hyderabadupdates.com movies అసభ్యకరమైన వీడియో… చిక్కుల్లో జనసేన ఎమ్మెల్యే?

అసభ్యకరమైన వీడియో… చిక్కుల్లో జనసేన ఎమ్మెల్యే?

తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే, జనసేన అరవ శ్రీధర్ పై సంచలన ఆరోపణలు వస్తున్నాయి. అరవ శ్రీధర్ ఓ మహిళతో నగ్నంగా వీడియో కాల్ చేశారంటూ ఆరోపణలు వస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఓ మహిళను ఏడాదిన్నరగా బెదిరిస్తున్న శ్రీధర్ ఆమెను బలవంతంగా లోబర్చుకున్నాడనని, ఆమె గర్భవతి కావడంతో ఆమెకు అబార్షన్ చేయించాడని ఓ మీడియా ఛానెల్ లో కథనం వచ్చింది. అంతేకాదు, ఉద్యోగం చేస్తున్న ఆమె భర్తకు విడాకులు ఇవ్వాలని కూడా అరవ శ్రీధర్ బెదిరించారని ఆ కథనంలో ఆరోపించారు.

సదరు మహిళను పెళ్లి చేసుకుంటానని బలవంతం చేయగా…అందుకు ఆ మహిళ ఒప్పుకోలేదని ఆరోపణలు వచ్చాయి. దీంతో, ఆమె భర్తకు ఫోన్ చేసి అరవ శ్రీధర్ బెదిరించారని, ఆ క్రమంలో ఆ మహిళకు తన భర్తతో విభేదాలు వచ్చాయట.

భర్తకు విడాకులివ్వకుంటే మూడేళ్ల కుమారుడిని చంపేస్తానని శ్రీధర్ బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఏడాదిన్నర కాలంగా ఆ టార్చర్ భరించిన సదరు మహిళ ఇక తట్టుకోలేక శ్రీధర్ తో వాట్సాప్ వీడియో కాల్స్, వాట్సాప్ చాట్ హిస్టరీ బయటపెట్టారని తెలుస్తోంది. అయితే, ఈ వ్యవహారంపై అరవ శ్రీధర్, జనసేన నేతలు అధికారికంగా స్పందించాల్సి ఉంది.

Related Post

బాబా వారికి ట్రంప్ సెగ‌.. మోడీకి మ‌ద్ద‌తు!బాబా వారికి ట్రంప్ సెగ‌.. మోడీకి మ‌ద్ద‌తు!

రాందేవ్ బాబాగా ప్ర‌చారంలో ఉన్న ప‌తంజ‌లి సంస్థ వ్య‌వ‌స్థాప‌కుడు, ప్ర‌ముఖ క్రియా యోగ ద్వారా ప్ర‌పంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆయ‌న‌కు.. తాజాగా అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న సుంకాల బెడ‌ద చుట్టుకుంది. పతంజ‌లి సంస్థ ద్వారా ఆయుర్వేద మందులు..

‘ఫైర్’ పెరిగి తగ్గి.. ఏపీ మహిళా ఎమ్మెల్యేల గ్రాఫ్ ఇదే..!‘ఫైర్’ పెరిగి తగ్గి.. ఏపీ మహిళా ఎమ్మెల్యేల గ్రాఫ్ ఇదే..!

కొంతమంది మహిళా నేతలు ఈ ఏడాది జోరుగా రెచ్చిపోయారు. నియోజకవర్గంతో పాటు స్థానిక రాజకీయాల్లో తమ హవా చూపించాలన్న ఉద్దేశంతో పలువురు మహిళా నేతలు దూకుడు చూపించారు. అయితే తొలి రోజుల్లో కనిపించిన ఆ దూకుడు, తర్వాత కాలంలో తగ్గడం చర్చనీయాంశంగా

అంజ‌న్న‌ సన్నిధిలో పవన్ – ధర్మశాలకు శంకుస్థాపనఅంజ‌న్న‌ సన్నిధిలో పవన్ – ధర్మశాలకు శంకుస్థాపన

తెలంగాణ‌లోని జ‌గిత్యాల జిల్లాలో ఉన్న‌ ప్ర‌సిద్ధ‌.. కొండ‌గ‌ట్టు ఆంద‌జ‌నేయ‌స్వామి(అంజ‌న్న‌)ని ఏపీ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ ద‌ర్శించుకున్నారు. శ‌నివారం.. ఉద‌యం.. మంగ‌ళగిరి నుంచి హైద‌రాబాద్‌కు వ‌చ్చిన ఆయ‌న‌.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో జ‌గిత్యాల జిల్లాలోని కొండ‌గ‌ట్టుకు చేరుకున్నారు. ఆల‌య అధికారులు..