hyderabadupdates.com movies ఆ సీనియర్ హీరో మోసగాడు అన్న భార్య

ఆ సీనియర్ హీరో మోసగాడు అన్న భార్య

బాలీవుడ్ సీనియర్ హీరోల్లో ఒకరైన గోవిందాకు, ఆయన భార్య సునీత ఆహుజాకు మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్నట్లు, ఇద్దరూ విడాకులు తీసుకుంటున్నట్లు కొన్ని నెలల ముందు వార్తలు రావడం తెలిసిందే. గతంలోనూ ఇద్దరూ విడిపోతున్నట్లు ప్రచారం జరిగింది. కానీ గొడవ సద్దుమణగడంతో వారి వివాహ బంధం సాఫీగానే సాగిపోతోందని అనుుకన్నారు. 

కానీ ఈసారి వ్యవహారం సీరియస్‌గానే ఉన్నట్లు కనిపిస్తోంది. సునీత విడాకుల పిటిషన్ కూడా ఫైల్ చేసినట్లు తెలుస్తోంది. గోవిందా మోసగాడని, అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడని.. తనపై గృహ హింసకు పాల్పడ్డాడని ఆమె ఆరోపించినట్లు ఇంతకుముందు వార్తలు రాగా.. గోవిందా లాయర్ ఆ ప్రచారాన్ని ఖండించారు. కానీ తర్వాత ఏమైందో స్పష్టత లేదు. కానీ ఇప్పుడు సునీతా ఆహుజా తన భర్త మీద బహిరంగంగా తీవ్ర ఆరోపణలు చేసింది. ఆయన్ని మోసగాడిగా అభివర్ణించింది.

‘‘చిన్నతనంలో అందరూ తప్పులు చేస్తారు. అది సహజం. నేను కూడా చాలా తప్పులు చేశాను. గోవిందా కూడా చేశాడు. కానీ ఒక వయసు వచ్చాక కూడా తప్పులు చేస్తూనే ఉంటే ఎలా? మీకు భార్య, పిల్లలు ఉన్నపుడు ఎందుకు అలాంటి తప్పులు చేస్తున్నారు? నిజం చెబుతున్నాను. గోవిందా తన జీవితంలో భార్య కంటే తన హీరోయిన్లతోనే ఎక్కువ గడిపాడు. మొదట్లో నాకు ఏమీ అర్థం కాలేదు. అన్నీ తెలిసేసరికి జీవితం చాలా ముందుకు వచ్చేసింది’’ అని సునీత కుండబద్దలు కొట్టేసింది. 

గోవిందా అక్రమ సంబంధాల విషయంలోనూ సునీత ముందు నుంచి గొడవ చేస్తున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ఇప్పుడు తన మాటల్ని బట్టి చూస్తే విడాకులకు కారణమేంటో అర్థమైపోయింది. ఇంతకుముందు భార్యకు సర్దిచెప్పుకోగలిగిన గోవిందా.. ఈసారి మాత్రం ఏమీ చేయలేకపోతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి 37 ఏళ్ల వీరి వివాహ బంధానికి త్వరలోనే తెరపడబోతున్నట్లు స్పష్టమైపోయింది.

Related Post

140 ఏళ్ల కాంగ్రెస్‌: దేశంలో సంద‌డి ఏది?140 ఏళ్ల కాంగ్రెస్‌: దేశంలో సంద‌డి ఏది?

జాతీయ కాంగ్రెస్ పార్టీ.. స్వాతంత్యోద్య‌మం నుంచి నేటి వ‌ర‌కు కూడా అనేక ఉత్థాన ప‌త‌నాలు ఎదుర్కొన్న పార్టీ ఇది. అతి పురాత‌న పార్టీనే అయినా.. ఒక‌ప్పుడు న‌వ‌న‌వోన్మేషంగా ముందుకు సాగింది. అయితే.. 2014 త‌ర్వాత‌.. దిగంతాల నుంచి దిగులు దిగులుగా.. దిగ‌జారుతున్న

అక్కడ మెస్సీ అభిమానుల విధ్వంసం.. ఇక్కడి మ్యాచ్ పై ఉత్కంఠ!అక్కడ మెస్సీ అభిమానుల విధ్వంసం.. ఇక్కడి మ్యాచ్ పై ఉత్కంఠ!

కోల్‌కతా సాల్ట్‌లేక్ స్టేడియంలో ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్సీ స్టేడియంలో కేవలం పది నిమిషాలే ఉన్నాడనే కారణంతో అభిమానులు తీవ్ర నిరాశకు, ఆగ్రహానికి గురయ్యారు. నిర్వాహకులు సరైన ఏర్పాట్లు చేయలేదని ఆరోపిస్తూ అభిమానులు