hyderabadupdates.com movies ఆయ‌నో మ‌ర్రి చెట్టు: టీడీపీ కామెంట్‌.. !

ఆయ‌నో మ‌ర్రి చెట్టు: టీడీపీ కామెంట్‌.. !

కొంద‌రు నాయ‌కులు తాము ఎదుగుతూ.. తోటి వారిని ఎదిగేలా స‌హ‌క‌రిస్తారు. ఇది ఎక్క‌డైనా ఉంటుంది. అయితే.. కొన్ని కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో మాత్రం.. దీనికి భిన్న‌మైన ప‌రిస్థితి క‌నిపిస్తోంది. తాము ఎదగ‌డ‌మే ముఖ్య‌మ‌ని భావిస్తున్న నాయ‌కులు కొంద‌రు టీడీపీలో చ‌ర్చ‌కు వ‌స్తున్నారు. గుంటూరు జిల్లాలోని ఓ కీల‌క నియోజ‌క‌వ‌ర్గంలో 25 ఏళ్లుగా ఒకే నాయ‌కుడు పాతుకుపోయారు. ఆయ‌న‌పై ఆరోప‌ణ‌లు కూడా త‌క్కువేమీ లేవు. అయినా.. ఆయ‌న త‌ప్ప ఇంకెవ‌రూ పార్టీ కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌డానికి వీల్లేద‌ని ష‌ర‌తు విధించారు.

ఇక‌, విజ‌య‌వాడ‌లోని ఓ కీల‌క నియోజ‌క‌వ‌ర్గంలోనూ ఇదే ప‌రిస్థితి ఉంది. ఇక్క‌డ వ‌రుస విజ‌యాలు ద‌క్కిం చుకోక‌పోయినా.. గ‌త ఎన్నిక‌ల్లో స‌ద‌రు ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు విజ‌యం ద‌క్కించుకున్నారు. వాస్త‌వానికి ఇక్క‌డ పార్టీ పుంజుకునేందుకు భారీ స్కోప్ ఉంది. నాయ‌కులు కూడా ఎక్కువ‌గా ఉన్నారు. కానీ, స‌ద‌రు ఎమ్మెల్యే మాత్రం ల‌క్ష్మ‌ణ రేఖ‌లు గీశారు. ఏం చేసినా.. త‌న‌కు తెలియాల్సిందేన‌ని ష‌ర‌తు విధించారు. దీంతో నాయ‌కులు ఎద‌గ‌లేక‌.. ఎమ్మెల్యే చెప్పిన‌ట్టే వింటున్నారు.

ఇలాంటి చ‌ర్య‌ల వ‌ల్ల పార్టీ పురోగ‌తికి ఇబ్బందులు వ‌స్తున్నాయ‌ని చెబుతున్నా.. స‌ద‌రు నేత మాత్రం వినిపించుకోవ‌డం లేదు. ఇక‌, అనంత‌పురంలో ఎమ్మెల్యే ఒక‌రు అయితే.. చ‌క్రం తిప్పుతోంది.. మ‌రొక‌రు అనే మాట వినిపిస్తోంది. ఉమ్మ‌డి అనంత‌పురంలోని మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఈ స‌మ‌స్య జోరుగా వినిపి స్తోంది. దీంతో పార్టీలో ఔత్సాహిక యువ‌త ముందుకు వ‌చ్చే ప‌రిస్థితి లేకుండా పోయింది. సీనియర్లు స‌రే.. జూనియ‌ర్ల‌కు కూడా అవ‌కాశం ఇవ్వాల‌ని పార్టీ చెబుతున్నా.. ఎవ‌రూ పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేదు.

ఇక‌, ప్ర‌తి విష‌యంలోనూ.. త‌న మాటే నెగ్గాల‌ని నెల్లూరు జిల్లాలో ఇద్ద‌రు ఎమ్మెల్యేలు భీష్మిస్తున్నారు. ఇది పార్టీ నాయ‌కుల‌కే కాకుండా.. అధికారుల‌కు కూడా తేల్చి చెబుతున్నారు. దీంతో ఇక్క‌డ కూడా ప‌నులు ముందుకు సాగడం లేదు. పార్టీ ప‌రంగా ముందుకు సాగేందుకు అవ‌కాశం ఉన్నా.. ఇలాంటి అడ్డంకుల కార‌ణంగా.. కార్య‌క‌ర్త‌లు ప‌నులు చేయ‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. ఈ వ్య‌వ‌హారంపై పార్టీ ఎప్ప‌టిక‌ప్పుడు దృష్టి పెడుతున్నా.. క్షేత్ర‌స్థాయిలో మాత్రం మార్పు క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు. 

Related Post

చిన్న సినిమా అయితే అంత రిస్క్ ఎందుకుచిన్న సినిమా అయితే అంత రిస్క్ ఎందుకు

సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్ గా ఉండే నిర్మాత నాగవంశీ నుంచి కొత్త స్టేట్ మెంట్లు వచ్చాయి. ఆనంద్ దేవరకొండ – వైష్ణవి చైతన్య జంటగా నిర్మించిన ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ టైటిల్ విడుదల సందర్భంగా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు

9 Malayalam Films Releasing in Summer 2026: Drishyam 3, Patriot to Pallichattambi9 Malayalam Films Releasing in Summer 2026: Drishyam 3, Patriot to Pallichattambi

Cast: Naslen, Prashanth Alexander Director: Abhinav Sunder Nayak Genre: Black Comedy Satire Release Date: May 15, 2026 Following the widespread acclaim of Advocate Mukundan Unni, director-editor Abhinav Sunder Nayak is