hyderabadupdates.com Gallery ఇజ్రాయెల్ ఇరాన్ వార్ ఎఫెక్ట్ ‘టాక్సిక్’ వాయిదా

ఇజ్రాయెల్ ఇరాన్ వార్ ఎఫెక్ట్ ‘టాక్సిక్’ వాయిదా

ఇజ్రాయెల్ ఇరాన్ వార్ ఎఫెక్ట్ ‘టాక్సిక్’ వాయిదా post thumbnail image

బెంగ‌ళూరు : గీతా మోహ‌న్ దాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం టాక్సిక్. క‌న్న‌డ స్టార్ హీరో య‌శ్ కీల‌క పాత్ర పోషిస్తున్న మూవీ కావ‌డంతో ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు నెలకొన్నాయి. ఇప్ప‌టికే సినిమా రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు మూవీ మేక‌ర్స్. కానీ అనుకోకుండా ప్ర‌స్తుతం మ‌ధ్య ప్రాచ్యంలో యుద్దం కొన‌సాగుతోంది. ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా ఇరాన్ పై విరుచుకు ప‌డుతున్నాయి. ఈ త‌రుణంలో వ‌ర‌ల్డ్ వైడ్ గా విడుద‌ల కావాల్సిన టాక్సిక్ పై ఎక్కువ‌గా ప్ర‌భావం ప‌డుతుంద‌ని ఆలోచించిన మేక‌ర్స్ ఉన్న‌ట్టుండి ఎక్స్ వేదిక‌గా కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. చిత్ర నిర్మాతలు చివరి నిమిషంలో సినిమా విడుదల తేదీని మార్చి వాయిదా ప్రకటించడం ద్వారా అభిమానులను , ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు.
యష్ నటించిన టాక్సిక్ – ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్ ఈ సంవత్సరంలో అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాలలో ఒకటి. ఈ చిత్రం ఇప్పుడు జూన్ 4, 2026న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్ అనేది ప్రపంచ ప్రేక్షకుల కోసం సినిమాను సృష్టించాలనే దార్శనికతతో తాము భావించిన చిత్రం. కన్నడ, ఇంగ్లీషులో చిత్రీకరించిన ఈ మూవీ కోసం వ‌ర‌ల్డ్ వైడ్ గా ఎంత‌గానో ఎదురు చూస్తున్నారంటూ తెలిపారు. సంవత్సరాల అంకితభావంతో పనిచేసిన తర్వాత, మార్చి 19న మా చిత్రాన్ని మీ అందరితో పంచు కోవడానికి మేము సంతోషించామ‌ని పేర్కొన్నారు. ఇప్పుడు ఉన్న ప‌రిస్థితుల కార‌ణంగా టాక్సిక్ ను వాయిదా వేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు తెలిపారు.
The post ఇజ్రాయెల్ ఇరాన్ వార్ ఎఫెక్ట్ ‘టాక్సిక్’ వాయిదా appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

ఏపీలో 1000కి పైగా ఆధునిక గోడౌన్ల నిర్మాణంఏపీలో 1000కి పైగా ఆధునిక గోడౌన్ల నిర్మాణం

అమరావతి : ఏపీలో 1000కి పైగా ఆధునిక గోడౌన్ల నిర్మాణం చేప‌ట్ట‌నున్న‌ట్లు ప్ర‌కటించారు రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజార‌పు అచ్చెన్నాయుడు. శాసన మండలిలో వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి కింద ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను బహుళార్థ సాధక సౌకర్య

Prashant Kishor: రాహుల్‌ గాంధీ లాగే తేజస్వీ కూడా ఓడిపోతారు – ప్రశాంత్‌ కిశోర్‌Prashant Kishor: రాహుల్‌ గాంధీ లాగే తేజస్వీ కూడా ఓడిపోతారు – ప్రశాంత్‌ కిశోర్‌

Prashant Kishor : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బిహార్‌లో ప్రచారం జోరందుకుంటోంది. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ సొంత నియోజకవర్గమైన రాఘోపుర్‌ నుంచి జన్‌సురాజ్‌ పార్టీ తన ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే తేజస్వీ యాదవ్ పై ఆ పార్టీ

Mohan Bhagwat: సత్యం, ధర్మానికి రామాలయం ప్రతీక – మోహన్ భాగవత్Mohan Bhagwat: సత్యం, ధర్మానికి రామాలయం ప్రతీక – మోహన్ భాగవత్

    రామాలయ నిర్మాణం కోసం ఎందరో త్యాగాలు చేశారని, వారి ఆత్మలు ఈరోజు సంతోషంగా ఉంటాయని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. అయోధ్యలో బాలరాముడి ఆలయ శిఖరంపై ప్రధానమంత్రి మోదీతో కలిసి కాషాయ