hyderabadupdates.com movies ఇది కదా అభివృద్ధి వికేంద్రీకరణ

ఇది కదా అభివృద్ధి వికేంద్రీకరణ

ఏపీ సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్ నిజంగా ప్రత్యేకం. ఏపీ పునర్నిర్మాణానికి తాను కట్టుబడి ఉన్నానని సీఎం పలుసార్లు చెప్పారు. పరిపాలనలో ఆయన వేసే ప్రతి అడుగులో ఈ స్పష్టత కనిపిస్తోంది. రాజధాని అమరావతి నిర్మాణానికి ఒక స్పష్టమైన మాస్టర్ ప్లాన్ రూపొందించి, దాన్ని అమలు చేయడానికి ప్రణాళికా బద్ధంగా పని చేస్తున్నారు. అలాగే విశాఖపట్నం, తిరుపతి నగరాల అభివృద్ధికి కూడా మాస్టర్ ప్లాన్ సిద్ధం అవుతోంది.

గత వైసీపీ ప్రభుత్వం తెచ్చిన మూడు రాజధానుల సిద్ధాంతం పూర్తిగా ఫ్లాప్ అయిందని ప్రజలు ఇచ్చిన తీర్పు స్పష్టంగా చెబుతోంది. అమరావతిపై అక్కసుతోనే ఆ నిర్ణయం తీసుకున్నారని తెలుగుదేశంపార్టీ ఆరోపించింది. ఇదే సమయంలో ఒకటే రాజధాని అది అమరావతి అన్న విషయాన్ని స్పష్టంగా తెలిపింది. అభివృద్ధి అనేది వికేంద్రీకరణతో రావాలని కూడా ప్రకటించింది. ఈ దిశగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

ఇక అభివృద్ధి ఒక్క అమరావతిలోనే కాకుండా విశాఖ, తిరుపతి నగరాల్లో కూడా ఐటీ, పరిశ్రమలు, పర్యాటకం వంటి రంగాలను ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోంది. నగరాభివృద్ధి ప్రణాళికలో భాగంగా తీసుకుంటున్న ఈ చర్యలతో పౌరులకు మెరుగైన వసతులు, పచ్చదనం, ఆధునిక సాంకేతిక సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి.

విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ వచ్చే అవకాశం ఉండటంతో మరిన్ని పరిశ్రమలు కూడా రావచ్చని అంచనా. కొత్త కంపెనీలకు అవసరమైన భూసముపార్జన, అనుకూల వాతావరణం కల్పించడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. విశాఖను ప్రముఖ పెట్టుబడి కేంద్రంగా మార్చడం లక్ష్యం.

అమరావతి, తిరుపతి, విశాఖ పట్నాల్లో హాస్పిటాలిటీ రంగాన్ని విస్తృతంగా ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తోంది. అంతర్జాతీయ హోటల్ యూనిట్లను స్థాపించేందుకు ప్రోత్సాహాలు ఇవ్వనుంది. ఈ మూడు ఆర్థిక కారిడార్ల అభివృద్ధి పర్యవేక్షణ కోసం ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమించనున్నట్లు వెల్లడించింది.

పర్యాటక రంగ అభివృద్ధిలో భాగంగా బీచ్ టూరిజానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఈ విధంగా ఏపీ లోని మూడు ప్రధాన నగరాలను ప్రణాళికా బద్ధంగా అభివృద్ధి చేసి రాష్ట్రాన్ని కొత్త దారిలో నడపాలని ప్రభుత్వం భావిస్తోంది.

Related Post

ఇక్కడ ప్రతిపక్షం తరఫున నోరు విప్పే నాయకుడే లేరుఇక్కడ ప్రతిపక్షం తరఫున నోరు విప్పే నాయకుడే లేరు

రాజకీయాల్లో పోటీ లేకుండా ఎక్కడా ఉండదు. చిన్నచితకా పార్టీలైనా పోటీ ఇస్తుంటాయి. ఇక ప్రధాన పార్టీల మధ్య పోరు, పోటీ ఎలానూ ఉంటుంది. కానీ చిత్రంగా రాష్ట్రంలోని విజయవాడ, గుంటూరు పార్లమెంటు నియోజకవర్గాల్లో టిడిపికి పోటీ లేకుండాపోయింది. అంతేకాదు, ఈ రెండు