hyderabadupdates.com movies ఇది.. మోడీకి ఇన్‌స‌ల్ట్ కాదా?!

ఇది.. మోడీకి ఇన్‌స‌ల్ట్ కాదా?!

“భార‌త దేశం స‌ర్వ‌స‌త్తాక సార్వ‌భౌమ దేశం. ఇత‌ర దేశాల‌కు త‌ల‌వొంచ‌దు. ఎవ‌రో చెప్పిన‌ట్టు కూడా న‌డుచుకోదు. ఎవ‌రి ఆదేశాల‌నో పాటించాల్సిన అవ‌స‌రం కూడా లేదు.” రాజ్యాంగ పీఠిక‌ను త‌ర్జుమా చేస్తే వినిపించే మాట ఇదే. మ‌రి ఇప్పుడు ఏం జ‌రిగింది? ఏం జ‌రుగుతోంది? “స‌రే.. పోయి పెట్రోలు తెచ్చుకోండి” అని అమెరికా ఇచ్చిన అనుమ‌తి ఇప్పుడు చ‌ర్చ‌కు దారితీసింది. అతిపెద్ద ప్ర‌జాస్వామ్య దేశం నేడు అమెరికా ఆదేశాల కోసం వేచి చూసి అమెరికా ఆదేశాల ప్ర‌కారం న‌డుచుకునే ప‌రిస్థితికి వ‌చ్చిందా అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ప‌శ్చిమాసియాలో నెల‌కొన్న ప‌రిస్థితులు, ప‌రిణామాల క్ర‌మంలో చ‌మురుకు ఇబ్బందులు ఏర్ప‌డుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్ అధీనంలో ఉన్న హొర్ముజ్ జ‌ల‌సంధిపై ఆంక్ష‌లు కొన‌సాగుతున్నాయి. దీంతో భార‌త్ వంటి అతి పెద్ద చ‌మురు వినియోగ దేశానికి ఇబ్బందులు త‌ప్ప‌డం లేదు. ఈ క్ర‌మంలో ఇత‌ర దేశాల నుంచి అయినా చ‌మురును కొనుగోలు చేయాల‌ని నిర్ణ‌యించింది. మ‌రోవైపు చ‌మురును విక్రయించేందుకు ర‌ష్యా త‌న నౌక‌ల‌తో రెడీగా ఉంది. దీంతో భార‌త్ త‌న‌కు న‌చ్చిన దేశం నుంచి చ‌మురును కొనుగోలు చేసుకునే అవ‌కాశం ఉంది.

కానీ ఇక్క‌డ అమెరికా అడ్డుపుల్ల వేసింది. ర‌ష్యా నుంచి చ‌మురును కొనుగోలు చేయ‌డాన్ని అడ్డుకుంది. దీంతో ప్ర‌స్తుతం 30 శాతం లోపే ర‌ష్యా నుంచి చ‌మురు కొంటున్నాం. ఇప్పుడు అవ‌స‌రాల రీత్యా దీనిని పెంచుకోవాల‌ని చూస్తున్న భార‌త్‌కు అమెరికా అడ్డు త‌గులుతోంద‌న్న వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. ఇలాంటి స‌మ‌యంలో అనూహ్యంగా భార‌త్‌కు అమెరికా అనుమ‌తి ఇవ్వ‌డం, జాలి చూప‌డం, “స‌రే పోయి కొనుక్కో” అని వ్యాఖ్యానించ‌డం వంటి అంశాలు భార‌త్‌కు, ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి తీవ్ర అవ‌మాన‌మ‌ని ప్రతిప‌క్ష నాయ‌కులు అంటున్నారు.

నూతన విదేశాంగ విధానం అంటే ఇదేనా అని కూడా ప్ర‌శ్నిస్తున్నారు. నిజానికి భార‌త్ వంటి పెద్ద దేశాలే అమెరికా చేతిలో పావుల్లా మారితే ప్ర‌పంచ దేశాల ప‌రిస్థితి ఏంటన్నది మిలియ‌న్ డాల‌ర్ ప్ర‌శ్న. ఇక మ‌రోవైపు అమెరికా ఇప్ప‌టికే ఆప‌రేష‌న్ సిందూర్‌ను తామే ఆపించామ‌ని క్లెయిమ్ చేస్తోంది. ట్రంప్ ప‌దే ప‌దే ఈ విష‌యాన్ని చెబుతున్నారు. తాను చెప్పాన‌ని కాదు, తాను హెచ్చ‌రించాన‌ని, అందుకే భార‌త్ పాక్‌లు దాడులు ఆపేశాయ‌ని అన్నారు. పాక్ అంటే స‌రే, మ‌రి భార‌త్ కూడా ఇప్పుడు అమెరికా చెప్పు చేత‌ల్లోకి జారుకున్న‌ట్టేనా అనేది అంతుచిక్క‌డం లేదు.

ఇదే నిజ‌మైతే మోడీకి ఇంత‌క‌న్నా పెద్ద అవ‌మానం మ‌రొక‌టి లేద‌ని అంటున్నారు. విశ్వ గురువు కాస్తా ట్రంప్ చేతిలో కీలు బొమ్మ‌గా మారిన‌ట్టేన‌ని రాజ‌కీయ ప‌రిశీల‌కులు వ్యాఖ్యానిస్తున్నారు.

Related Post

డాన్ దర్శకుడితో ‘టైలర్’ రజినీకాంత్ ?డాన్ దర్శకుడితో ‘టైలర్’ రజినీకాంత్ ?

కమల్ హాసన్ నిర్మాతగా రజనీకాంత్ హీరోగా రూపొందబోయే సినిమా తాలూకు దర్శకుడి సస్పెన్స్ వీగిపోయింది. శివ కార్తికేయన్ డాన్ డీల్ చేసిన శిబి చక్రవర్తిని అఫీషియల్ గా లాక్ చేస్తూ ఇవాళ ప్రకటన ఇచ్చారు. దీనికన్నా ముందు రెండుమూడు పేర్లు వినిపించాయి

అంబ‌టికి జైలు… బాబును పెట్టిన చోటే!అంబ‌టికి జైలు… బాబును పెట్టిన చోటే!

వైసీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి అంబ‌టి రాంబాబుకు 14 రోజుల పాటు రిమాండ్ ఖైదు విధిస్తూ.. గుంటూరు జిల్లా కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో ఆదివారం రాత్రి 11 గంట‌ల స‌మ‌యంలో ఆయ‌న‌ను రాజ‌మండ్రిలోని సెంట్ర‌ల్ జైలుకు త‌ర‌లించారు. అయితే..