hyderabadupdates.com movies ఇండస్టీలో కొత్త డైరెక్టర్ల పరిస్థితి ఇది

ఇండస్టీలో కొత్త డైరెక్టర్ల పరిస్థితి ఇది

కొత్త టాలెంట్ రావాలి, క్రియేటివిటీకి పదును పెట్టాలనేది ఇండస్ట్రీలో రెగ్యులర్ గా వినిపించే మాట. ఎవరి దగ్గరైనా మంచి కథ ఉంటే నేరుగా వచ్చి మమ్మల్ని కలవండని చెప్పే ప్రొడ్యూసర్లు వందల సంఖ్యలో ఉంటారు. కానీ గ్రౌండ్ లెవెల్ పరిస్థితి వేరుగా, ఇంకా చెప్పాలంటే చేదుగా ఉంటుందనేది వాస్తవం. అయితే దీని గురించి అందరూ నోరు విప్పరు. ఎవరేం అనుకుంటారో, ఎక్కడ ఇబ్బంది పెడతారో అనే ఉద్దేశంతో లోలోపల బాధపడి కుమిలిపోయేవాళ్లే ఎక్కువ.

కొందరు మాత్రం ఉండబట్టలేక తాము అనుభవించిన క్షోభను బయట పెడతారు. సాంప్రదాయినీ సుప్పిని సుద్దపూసని దర్శకుడు సుధీర్ శ్రీరామ్ అందులో ఒకరు. ఆయన అనుభవం ఇలా ఉంది…

తాను రాసుకున్న స్టోరీని పెద్ద బ్యానర్లకు చెప్పే ఉద్దేశంతో సుధీర్ శ్రీరామ్ పలు అగ్ర సంస్థల ప్రతినిధులను కలుసుకునే ప్రయత్నం చేశారు. సితార ఎంటర్ టైన్మెంట్స్ కోసం ట్రై చేస్తే ఈ వ్యవహారాలు చూసుకునే వ్యక్తి అసలు ఆసక్తినే చూపించలేదు. పైకేదో విందాం అనే మాటే కానీ ఇంటరెస్ట్ లేదనే విషయం అర్థమైపోయింది.

గీతా ఆర్ట్స్ కోసం ఇదే తరహాలో కథ నెరేట్ చేయడానికి ట్రయిల్స్ వేస్తే అక్కడి రెప్రెజెజెంటేటివ్ ఆఫీస్ దగ్గర ఉండి కూడా దూరంలో ఉన్నానని అబద్దం చెప్పడం అసలు ట్విస్టు. అన్నపూర్ణ వెనుక వైపు ఆఫీస్ నడిపే మరో చోట కూడా ఇదే తరహా ఎక్స్ పీరియన్స్ చవి చూడాల్సి వచ్చింది. ఉదయం ఎనిమిదికి రమ్మన్నారు. బయలుదేరేముందు ఫోన్ చేస్తే వచ్చెయ్ అన్నారు. అక్కడికి చేరుకొని రెండు మూడు గంటలు వెయిట్ చేశాక తాపీగా సదరు వ్యక్తి వైజాగ్ ఫ్లైట్ లో ఉండటం వల్ల చెప్పలేకపోయానని చావు కబురు చల్లగా చెప్పాడు.

విమానంలో ప్రయాణం అంటే అప్పటికప్పుడు నిమిషాల్లో నిర్ణయించుకుని వెళ్ళేది కాదు. అలాంటప్పుడు కథ చెప్పాలని వచ్చిన దర్శకుడికి ఆ నిజమేదో చెప్పేస్తే ఇబ్బంది పడే అవసరం ఉండదు కదా. అసలు ఇంతగా దోబూచులాడాల్సిన అవసరం ఏముందనేది వర్ధమాన డైరెక్టర్లు అడుగుతున్న సూటి ప్రశ్న. దీని పైన దృష్టి సారించాల్సిన అవసరం చాలా ఉంది. కొత్తవాళ్లను ఎంకరేజ్ చేయకపోయినా పర్వాలేదు కానీ ఇలా తిప్పించుకుని తప్పించుకోవడం మాత్రం సబబు కాదు.

ఒకవేళ అవకాశం ఇచ్చే ఉద్దేశం లేకపోతే మొహం మీద చెప్పేస్తే వేరే ఆప్షన్లు చూసుకుంటారు. అంతే తప్ప ఇలా రా అని చెప్పి హ్యాండ్ ఇచ్చి వాళ్ళను వ్యయప్రయాసలకు గురి చేయడం ఇండస్ట్రీలో ఇతరుల మీద నమ్మకాన్ని పోగొడుతుంది. ఇది సదరు నిర్మాణ సంస్థలు, వాటి అధిపతులు కావాలని చేసింది కాకపోయినా వాళ్లను రిప్రెజెంట్ చేస్తున్న మనుషుల వల్ల ఎంతో కొంత చెడ్డ పేరు అయితే వస్తోంది. దీన్ని సరిచేయాల్సిన బాధ్యత దర్శకులది కాదు నిర్మాతలదే.

Related Post

Akhanda 2 OTT Release: When and where to watch Nandamuri Balakrishna’s fantasy actioner onlineAkhanda 2 OTT Release: When and where to watch Nandamuri Balakrishna’s fantasy actioner online

Akhanda 2: Thaandavam begins with a rivalry involving a neighbouring nation plotting to destroy India by attacking what it believes to be the country’s spiritual backbone. The rival nation plans

Sankranti Turns Andhra Pradesh into a Vibrant Tourism HotspotSankranti Turns Andhra Pradesh into a Vibrant Tourism Hotspot

The festive spirit of Sankranti has swept across Andhra Pradesh, transforming the state into a vibrant destination for culture driven tourism. From riverbanks to rural heartlands, celebrations are drawing visitors