hyderabadupdates.com movies అలియా సినిమాకు అడ్వాన్స్ ట్రోలింగ్

అలియా సినిమాకు అడ్వాన్స్ ట్రోలింగ్

ఎవరో జ్వాలలు రగిలించారు, వేరెవరో దానికి బలి అయ్యారు అంటూ ఒక పాత పాట ఉంటుంది. ఎన్ని తరాలు మారినా ఇప్పటి సందర్భాలకు కూడా ఇది సరిగ్గా వర్తిస్తుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 17 అలియా భట్ నటించిన బాలీవుడ్ మొదటి లేడీ స్పై థ్రిల్లర్ అల్ఫా విడుదలకు రెడీ అవుతోంది. నిజానికి డిసెంబర్ 25 రావాల్సింది కానీ పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యం కావడంతో ఏకంగా ఆరు నెలలు పోస్ట్ పోన్ చేశారు. ఇప్పుడీ మూవీకి అడ్వాన్స్ ట్రోలింగ్ మొదలయ్యేలా ఉంది. కారణం దురంధర్. రెండింటికి దర్శక నిర్మాతల పరంగా ఎలాంటి కనెక్షన్ లేదు కానీ నెటిజెన్లు మాత్రం అల్ఫాని టార్గెట్ చేసేలా ఉన్నారు

ఎందుకో చూద్దాం. దురంధర్ ని కొన్ని వర్గాలు ఉద్దేశపూర్వంగా నెగటివ్ ప్రచారం చేయడం తెలిసిందే. కానీ వాళ్ళ పబ్లిసిటీ రివర్స్ కొట్టేసి సినిమా బ్లాక్ బస్టర్ దాటి ఇండస్ట్రీ హిట్ దిశగా పరుగులు పెడుతోంది. యష్ రాజ్ ఫిలింస్ తీసిన పఠాన్, వార్, ఏక్ ధా టైగర్ లాంటి వాటిని మాస్టర్ పీసెస్ గా పొగిడిన వాళ్ళు ఇప్పుడు దురంధర్ లో పాకిస్థాన్ మాఫియాని నగ్నంగా చూపించేసరికి తట్టుకోలేకపోతున్నారు. దీని గురించి నిత్యం ఎక్స్, టీవీ ఛానల్స్ లో డిబేట్లు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడీ అల్ఫా నిర్మించింది యష్ రాజ్ ఫిలింసే. ఇది కూడా పాకిస్థాన్, ఇండియా గూఢచారుల నేపథ్యంలో సాగుతుంది.

ఉత్తరాది వర్గాల ప్రకారం అల్ఫాలో పాక్, భారత స్పైలు స్నేహం చేసినట్టుగా చూపించబోతున్నారట. ఇది నిజమో కాదో కానీ ఒకవేళ ఉంటే మాత్రం సోషల్ మీడియాలో తలంటు తప్పదు. బాబీ డియోల్ విలన్ గా నటించిన అల్ఫాలో మరో గూఢచారి క్యారెక్టర్ శర్వారి వాఘ్ చేస్తోంది. మెయిన్ విలన్ బాబీ డియోల్. వార్ 2 చివర్లో చూపించింది ఈ సినిమా తాలూకు క్లిప్పే. జూనియర్ ఎన్టీఆర్ తో సహా యష్ స్పై యూనివర్స్ లో హీరోలను ఇందులో చూపించాలనుకున్నారు కానీ తర్వాత వద్దనుకున్నారు. ట్విస్ట్ ఏంటంటే దురంధర్ కనక మార్చి 19 వస్తే కేవలం నెల రోజుల గ్యాప్ లో రిలీజయ్యే అల్ఫాకు మరిన్ని చిక్కులు తప్పవు.

Related Post

ఆదిత్య ధార్ మూడో షాక్ ఇవ్వబోతున్నారాఆదిత్య ధార్ మూడో షాక్ ఇవ్వబోతున్నారా

దురంధర్ షూటింగ్ జరుగుతున్న టైంలో ఎలాంటి హడావిడి లేదు. ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్నప్పుడు సోషల్ మీడియా సందడి లేదు. రిలీజ్ ముందు ఎక్కువ నెగటివిటీనే ఉంది. కానీ ఇప్పుడు సీక్వెల్ వస్తున్న టైంలో కేవలం ప్రీమియర్ షోలతోనే రికార్డులు బద్దలు అవ్వడం

Soubin Shahir’s Malayalam crime thriller Paathirathri locks its streaming dateSoubin Shahir’s Malayalam crime thriller Paathirathri locks its streaming date

Paathirathri is a recent Malayalam crime thriller directed by Ratheena P.T. It stars versatile actor Soubin Shahir and Navya Nair in the lead roles. The film received mixed reviews from

మైకేల్ జాక్సన్ ఫ్యాన్స్ వెర్రెత్తిపోయే సినిమామైకేల్ జాక్సన్ ఫ్యాన్స్ వెర్రెత్తిపోయే సినిమా

ఇప్పుడంటే ప్రపంచవ్యాప్తంగా బోలెడంత మంది పాప్ సింగర్స్ ఉన్నారు. ఎవరి స్థాయిలో వాళ్లు భారీగా అభిమాన గణాన్ని సంపాదించుకున్నారు. కానీ ఓ నాలుగు దశాబ్దాలు వెనక్కి వెళ్తే.. ప్రపంచమంతా ఒక సింగర్ పేరెత్తితే చాలు వెర్రెత్తిపోయేది. టీనేజీలోనే ప్రపంచ సంగీత ప్రియులందరినీ