hyderabadupdates.com movies ఇక లాంఛనమే… కారు ఎక్కబోతున్న జీవన్ రెడ్డి

ఇక లాంఛనమే… కారు ఎక్కబోతున్న జీవన్ రెడ్డి

సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన తెలంగాణ సీనియర్ రాజకీయవేత్త, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి ఇప్పటికే ఆ పార్టీకి రాజీనామా చేశారు. తాజాగా ఆయన తెలంగాణ ప్రతిపక్ష పార్టీగా కొనసాగుతున్న బీఆర్ఎస్ లోకి చేరబోతున్నారు. ఈ మేరకు బుధవారం జీవన్ రెడ్డి ఓ సంచలన ప్రకటన చేశారు. జగిత్యాల పర్యటనకు వస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో తాను భేటీ అవుతున్నానని ఆయన ప్రకటించారు. ఈ ఒక్క ప్రకటనతో ఆయన తాను బీఆర్ఎస్ లో చేరుతున్నానని ప్రకటించినట్టైంది.

రాజకీయ ప్రస్తానాన్ని టీడీపీతో ప్రారంభించిన జీవన్ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తిరుగులేని నేతగా ఎదిగారు. 1983లో టీడీపీ తరఫున జగిత్యాల నుంచి బరిలోకి దిగి ఎమ్మెల్యేగా గెలిచిన జీవన్ రెడ్డి.. నాటి ఎన్డీఆర్ కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత నాదెండ్ల భాస్కరరావు కేబినెట్ లోనూ ఆయన మంత్రిగా పనిచేశారు. తదనంతరం టీడీపీని వీడి కాంగ్రెస్ లో చేరిన జీవన్ రెడ్డి… మొన్నటిదాకా అదే పార్టీలో కొనసాగారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో విపరీతమైన ప్రాధాన్యం దక్కిన జీవన్ రెడ్డి… తన జిల్లాలో, ప్రత్యేకించి జగిత్యాలలో ఇక తనకు తిరుగు లేదన్నట్లుగా ఎదిగిపోయారు.

టీడీపీని వీడి కాంగ్రెస్ లో చేరిన ప్రస్తుత ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి… రాష్ట్రంలో హస్తం పార్టీకి పూర్వ వైభవం తీసుకుని వచ్చారు. ఇక ఎదగలేదన్న పార్టీని సీనియర్ నాయకులతో కలిసి ఏకంగా అధికారంలోకి తీసుకుని వచ్చారు. రేవంత్ సీఎం అయ్యాక ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలోనే జగిత్యాల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన బీఆర్ఎస్ నేత సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరారు. తన రాజకీయ ప్రత్యర్థిని తన అనుమతి లేకుండా పార్టీలో ఎలా చేర్చుకుంటారని ప్రశ్నించిన జీవన్ రెడ్డి…క్రమంగా పార్టీకి దూరమైపోయారు.

ఈ క్రమంలో జీవన్ రెడ్డి పార్టీ వీడుతున్నారన్న సమచారంతో మంత్రి శ్రీధర్ బాబు, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ లు జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లి మరీ ఆయనతో సంప్రదింపులు జరిపారు. అయితే కొత్త వారు వచ్చి పార్టీని సర్వనాశనం చేస్తున్నారంటూ మండిపడ్డ జీవన్ రెడ్డి… తాను తన మనసు చెప్పిన మాటనే వింటానంటూ తేల్చి చెప్పారు.

ఆ క్రమంలోనే కాంగ్రెస్ కు రాజీనామా చేసిన జీవన్ రెడ్డి… గురువారం జగిత్యాలలోనే కేటీఆర్ తో భేటీ కానున్నారు. ఈ భేటీలో జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరనున్నట్లుగా ప్రకటించే అవకాశం ఉంది. మొత్తంగా దాదాపుగా 4ే0 ఏళ్ల పాటు కాంగ్రెస్ తో సాగిన జీవన్ రెడ్డి… ఇప్పుడు బీఆర్ఎస్ లో చేరిపోతున్న వైనంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది.

Related Post

విల్లాల‌ను త‌ల‌పించేలా ఇళ్లు.. పేద‌ల ఇంటి క‌ల నెర‌వేర్చిన బాబువిల్లాల‌ను త‌ల‌పించేలా ఇళ్లు.. పేద‌ల ఇంటి క‌ల నెర‌వేర్చిన బాబు

సాధార‌ణంగా పేద‌లకు ప్ర‌భుత్వాలు క‌ట్టించి ఇచ్చే ఇళ్లు.. అన‌గానే ఎలాంటి వ‌స‌తులు ఉండ‌వ‌ని.. ఇరుకు ఇరుగ్గా ఉంటాయ‌ని భావిస్తారు. సాధార‌ణంగా ప్ర‌భుత్వాలు ఖ‌ర్చు త‌గ్గించుకునేందుకు ఇలాంటి ఇళ్ల‌నే పేద‌ల‌కు క‌ట్టించి ఇస్తాయ‌న్న వాద‌న కూడా ఉంది. కానీ, ఏపీలో దీనికి భిన్నంగా

బీహార్ రిజల్ట్.. పవన్, లోకేష్ ఏమన్నారంటేబీహార్ రిజల్ట్.. పవన్, లోకేష్ ఏమన్నారంటే

బీహార్ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ పక్షం అఖండ మెజారిటీ సాధించడంతో ఏపీలోని కూటమి నేతల్లో పుల్ జోష్ నెలకొంది. ఫలితాలు వెలువడుతున్న సమయంలో మంత్రి నారా లోకేష్ అభినందనలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు. బిహార్ లో ఎన్డీఏ ఘన విజయం సాధించిన

ఎవ‌రికి ఎప్పుడు `ముహూర్తం` పెట్టాలో లోకేష్ కు తెలుసుఎవ‌రికి ఎప్పుడు `ముహూర్తం` పెట్టాలో లోకేష్ కు తెలుసు

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేత‌ల‌ను ఉద్దేశించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. “అన్నీ గుర్తుంచుకున్నా. ఎవ‌రికి ఎప్పుడు ముహూర్తం పెట్టాలో నాకు బాగా తెలుసు“ అని ఆయ‌న వ్యాఖ్యానించారు. తాజాగా శుక్ర‌వారం రాజ‌మండ్రిలో ప‌ర్య‌టించిన లోకేష్‌..