hyderabadupdates.com movies ఆమిర్ పెళ్లి చేసుకున్నట్లేనట

ఆమిర్ పెళ్లి చేసుకున్నట్లేనట

బాలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకడైన ఆమిర్ ఖాన్‌కు ఇప్ప‌టికే రెండుసార్లు పెళ్ల‌వడం.. ఆ ఇద్దరి నుంచి విడాకులు తీసుకోవడం తెలిసిందే. ముందుగా త‌న చిన్న‌నాటి స్నేహితురాలు రీనా ద‌త్తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమిర్.. 2002లో ఆమె నుంచి విడిపోయాడు. కొన్నేళ్ల‌కు కిర‌ణ్ రావును పెళ్లాడిన అత‌ను.. ఆమె నుంచి కూడా నాలుగేళ్ల కింద‌ట విడాకులు తీసుకున్నాడు.

ఐతే 60వ పడిలో ఆయన కొత్తగా మరో బంధాన్ని మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ బంధం గురించి గత ఏడాది రూమర్లు వినిపిస్తున్న సమయంలో ఆమిరే స్వయంగా దాని గురించి ఓపెన్ అయిపోయాడు.

గత ఏడాది పుట్టిన రోజు సంద‌ర్భంగా మీడియా ప్ర‌తినిధుల‌తో క‌లిసి కేక్ క‌ట్ చేసిన ఆమిర్.. తాను గౌరీ స్ప్రాట్ అనే బెంగ‌ళూరుకు చెందిన త‌న స్నేహితురాలితో ఏడాదిగా రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు వెల్లడించాడు. గౌరీ త‌న‌కు 25 ఏళ్లుగా తెలుస‌ని.. ఆమె త‌న‌కు ఎప్పట్నుంచో మంచి స్నేహితురాల‌ని ఈ సంద‌ర్భంగా ఆమిర్ చెప్పాడు.

గౌరీకి ఆరేళ్ల కొడుకు కూడా ఉన్న సంగతి కూడా తనే వెల్లడించాడు. ఐతే గౌరీతో ఆమిర్ పెళ్లి ఎప్పుడా అని అందరూ ఎదురు చూడగా.. ఆ కబురు ఇంకా చెప్పట్లేదు ఆమిర్. ఐతే తాజాగా ఆమిర్ తన పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్ చేశాడు. గౌరీతో తనకు ఆల్రెడీ పెళ్లయిపోయినట్లే అని వ్యాఖ్యానించాడు.

‘‘గౌరీ, నేను ఒకరినొకరం అర్థం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం. మా దృష్టిలో వివాహం అంటే రెండు మనసుల కలయిక. ఆ రకంగా చూస్తే మేం పెళ్లి చేసుకున్నట్లే. ప్రస్తుతం మేం కలిసే ఉంటున్నాం. ఈ వివాహాన్ని మేం అధికారికం చేయాలా వద్దా అన్నది భవిష్యత్తులో నిర్ణయించుకుంటాం’’ అని ఆమిర్ తెలిపాడు.

గౌరీకి బెంగళూరులో బ్యూటీపార్లర్స్ ఉన్నాయి. ఐతే ఆమె కొన్నేళ్లుగా ఆమిర్ నిర్మాణ సంస్థలో సహాయకురాలిగా పని చేస్తున్నారు. గత ఏడాది ‘సితారే జమీన్ పర్’ చిత్రంతో పలకరించిన ఆమిర్.. ప్రస్తుతం తన కొడుకు జునైద్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న ‘ఏక్ దిన్’ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

Related Post

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి మునిగిపోతుంది అంటూ వైసీపీ విష ప్రచారం చేస్తోంది. దీనిని టీడీపీ నేతలు సమర్థంగా తిప్పి కొడుతున్నారు. మాజీ సీఎం వైఎస్

Peddi: Fans await the special treat dropping today — what’s Buchi Babu Sana cooking?Peddi: Fans await the special treat dropping today — what’s Buchi Babu Sana cooking?

Mega Power Star Ram Charan’s upcoming sports drama Peddi, directed by Buchi Babu Sana, is riding high on buzz. The first single, “Chikiri Chikiri,” composed by A.R. Rahman, has turned