hyderabadupdates.com Gallery ఇండియాలో వ‌ర‌ల్డ్ కప్ మ్యాచ్ లు ఆడబోం

ఇండియాలో వ‌ర‌ల్డ్ కప్ మ్యాచ్ లు ఆడబోం

ఇండియాలో వ‌ర‌ల్డ్ కప్ మ్యాచ్ లు ఆడబోం post thumbnail image

బంగ్లాదేశ్ : బంగ్లాదేశ్, ఇండియా దేశాల మ‌ధ్య తీవ్ర ఉద్రిక్త‌త‌లు చోటు చేసుకున్న నేప‌థ్యంలో సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ). వ‌చ్చే ఫిబ్ర‌వ‌రి నెల‌లో భార‌త్, శ్రీ‌లంక దేశాలు సంయుక్తంగా ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 మెగా టోర్నీ జ‌ర‌గ‌నుంది. ఈ సంద‌ర్బంగా ఇండియాలో ఆడే క్రికెట్ మ్యాచ్ ల‌ను తాము ఆడ‌బోమంటూ తేల్చి చెప్పింది. ఇందుకు సంబంధించి కీల‌క లేఖ రాసింది ఐసీసీకి. దీనిపై ప‌రిశీలించాల‌ని కోరింది. ఇదిలా ఉండ‌గా ఐసీసీతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌ల బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు టి20 ప్రపంచ కప్ కోసం భారతదేశానికి వెళ్లడానికి వ్యతిరేకంగా తన వైఖరిని ధృవీకరించింది . త‌మ ఆట‌గాళ్ల భ‌ద్ర‌త‌కు ముప్పు వాటిల్లే ప్ర‌మాదం ఉంద‌ని పేర్కొంది. ఇందులో రెండో నిర్ణ‌యం అనేది లేనే లేద‌ని స్ప‌ష్టం చేసింది.
ఇప్ప‌టికే భార‌త్, పాకిస్తాన్ దేశాల మ‌ధ్య కూడా తీవ్ర ఉద్రిక్త‌త చోటు చేసుకుంది. గ‌త ఏడాది లో భార‌త్ ఆప‌రేష‌న్ సిందూర్ యాక్ష‌న్ చేప‌ట్టింది. దెబ్బ‌కు పాకిస్తాన్ దిగి వ‌చ్చింది. చివ‌ర‌కు పాకిస్తాన్ , ఇండియా దేశాల జ‌ట్ల మ‌ధ్య ఆయా దేశాల‌లో మ్యాచ్ లు జ‌ర‌గ‌డం లేదు. కేవ‌లం త‌ట‌స్థ ప్ర‌దేశాల‌లో మాత్ర‌మే మ్యాచ్ లు కొన‌సాగుతున్నాయి. అయితే ఐసీసీ మాత్రం రూల్స్ కు విరుద్దంగా వ్య‌వ‌హ‌రిస్తే మ్యాచ్ ల‌లో భారీగా కోత విధిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది.. బంగ్లాదేశ్‌లో రాజకీయ అశాంతి, భారతదేశంతో సంబంధాలు దెబ్బతిన్న తర్వాత ఆటలను శ్రీలంకకు మార్చాలని బోర్డు ఐసీసీని అభ్య‌ర్థించింది. అయితే దీనిపై ఇంకా నిర్ణ‌యం తీసుకోలేద‌ని తెలిపింది.
The post ఇండియాలో వ‌ర‌ల్డ్ కప్ మ్యాచ్ లు ఆడబోం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

తెలంగాణ ప్ర‌భుత్వ కార్య‌ద‌ర్శి రేసులో జ‌యేష్ రంజ‌న్తెలంగాణ ప్ర‌భుత్వ కార్య‌ద‌ర్శి రేసులో జ‌యేష్ రంజ‌న్

హైద‌రాబాద్ : గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వ హ‌యాంలో చ‌క్రం తిప్పిన సీనియ‌ర్ ఐఏఎస్ జ‌యేష్ రంజ‌న్ ప్ర‌స్తుతం కొలువు తీరిన కాంగ్రెస్ స‌ర్కార్ లో కూడా కీ రోల్ పోషిస్తున్నారు. తాజాగా జ‌యేష్ రంజ‌న్ సంచ‌ల‌నంగా మారారు. త‌ను ప్ర‌స్తుతం తెలంగాణ

లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ స‌భ్యుడిపై లుక్ అవుట్ నోటీస్లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ స‌భ్యుడిపై లుక్ అవుట్ నోటీస్

ముంబై : ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు ర‌ణ్ వీర్ సింగ్ ను బెదిరించిన కేసులో గ్యాంగ్ స్ట‌ర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ స‌భ్యుడిపై ఎల్ఓసీ జారీ అయ్యింది. బెదిరింపు ఆడియో క్లిప్ ను పంజాబ్ , హ‌ర్యానా పోలీసుల‌కు పంపించిన‌ట్లు పోలీసులు