hyderabadupdates.com movies ‘అవతార్‌’ను ఇంత లైట్ తీసుకున్నారేంటి?

‘అవతార్‌’ను ఇంత లైట్ తీసుకున్నారేంటి?

16 ఏళ్ల కిందట వచ్చిన ‘అవతార్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి సంచలనం రేపిందో తెలిసిందే. ఆ కథకు, ఆ విజువల్స్‌కు, ఆ ఎఫెక్ట్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ప్రపంచ సినీ చరిత్రలోనే అత్యధిక వసూళ్ల రికార్డును అందించారు. ఆ చిత్రం సాధించిన అసాధారణ విజయం చూసి దర్శక నిర్మాత ఒకేసారి నాలుగు సీక్వెల్స్ ప్రారంభించాడు.

తొలి సీక్వెల్ ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ మూడేళ్ల కిందట రిలీజైంది. కానీ అంచనాలను పూర్తిగా అందుకోలేకపోయింది. ప్రి రిలీజ్ బజ్ వల్ల వసూళ్లయితే భారీగా వచ్చాయి. ఐతే నాలుగు రోజుల కిందట రిలీజైన కొత్త సీక్వెల్ ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ మాత్రం ఇటు పాజిటివ్ రివ్యూలూ తెచ్చుకోలేకపోయింది, అటు ఆశించిన కలెక్షన్లూ సాధించలేకపోతోంది. ‘అవతార్-2’ ఇండియాలో ఓపెనింగ్ వీకెండ్లో సాధించిన వసూళ్లలో సగం కూడా రాబట్టలేకపోయింది ‘అవతార్-3’.

‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’కు మిక్స్డ్ టాక్ వచ్చినా సరే.. తొలి వీకెండ్లో రూ.137 కోట్ల దాకా వసూళ్లు కొల్లగొట్టింది. కానీ ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ ఇండియా వీకెండ్ వసూళ్లు రూ.60 కోట్లకు పరిమితం అయ్యాయి. కొన్ని వారాలుగా ఇండియన్ బాక్సాఫీస్‌ను దున్నేస్తున్న ‘దురంధర్’ ముందు ‘అవతార్-3’ నిలవలేకపోయింది. కొత్త సినిమా అయిన ‘అవతార్-3’ను పాత చిత్రమైన ‘దురంధర్’ మూడు రోజుల్లో పూర్తిగా డామినేట్ చేసింది. ఆ చిత్రానికి మూడో వీకెండ్లో రూ.95 కోట్ల దాకా వసూళ్లు రావడం విశేషం.

‘అవతార్-3’ అంచనాలను అందుకోలేకపోవడం ‘అఖండ-2’కు కూడా బాగానే కలిసొచ్చింది. రెండో వీకెండ్లో ఆ చిత్రం మంచి వసూళ్లే రాబట్టింది. కేవలం విజువల్స్ కోసం మంచి స్క్రీన్లలో ఈ సినిమా చూడాలి తప్ప.. అంతకుమించి ఇందులో విశేషమేమీ లేదనే అభిప్రాయం జనాల్లోకి బలంగా వెళ్లడంతో ‘అవతార్-3’ని ఆడియన్స్ లైట్ తీసుకున్నట్లు కనిపిస్తోంది.

Related Post

Sree Vishnu and Ram Abbaraju Join Hands Again for New Comedy FilmSree Vishnu and Ram Abbaraju Join Hands Again for New Comedy Film

Mythri Movie Makers, one of India’s top production houses, has announced a brand-new film with actor Sree Vishnu and director Ram Abbaraju. The duo earlier gave the blockbuster comedy Samajavaragamana.

RGV Defends Rajamouli After Trolls Target His Comments at “Varanasi” EventRGV Defends Rajamouli After Trolls Target His Comments at “Varanasi” Event

Ram Gopal Varma has stepped into the ongoing social media storm surrounding SS Rajamouli’s comments about Lord Hanuman during the event of his upcoming film Varanasi. A section of netizens