hyderabadupdates.com Gallery ఆ క్షణం చని పోవాలని అనుకున్నా: నటి హేమ

ఆ క్షణం చని పోవాలని అనుకున్నా: నటి హేమ

ఆ క్షణం చని పోవాలని అనుకున్నా: నటి హేమ post thumbnail image

హైద‌రాబాద్ : తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటి హేమ కు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన ఆమె, తన సహజమైన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందారు. అదే సమయంలో నేరుగా, బహిరంగంగా తన అభిప్రాయాలను చెప్పే స్వభావం వల్ల కూడా తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. టాలీవుడ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా దశాబ్దాల పాటు తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి హేమ ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన “మీట్ ది ప్రెస్” కార్యక్రమం హైదరాబాద్‌లోని తెలుగు ఫిలిం ఛాంబర్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఆమె ఇటీవల తనపై నమోదైన డ్రగ్స్ కేసు, దాని వల్ల తన కుటుంబం ఎదుర్కొన్న ఇబ్బందులు, మీడియా పాత్ర వంటి అంశాలపై భావోద్వేగంగా స్పందించారు.
డ్రగ్స్ కేసులో తనపై వచ్చిన ఆరోపణలు తనను తీవ్రంగా మానసికంగా కలచి వేశాయని చెప్పారు. “ఆ సమయంలో నేను చచ్చి పోవాలని అనిపించింది. అంతగా మానసికంగా కుంగిపోయానంటూ వాపోయారు.అయితే తాను ఎలాంటి తప్పు చేయలేదని, అందుకే చివరకు నిర్దోషిగా బయటకు వచ్చానని స్పష్టం చేశారు. డ్రగ్స్ వ్యవహారంలో కొందరు మీడియా సంస్థలు తనపై నిరాధార ఆరోపణలు చేస్తూ బురద చ‌ల్లాయని ఆమె ఆరోపించారు. ఆ వార్తల కారణంగా తన వ్యక్తిగత జీవితం మాత్రమే కాకుండా కుటుంబ సభ్యులు కూడా తీవ్రంగా బాధపడ్డారని చెప్పారు. నా కుటుంబం చాలా సఫర్ అయింది. మాకు ఇది చాలా కఠినమైన కాలం అని ఆమె పేర్కొన్నారు. అయితే మొత్తం మీడియాను ఒకే తాటిపై వేయలేమని, నిజాయితీగా వ్యవహరించే మీడియా సంస్థలు తనకు మద్దతుగా నిలుస్తాయని తాను నమ్ముతున్నానని హేమ తెలిపారు. భవిష్యత్తులో కూడా మీడియా తనకు న్యాయం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
The post ఆ క్షణం చని పోవాలని అనుకున్నా: నటి హేమ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

DK Shivakumar: దిల్లీ డీకే వర్గీయుల పయనం ! ఆశక్తికరంగా కన్నడ రాజకీయాలు !DK Shivakumar: దిల్లీ డీకే వర్గీయుల పయనం ! ఆశక్తికరంగా కన్నడ రాజకీయాలు !

    కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుపై జోరుగా ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ క్యాంపు ఎమ్మెల్యేలు గురువారం మధ్యాహ్నం దిల్లీకి వెళ్లినట్లు సమాచారం. సీఎం మార్పునకు కాంగ్రెస్‌ అధిష్ఠానంపై ఒత్తిడి పెంచేందుకు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇచ్చిన మాట

నారావారి ప‌ల్లెలో చంద్ర‌బాబు ఫ్యామిలీ సంద‌డినారావారి ప‌ల్లెలో చంద్ర‌బాబు ఫ్యామిలీ సంద‌డి

చిత్తూరు జిల్లా : ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుకు సంక్రాంతి పండుగ వేళ తీపి క‌బురు ల‌భించింది. ఆయ‌న‌పై మోపిన అభియోగం, ఏపీ స్కిల్ డెవ‌లప్మెంట్ స్కాం కేసులో గ‌తంలో 50 రోజుల పాటు జైలు జీవితం గ‌డిపారు. ఆ

విద్యార్థి సూసైడ్ కేసులో ఆధారాలు చెరిపేశారువిద్యార్థి సూసైడ్ కేసులో ఆధారాలు చెరిపేశారు

కృష్ణా జిల్లా : రోజు రోజుకు సూసైడ్ ల సంఖ్య పెరుగుతోంది శ్రీ చైత‌న్య కాలేజీల‌లో చ‌దువుకుంటున్న విద్యార్థుల సంఖ్య‌. తాజాగా కృష్ణా జిల్లా లోని పెన‌మ‌లూరు పోరంకిలో చ‌దువుకుంటున్న మొల్లి ప‌వ‌న్ కుమార్ సూసైడ్ చేసుకోవ‌డం రాష్ట్ర వ్యాప్తంగా క‌ల‌క‌లం