hyderabadupdates.com movies అర్జున్ ఆలోచనలు నిజంగా బాగున్నాయి

అర్జున్ ఆలోచనలు నిజంగా బాగున్నాయి

యాక్షన్ కింగ్ అర్జున్ స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న సీత పయనం ఈ వారం ఫిబ్రవరి 14 విడుదల కానుంది. కూతురు ఐశ్వర్యని టాలీవుడ్ కు పరిచయం చేసే ఉద్దేశంతో తీసిన ఈ మూవీకి సర్వం ఆయనే ప్రమోషన్ బాధ్యతలు తీసుకుని ప్రతి చోటా కనిపిస్తున్నారు.

నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు స్టార్ హీరోలను తీసుకురాకుండా, నిజ జీవితంలో సామాన్యులకు జీవితాలను ప్రసాదిస్తున్న ముగ్గురు గొప్ప వ్యక్తులను గెస్టులుగా సత్కరించడం ద్వారా కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. బ్రహ్మానందం అంతటి వారే వాళ్ళకు పాదాభివందనం చేసేందుకు వెనుకాడలేదంటే ఎంత మహోన్నతంగా ఆలోచించారో అర్థం చేసుకోవచ్చు.

ఇదే కాదు పలు ఇంటర్వ్యూలలో అర్జున్ ఓపిగ్గా చెబుతున్న సమాధానాలు నెటిజెన్లను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఇదే సినిమాని గతంలో విశ్వక్ సేన్ తో ప్రారంభించి, తర్వాత విభేదాలు రావడం వల్ల హీరోని మార్చిన సంగతి తెలిసిందే.

ఇదే ప్రశ్న ఎదురైనప్పుడు విశ్వక్ చాలా చిన్న వాడు, ఏదో జరిగిపోయింది, దాన్ని పట్టుకుని వేలాడలేం, అతని సినిమా బాగా ఆడాలి, మాది కూడా ఆడాలి అంటూ చెప్పిన వైనంలో అర్జున్ అనుభవంలోని గొప్పదనాన్ని చెప్పకనే చెబుతోంది. పెద్ద సంఖ్యలో మీడియా ప్రతినిధులకు వ్యక్తిగత ఇంటర్వ్యూలు ఇచ్చిన అర్జున్ సినిమాతో పాటు తన జీవిత విశేషాలు చాలానే పంచుకున్నాడు.

అయితే ఇదంతా సీత పయనంకు ఓపెనింగ్స్ తెచ్చేందుకు దోహదం చేస్తుందా అంటే నూటికి నూరు శాతం అని చెప్పలేం కానీ కొంత మేర సానుకూల ప్రభావం అయితే ఉంటుంది. కాకపోతే టాక్ పాజిటివ్ గా రావాలి. పోటీలో ఉన్న ఫంకీ, కపుల్ ఫ్రెండ్లీ రెండూ ఎక్కువ యూత్ ని టార్గెట్ చేసుకున్నాయి.

సో మొదటి రోజు వాళ్ళు అటువైపు షిఫ్ట్ అవుతారు. సీత పయనం ఆకట్టుకోవాల్సింది ఫ్యామిలీ ఆడియన్సుని. మరి అర్జున్ ఇందులో ఏ మేరకు సఫలీకృతం అవుతారో ప్రేమికుల రోజు తేలనుంది. ఉపేంద్ర అన్న కొడుకు నిరంజన్ హీరోగా నటించిన ఈ రోడ్ జర్నీ మూవీకి అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చారు.

Related Post

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని చిలకలూరిపేట స్కూలుకు గ్రంథాలయానికి సరిపడా పుస్తకాలను, ల్యాబ్ కు కంప్యూటర్లను అందజేశారు. కేవలం పది రోజుల్లో వీటిని మంజూరు చేయడం

బడ్జెట్ 2026: అప్పులు తగ్గేలా నిర్మలమ్మ ప్లాన్బడ్జెట్ 2026: అప్పులు తగ్గేలా నిర్మలమ్మ ప్లాన్

2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే లక్ష్యంతో ప్రతి పైసాను ఆచితూచి ఖర్చు చేయాలని చూస్తున్నారు. పన్నుల తగ్గింపు వల్ల వచ్చే ఆదాయంలో కొంత

పాజిటివ్ టాక్స్ నిజమైతే చాలుపాజిటివ్ టాక్స్ నిజమైతే చాలు

నిన్న సాయంత్రం ది గర్ల్ ఫ్రెండ్, ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో స్పెషల్ ప్రీమియర్లు హైదరాబాద్ లో వేశారు. దీనికి వెళ్లిన వాళ్ళ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ కనిపించడం బయ్యర్ వర్గాల్లో సంతోషాన్ని నింపుతోంది. రస్మిక మందన్న పెర్ఫార్మన్స్, రాహుల్