hyderabadupdates.com Gallery ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియ‌ల్ స్కూల్స్ పూర్తి కావాలి

ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియ‌ల్ స్కూల్స్ పూర్తి కావాలి

ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియ‌ల్ స్కూల్స్ పూర్తి కావాలి post thumbnail image

హైద‌రాబాద్ : యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియ‌ల్ స్కూల్స్ మొద‌టి విడ‌త‌లో పూర్త‌య్యే వాటిలో ఎక్కువగా బాలికలకు కేటాయించాల‌ని ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశించారు. రానున్న మూడేళ్ల‌లో ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గం లోనూ బాలురు, బాలిక‌ల‌కు ఒకొక్క‌టి చొప్పున వీటి నిర్మాణాలు పూర్తి చేయాలని స్పష్టంగా చెప్పారు. విద్యా శాఖకు సంబంధించిన అంశాలపై ముఖ్యమంత్రి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షించారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, ఒకటవ తరగతి నుంచి 10 వ తరగతి వరకు ఆధునిక అవసరాలకు అనుగుణంగా సిలబస్ లో మార్పులపై సమీక్షించారు. అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు.
ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ప్ర‌స్తుతం బాలిక‌ల‌కు కేటాయించిన నియోజ‌క‌వ‌ర్గంలో మ‌రో విడ‌తలో బాలుర‌కు కేటాయించాలని అన్నారు రేవంత్ రెడ్డి. ఈ స్కూళ్లలో సోలార్ కిచెన్ల నిర్మాణాలను పీఎం కుసుమ్‌లో చేపట్టే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. వీటి నిర్మాణాల‌కు సంబంధించి బిల్లుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు విడుద‌ల చేయాల‌ని సీఎస్ ను ఆదేశించారు. గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో 23 నూత‌న పాఠ‌శాల భ‌వ‌నాల నిర్మాణాలు వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రం నాటికి అందుబాటులోకి రావాల‌ని సీఎం స్ప‌ష్టం చేశారు. ప్ర‌స్తుత‌, భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు ఒక‌టి నుంచి 10 వ త‌ర‌గ‌తి వ‌ర‌కు సిల‌బ‌స్ మార్పుపై క‌స‌ర‌త్తును వెంట‌నే ప్రారంభించాలని అన్నారు.
The post ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియ‌ల్ స్కూల్స్ పూర్తి కావాలి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

మ‌హాశ‌క్తి ప‌థ‌కం పేరుతో మ‌హిళ‌ల ద‌గా : ష‌ర్మిలా రెడ్డిమ‌హాశ‌క్తి ప‌థ‌కం పేరుతో మ‌హిళ‌ల ద‌గా : ష‌ర్మిలా రెడ్డి

విజ‌య‌వాడ : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో పాల‌న గాడి త‌ప్పింద‌ని , రాచ‌రిక పాల‌న సాగుతోంద‌ని ఆరోపించారు. రెండేళ్లు కావొస్తున్నా మహాశక్తి పథకానికి అతి గతీ లేకుండా పోయింద‌న్నారు. పండుగల

Sabarimala: శబరిమల ఆలయంలో యోగదండం మాయం ?Sabarimala: శబరిమల ఆలయంలో యోగదండం మాయం ?

Sabarimala : శబరిమల గర్భగుడి నుండి బంగారు పూత కోసం తీసుకెళ్లిన అమూల్యమైన యోగదండం (పవిత్ర దండం) తిరిగి ఇవ్వబడలేదని సమాచారం బయటపడింది. పురాతన యోగదండం 2018లో బంగారు పూత కోసం తీసుకోబడింది. అయితే, బంగారు తాపడం తర్వాత కొత్తగా తయారు

CM Chandrababu: సీఐఐ సదస్సుకు విశాఖ చేరుకున్న సీఎం చంద్రబాబుCM Chandrababu: సీఐఐ సదస్సుకు విశాఖ చేరుకున్న సీఎం చంద్రబాబు

    ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖ వేదికగా జరగనున్న సీఐఐ సమ్మిట్ లో పాల్గొనడానికి ఏపీ సీఎం చంద్రబాబు విశాఖ చేరుకున్నారు. వాయుమార్గం ద్వారా విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్న రాష్ట్ర ముఖ్య‌మంత్రికి స్థానిక నేత‌లు మరియు