hyderabadupdates.com movies అవతార్ వచ్చినా… దురంధరే గెలుస్తోంది

అవతార్ వచ్చినా… దురంధరే గెలుస్తోంది

ఒక బాలీవుడ్ మూవీ మూడో వారంలోనూ సూపర్ స్ట్రాంగ్ గా ఉండటం చూసి ఎన్ని నెలలయ్యిందో గుర్తు చేసుకోవడం కష్టం. అది కూడా రిలీజ్ కు ముందు నెగటివ్ వైబ్రేషన్స్ మోసుకుని, ఉద్దేశపూర్వకంగా కొందరు క్రిటిక్స్ నెగటివ్ చేయాలని చూసినా తట్టుకుని ఫైనల్ గా ఇండస్ట్రీ హిట్ వైపు పరుగులు పెడుతోంది. ప్రస్తుతం పుష్ప 2 హిందీ వెర్షన్ పేరుమీదున్న ఎనిమిది వందల కోట్ల పై చిలుకు నెంబర్ ని టార్గెట్ చేసిన దురంధర్ చాలా వేగంగానే అందుకునేలా ఉన్నాడు. ప్యాన్ ఇండియా లేకుండా కేవలం సింగల్ లాంగ్వేజ్ లో వచ్చి రికార్డులు బద్దలు కొట్టిన మూవీగా దురంధర్ సాధించబోయే మైలురాళ్ళు ఇంకా చాలానే ఉన్నాయి.

ఇక్కడిదాకా బాగానే ఉంది కానీ అవతార్ ఫైర్ అండ్ యాష్ వచ్చిన తర్వాత దురంధర్ స్పీడ్ తగ్గుతుందేమోనని ట్రేడ్ వర్గాలు అనుమానించాయి. కానీ ఆ సూచనలు లేవు. దర్శకుడు జేమ్స్ క్యామరూన్ ఈసారి పూర్తి స్థాయి అంచనాలు అందుకోలేదని పబ్లిక్ టాక్ చూస్తే అర్థమైపోతుంది. రివ్యూలు కూడా అధిక శాతం పెదవి విరిచాయి. విజువల్ ఎఫెక్ట్స్ ఎంత అద్భుతంగా ఉన్నా అదే కథను తిప్పి తిప్పి మూడున్నర గంటలు చూపించారనే కంప్లైంట్ ఎక్కువగా వినిపిస్తోంది. వీకెండ్ వరకు బాగానే ఉన్నా తర్వాత నెమ్మదించడం ఖాయమని డిస్ట్రిబ్యూటర్లకు అర్థమైపోయింది. దీంతో దురంధర్ షోలు మళ్ళీ పెరుగుతున్నాయి.

విచిత్రం ఏమిటంటే దక్షిణాది రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో దురంధర్ ఇంకా కొనసాగుతోంది. పబ్లిక్ డిమాండ్ ఉండటంతో ఇంకా రన్ ఇచ్చేందుకు థియేటర్ యజమాన్యాలు ముందుకొస్తున్నాయి. పైగా నార్త్ లో అఖండ తాండవం 2 నిరాశపరిచే దిశగా వెళ్తుండటంతో దాని కౌంట్ తగ్గిపోయి దురంధర్ నెంబర్ పెరుగుతోంది. సోషల్ మీడియాలో సెలబ్రిటీల మద్దతు  దురంధర్ కు పెరుగుతోంది. సందీప్ రెడ్డి వంగా, రామ్ గోపాల్ వర్మ, అల్లు అర్జున్ తదితరులు దర్శకుడు ఆదిత్య ధార్ తో పాటు టీమ్ మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.చూస్తుంటే వెయ్యి కోట్లు దాటనిదే దురంధర్ శాంతించేలా లేడు.

Related Post

ఆఫీసులు సరే… థియేటర్లు దొరుకుతాయా?ఆఫీసులు సరే… థియేటర్లు దొరుకుతాయా?

తెలుగు సినిమాలకు మార్కెట్ పరంగా అతి పెద్ద ఏరియా అయిన నైజాంలో ఉన్నట్లుండి కొత్త కొత్త డిస్ట్రిబ్యూషన్ ఆఫీసులు మొదలు కావడం ఇటీవల చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ ఏరియాలో ఎన్నో ఏళ్ల నుంచి దిల్ రాజు, సునీల్ నారంగ్, సురేష్

Dashamakan Promo: Harish Kalyan Stuns With Dual-Shaded Urban MakeoverDashamakan Promo: Harish Kalyan Stuns With Dual-Shaded Urban Makeover

Harish Kalyan’s upcoming film Dashamakan has set the internet buzzing with its newly released title promo, offering a gritty, tense, and striking first look. Produced by IDAA Productions and Think