hyderabadupdates.com movies ఆది ఆనందానికి అవధులు లేవు

ఆది ఆనందానికి అవధులు లేవు

చాలా ఏళ్ల నుంచి ఆది సాయికుమార్ పేరుతో ఒక హీరో టాలీవుడ్లో ఉన్నాడనే విషయాన్నే మరిచిపోయారు థియేటర్లకు వెళ్లే తెలుగు ప్రేక్షకులు. ప్రేమ కావాలి, లవ్లీ చిత్రాలతో ప్రామిసింగ్‌గా మొదలైన అతడి కెరీర్.. తర్వాత గాడి తప్పింది. వరుస ఫ్లాపుల దెబ్బకు మార్కెట్ జీరో అయిపోయి.. తన సినిమాలు థియేటర్లలో రిలీజవడమే గగనం అయిపోయింది. కేవలం ఓటీటీల్లో మాత్రమే తన సినిమాలకు ఆదరణ దక్కేది. 

అలాంటి హీరో నుంచి వచ్చిన ‘శంబాల’ సినిమా.. క్రిస్మస్ వీకెండ్లో రిలీజై ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన తెచ్చుకుంది. దీని ప్రోమోలు చూస్తేనే ఇది విషయం ఉన్న సినిమా అని అర్థమైంది. రిలీజ్ తర్వాత కంటెంట్‌తో మెప్పించిన ‘శంబాల’.. క్రిస్మస్ వీకెండ్లో తీవ్రమైన పోటీని తట్టుకుని బాక్సాఫీస్ విజేతగా నిలిచింది. రూ.20 కోట్లకు చేరువగా ఉన్నాయి ఈ సినిమా వసూళ్లు.

శంబాల విజయం ఆదితో పాటు సాయికుమార్ కుటుంబం మొత్తాన్ని ఎంతగా సంతోషంలో ముంచెత్తుతూ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇటీవల సక్సెస్ మీట్లో సాయికుమార్‌తో పాటు ఆయన సోదరులు కూడా అమితానందంతో కనిపించారు.

ఇప్పుడు ఆ కుటుంబం ఆనందాన్ని రెట్టింపు చేసే పరిణామం జరిగింది. ఆది రెండోసారి తండ్రి అయ్యాడు. అతడి భార్య పండంటి మగబడ్డకు జన్మనిచ్చింది. ఆది దంపతులకు ఇప్పటికే ఒక పాప ఉంది. తన పేరు అయానా.

తనకు బాబు పుట్టిన విషయాన్ని వెల్లడిస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టి తన ఆనందాన్ని పంచుకున్నాడు ఆది. ఓవైపు సినిమా సూపర్ హిట్టు.. ఇంకోవైపు కొడుకు జననంతో ఆదికి సంబరాలకు అంతేలేదంటూ తన అభిమానులు పోస్టులు పెడుతున్నారు. ముఖ్యంగా ఇండస్ట్రీలో అందరి వాడిగా గుర్తింపు తెచ్చుకున్న సాయికుమార్ విషయంలో అందరూ చాలా హ్యాపీగా ఫీలవుతున్నారు.

Related Post

నిర్మాతల నిర్ణయాలకు హీరోలు నిందలు మోస్తున్నారునిర్మాతల నిర్ణయాలకు హీరోలు నిందలు మోస్తున్నారు

సంక్రాంతి వస్తోందంటే మన బాక్సాఫీస్ దగ్గర ఎంత పోటీ ఉంటుందో.. థియేటర్ల కోసం ఎలాంటి గొడవలు నడుస్తాయో తెలిసిందే. అటు తమిళంలో కూడా సంక్రాంతి క్రేజీ సీజనే. అక్కడ కూడా సినిమాల మధ్య విపరీతమైన పోటీ, థియేటర్ల కోసం గొడవలు కామనే.

అఖండ హీరోయిన్ ను ఎందుకు తీసేసారో లీక్ చేసిన బాలయ్యఅఖండ హీరోయిన్ ను ఎందుకు తీసేసారో లీక్ చేసిన బాలయ్య

నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీనుల కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘అఖండ’లో ప్రగ్యా జైశ్వాల్  కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే. అంతకుముందు బోయపాటి చిత్రం ‘జయ జానకి నాయక’లో చిన్న పాత్ర చేసిన ప్రగ్యాకు.. ‘అఖండ’లో మెయిన్ హీరోయిన్‌గా ప్రమోషన్ దక్కింది.

మండలిలో కవిత మంగమ్మ శపథం!మండలిలో కవిత మంగమ్మ శపథం!

బీఆర్‌ఎస్ నుంచి సస్పెన్షన్‌కు గురైన మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె, మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్సీ కవిత సోమవారం సంచలన ప్రకటన చేశారు. మండలిలో మాట్లాడిన ఆమె, తెలంగాణ ఉద్యమానికి ముందే ప్రారంభించిన తెలంగాణ జాగృతిని త్వరలోనే రాజకీయ పార్టీగా మారుస్తామని