదో రోజూ ఆగని వర ప్రసాదు

అయిదో రోజూ ఆగని వర ప్రసాదు

కొన్ని ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూటర్ల సమస్య వల్ల థియేటర్లు సరిపోకపోయినా, మరో నాలుగు సినిమాలతో స్క్రీన్లు పంచుకోవాల్సి వచ్చినా మన శంకరవరప్రసాద్ గారు జోరులో ఏ మాత్రం మార్పు లేదు. ఎక్కడ చూసినా హౌస్ ఫుల్ బోర్డులతో హాళ్లు కళకళలాడుతున్నాయి. చాలా బిసి సెంటర్లలో ఎక్స్ ట్రా కుర్చీలు వేసి మరీ ప్రేక్షకులకు చూపిస్తున్నారంటే పరిస్థితి ఎక్కడి దాకా వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు.

అయిదో రోజు ఏకంగా ఆర్ఆర్ఆర్ రికార్డుని బద్దలు కొట్టడం చూసి ట్రేడ్ నోట మాట రావడం లేదు. చరణ్ తారక్ ప్యాన్ ఇండియా మూవీ అయిదో రోజు 13 కోట్ల షేర్ వసూలు చేస్తే చిరు రీజనల్ సినిమా ఏకంగా 14 కోట్ల 70 లక్షలతో దాటేసింది.

టీమ్ అధికారికంగా ప్రకటించిన దాని ప్రకారం వరప్రసాద్ గారు ఇప్పటిదాకా 226 కోట్ల గ్రాస్ సాధించి ట్రిపుల్ సెంచరీ వైపు పరుగులు పెడుతోంది. ఆదివారం సాయంత్రం లోపే ఈ లాంఛనం జరగొచ్చని ఒక అంచనా. బుక్ మై షోలో వేగంగా పాతిక లక్షల టికెట్లు అమ్మిన సింగిల్ లాంగ్వేజ్ మూవీగా మరో మైలురాయి వరప్రసాద్ ఖాతాలో చేరింది.

యుఎస్ లో టికెట్ ధరలు సాధారణ స్థితికి రాగా ఏపీలో జనవరి 21 దాకా అమలులో ఉంటాయి. తెలంగాణ ఆల్రెడీ గరిష్ట ధరలతో అమ్మకాలు జరుగుతుండగా ఈ మధ్య కాలంలో చూడని లాంగ్ రన్ మన శంకరవరప్రసాద్ గారికి దక్కడం ఖాయమని డిస్ట్రిబ్యూటర్లు అభిప్రాయపడుతున్నారు.

రెండున్నర సంవత్సరాల గ్యాప్ తీసుకున్న మెగాస్టార్ ఇంత గొప్పగా కంబ్యాక్ ఇవ్వడం చూసి మెగా ఫ్యాన్స్ ఫుల్ యాక్టివ్ అయిపోయారు. ఎక్స్, ఇన్స్ టా, ఫేస్ బుక్ తదితర మాధ్యమాలను మెసేజులు, వీడియోలతో హోరెత్తిస్తున్నారు. ఎక్స్ ట్రా షోలకు నిర్మాతలను డిమాండ్ చేస్తూ ట్యాగులు గట్రా పెడుతున్నారు.

అనిల్ రావిపూడి నెక్స్ట్ రౌండ్ ప్రమోషన్ల కోసం గుంటూరు నుంచి టూర్ మొదలుపెడుతున్నారు. విజయాన్ని ప్రత్యక్షంగా అభిమానులతో కలిసి పంచుకోబోతున్నారు. బ్లాక్ బస్టర్ సక్సెస్ ఈవెంట్ ప్లానింగ్ ఉంది కానీ తేదీ విషయంలో టీమ్ మల్లగుల్లాలు పడుతోంది. త్వరలో నిర్ణయం తీసుకుని డేట్, వివరాలు ప్రకటిస్తారు.

Related Post

Sivakarthikeyan reacts to the Pongal clash between Thalapathy Vijay’s Jana Nayagan and ParasakthiSivakarthikeyan reacts to the Pongal clash between Thalapathy Vijay’s Jana Nayagan and Parasakthi

Actor Sivakarthikeyan has earned widespread appreciation for him being gracious regarding the much discussed Pongal release scenario involving his film Parasakthi and Thalapathy Vijay’s upcoming film Jana Nayagan. Addressing the