hyderabadupdates.com movies ఆదాయం తెచ్చే ప్లాన్ అదిరిపోయిందయ్యా

ఆదాయం తెచ్చే ప్లాన్ అదిరిపోయిందయ్యా

మాములుగా ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ఆడియో లాంచులు అభిమానులకు ఉచితంగా చూపిస్తారు. పాసులు ఇచ్చినా వాటికేం డబ్బులు ఉండవు. ఎంత పెద్ద స్టార్ హీరోకైనా ఒకటే వర్తిస్తుంది. అంత ఖర్చు పెట్టి చేసిన వారణాసి వేడుకలో పాస్ పోర్టులు కోరినన్ని పంచి పెట్టారు తప్పించి పైసా తీసుకోలేదు. కానీ విజయ్ జన నాయకుడు టీమ్ ఒక అడుగు ముందుకేసి సరికొత్త ఆదాయ వనరుని సృష్టిస్తోంది. వచ్చే నెల చివరి వారం మలేషియాలో జరగనున్న ఆడియో విడుదల ఈవెంట్ కు కనివిని ఎరుగని ఏర్పాట్లు చేస్తున్నారు. కోలీవుడ్ చరిత్రలో ఇప్పటిదాకా ఎవరూ నిర్వహించనంత గ్రాండ్ గా ఏళ్ళ పాటు చెప్పుకునేలా ప్లానింగ్ సాగుతోందట.

అయితే అసలు విశేషం ఇది కాదు. ఈ వేడుకకు టికెట్ రేట్లు పెట్టారు. మొత్తం మూడు లెవెల్స్ లో సాధారణ అభిమానుల కోసం విభజన చేస్తారట. లెవెల్ 1లో మలేషియా కరెన్సీ 299 రింగిట్లు చెల్లించాలి. అంటే మన వాడుకలో సుమారు 6450 రూపాయలు. లెవెల్ 2కి 199 రింగిట్లు(4300 రూపాయలు), లెవెల్ 3కి 99 రింగిట్లు(2135 రూపాయలు) కట్టాలి. మొత్తం స్టేడియం కెపాసిటీ 85 వేల నుంచి లక్ష మంది దాకా పడతారు. అందరూ టికెట్లు కొనేలా అయితే సుమారు 42 కోట్ల రూపాయలు వసూలవుతాయి. ఇది చాలా పెద్ద మొత్తం. స్పాన్సర్లు, వీడియో హక్కులు వగైరాలు ఇంకా ఫైనల్ కావాల్సి ఉందట. వాటికీ పెద్ద నెంబర్లే వస్తాయి.

అనిరుధ్ లైవ్ కన్సర్ట్ లో విజయ్ నటించిన హిట్ సినిమాల పాటలన్నీ ఒరిజినల్ సింగర్స్ తోనే పాడించబోతున్నారు. ఎస్బి బాలసుబ్రమణ్యం దివంగతులు కావడంతో ఆయన స్థానంలో ఎస్పి చరణ్ ఆ బాధ్యత తీసుకోనున్నారు. సాంగ్స్, డాన్సులు, విజయ్ తో పని చేసిన దర్శక నిర్మాతల జ్ఞాపకాలు, అరుదైన వీడియో ప్రదర్శనలు, విజయ్ పవర్ ఫుల్ స్పీచ్ ఒకటేమిటి ఇంకా బయటికి చెప్పని బోలెడు సర్ప్రైజులు ఉంటాయని చెన్నై సమాచారం. ఏదైతేనేం ఆదాయం తెచ్చే ప్లాన్ భలే ఉంది. ఇటు ఈవెంట్ అంగరంగ వైభవంగా జరగడంతో పాటు కాసులకు ఇబ్బంది లేకుండా లాభాలతో హ్యాపీగా బయటపడొచ్చు.

Related Post

ఒలా ఇంజనీర్.. 28 పేజీల సూసైడ్ నోట్‌ఒలా ఇంజనీర్.. 28 పేజీల సూసైడ్ నోట్‌

బెంగళూరులో ఒలా ఎలక్ట్రిక్‌లో పనిచేస్తున్న కె. అరవింద్ (38) అనే ఇంజనీర్ ఆత్మహత్య కేసు ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. అరవింద్ చనిపోయే ముందు రాసిన 28 పేజీల సూసైడ్ నోట్‌లో, ఒలా ఫౌండర్ భావిష్ అగర్వాల్‌తో సహా తన ఉన్నతాధికారులు తనను

మంచి సినిమా… టీఎఫ్ఐ ఫెయిల్డ్?మంచి సినిమా… టీఎఫ్ఐ ఫెయిల్డ్?

#TFIFailedhere.. సోషల్ మీడియాను ఫాలో అయ్యేవాళ్లకు ఈ హ్యాష్ ట్యాగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మంచి కంటెంట్ ఉండి కూడా సరిగా ఆడని సినిమాల గురించి ప్రస్తావిస్తూ.. దీన్ని వాడుతుంటారు. ‘ఖలేజా’ సహా ఎన్నో సినిమాల విషయంలో అభిమానులు