hyderabadupdates.com movies ఇండస్ట్రీ హిట్టుకి ఇలాంటి స్పందనా

ఇండస్ట్రీ హిట్టుకి ఇలాంటి స్పందనా

మల్లువుడ్ లో అతి పెద్ద బ్లాక్ బస్టర్ గా అవతరించి మూడు వందల కోట్లకు పైగా వసూళ్లు సాధించిన లోకా చాప్టర్ 1 నిన్నటి నుంచి ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళం సంగతి పక్కనపెడితే ఎక్కువ శాతం ఇతర బాషల ప్రేక్షకులు దీన్ని థియేటర్ ఎక్స్ పీరియన్స్ చేయలేదు. తెలుగులో నాలుగైదు రోజులు హడావిడి చేసి తర్వాత నెమ్మదించిపోయింది. అందుకే డిజిటల్ రిలీజ్ కోసం ఎదురు చూశారు. అయితే లోకాకు అనూహ్యంగా చాలా మిక్స్డ్ టాక్ నడుస్తోంది. అనుకున్నంత గొప్ప లేదని కొందరు, బాగా ఓవర్ రేటెడ్ అని మరికొందరు సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. నెగటివ్ కామెంట్స్ కూడా ఉన్నాయి.

ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఒకటుంది. థియేటర్ అనుభూతికి టీవీలో చూడ్డానికి చాలా తేడా ఉంది. ఉదాహరణకు కల్కి 2898 ఏడిని తీసుకుంటే స్మార్ట్ స్క్రీన్ లో చూసి పెదవి విరిచిన వాళ్ళున్నారు. కానీ థియేటర్లలో ఎన్ని వందల కోట్లు వసూలు చేసిందో తెలిసిందే. టీవీలో లెక్కలేనన్నిసార్లు చూసిన బాహుబలిని మళ్ళీ బిగ్ స్క్రీన్ కోసం జనం ఎంతగా ఎగబడుతున్నారో వసూళ్ల సాక్షిగా కళ్ళముందు కనిపిస్తోంది. లోక చాప్టర్ 1 ఈ స్థాయి కాకపోయినా జనాన్ని మెప్పించడంలో అయితే సక్సెస్ అయ్యింది. అయితే కేరళ ఆడియన్స్ అభిరుచులకు మన టేస్ట్ కి వ్యత్యాసం ఉన్న సంగతి మర్చిపోకూడదు.

లోకా వాళ్ళకు ఎంతబాగా నచ్చినా మన జనాలకు మాత్రం ఆ స్థాయిలో కనెక్ట్ కాలేదన్నది వాస్తవం. కళ్యాణి ప్రియదర్శన్ కు ఎంత గొప్ప పేరు వచ్చినా ఇతర లాంగ్వేజెస్ లో అంత ఇంపాక్ట్ చూపించలేకపోయింది. త్వరలో లోకా చాప్టర్ 2 ప్రారంభించబోతున్నారు. టోవినో థామస్ హీరోగా నటించబోయే ఈ రెండో భాగానికి బడ్జెట్ అమాంతం పెంచేశారు. నిర్మాత దుల్కర్ సల్మాన్ ఎంత ఖర్చయినా సరే ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాడట. ఇప్పటికైతే ఈ సిరీస్ లో అయిదు కథలను సిద్ధం చేసినట్టు కోచి రిపోర్ట్.  చాప్టర్ 2 ఫలితం కూడా ఇలాగే వస్తే ఓకే కానీ లేదంటే మాత్రం అక్కడితో చరమగీతం పాడేయడం ఖాయం.

Related Post

మీసాల పిల్లా… లెక్క సరిపోయిందేమీసాల పిల్లా… లెక్క సరిపోయిందే

మన శంకరవరప్రసాద్ గారు నుంచి మీసాల పిల్ల వీడియో ప్రోమో వచ్చినప్పుడు దర్శకుడు అనిల్ రావిపూడి కొంత మిక్స్డ్ రెస్పాన్స్ అందుకున్నాడు. ట్యూన్ క్యాచీగా ఉన్నప్పటికీ కేవలం ఒక్క లైనే ఉండటం, కాస్ట్యూమ్స్ ప్లస్ బ్యాక్ గ్రౌండ్ మీద కొంత నెగటివ్

అందుకే రాజ‌మౌళి అక్క‌డున్నాడుఅందుకే రాజ‌మౌళి అక్క‌డున్నాడు

శుక్ర‌వారం ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా దేశ విదేశాల్లోని తెలుగు వారే కాదు, భార‌తీయ సినీ ప్రేమికులంద‌రూ ఆయ‌న్ని శుభాకాంక్ష‌ల్లో ముంచెత్తుతున్నారు. ఒక ద‌ర్శ‌కుడి మీద ఇండియా అంతటా ఏమాత్రం నెగెటివిటీ లేకుండా అభిమానం చూపించ‌డం అరుదైన