హైదరాబాద్ : ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన మూవీ దురంధర్ -2 చిత్రం ఆశించిన దానికంటే దూసుకు పోతోంది. కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మార్చి 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా సినీ విశ్లేషకులు సినిమా మూవీపై స్పందించారు. తాజాగా దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కీలక వ్యాఖ్యలు చేశాడు. నాకు ధురందర్-1 చాలా నచ్చిందని, కానీ ‘ది రివెంజ్’ పరిమాణంలోనూ, ఆత్మలోనూ అసలు చిత్రాన్ని మించి పోయిందన్నాడు. రచన, నటీనటుల ఎంపిక, సాంకేతిక నైపుణ్యం, సంగీతం, ప్రపంచ రూపకల్పన, దర్శకత్వం అన్నీ దోషరహితంగా ఉన్నాయి. కానీ, ఇందులోని భావోద్వేగ భరితమైన అంశాలే ఈ సినిమాకు అసలైన ఆధారాన్ని ఇచ్చాయని స్పష్టం చేశారు జక్కన్న అలియాస్ ఎస్ఎస్ రాజమౌళి.
రచన, భావోద్వేగాలతో నిండిన నిజమైన ఉత్కంఠను సృష్టించేలా కథలో మలుపులను అద్భుతంగా ఉందన్నాడు . దర్శకుడు ఆదిత్య ధర్ ను ప్రశంసలతో ముంచెత్తాడు. 4 గంటల నిడివి ఉన్న సినిమాను తీసి విడుదల చేయడానికి చాలా ధైర్యం కావాలన్నారు. చివరి ఫ్రేమ్ వరకు ప్రేక్షకులు సీట్లకు అతుక్కు పోవడం దర్శకుడి ప్రతిభే కారణమన్నారు. అద్భుతమైన నటన అని పేర్కొన్నారు. షెడ్డులో సోదరితో ఉన్న సన్నివేశం నటనలో ఒక మాస్టర్ క్లాస్. ఆ ప్రారంభం నుండి గుండెను పిండేసే క్లైమాక్స్ వరకు, హమ్జా జస్కిరత్గా మీరిద్దరూ మమ్మల్ని మంత్ర ముగ్ధులను చేశారని ప్రశంసించారు.
The post ఆదిత్య ధర్ దురంధర్ -2 నచ్చిందన్న జక్కన్న appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
ఆదిత్య ధర్ దురంధర్ -2 నచ్చిందన్న జక్కన్న
Categories: