hyderabadupdates.com Gallery ఇమామ్, మౌజ‌న్ల‌కు ఏపీ స‌ర్కార్ భారీ తోఫా

ఇమామ్, మౌజ‌న్ల‌కు ఏపీ స‌ర్కార్ భారీ తోఫా

ఇమామ్, మౌజ‌న్ల‌కు ఏపీ స‌ర్కార్ భారీ తోఫా post thumbnail image

అమ‌రావ‌తి : ఏపీ స‌ర్కార్ రాష్ట్రంలోని ఇమామ్ లు, మౌజ‌న్ల‌కు తీపి క‌బురు చెప్పింది. రంజాన్ ప‌విత్ర పండుగ‌ను పుర‌స్క‌రించుకుని సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఉత్త‌ర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని ఇమామ్, మౌజన్లకు రంజాన్ సందర్భంగా శుభవార్త చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ఇమామ్, మౌజన్ల గౌరవ వేతనం నిమిత్తం రూ.45 కోట్లు విడుదల చేశారు. ఇదిలా ఉండ‌గా గత ఆరు నెలల బకాయిలను రంజాన్ సందర్భంగా ఒకేసారి క్లియర్ చేసింది కూటమి ప్రభుత్వం . నిన్న ఇఫ్తార్ విందులో సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇచ్చిన కొన్ని గంటల్లోనే నిధుల విడుదలకు ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 10,000 మంది ఇమామ్‌లు, మౌజన్‌ల ఖాతాల్లోకి నేరుగా నగదు జ‌మ చేశారు.
5,000 మంది ఇమామ్‌లకు ఆరు నెలల వేతనం కింద రూ.30 కోట్ల చెల్లించ‌గా , 5,000 మంది మౌజన్లకు ఆరు నెలల వేతనం కింద రూ.15 కోట్లు జమ చేశారు. ఇదిలా ఉండ‌గా స‌ర్కార్ మరో సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. దివ్యాంగుల‌కు ఖుష్ క‌బ‌ర్ చెప్పింది. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. రాష్ట్రంలోని 11.16 లక్షల దివ్యాంగులకు కూటమి ప్రభుత్వ ఉగాది కానుకగా ఇచ్చింది. దీని వ‌ల్ల దివ్యాంగ్ శక్తి పథకం ద్వారా 12.76 లక్షల మంది దివ్యాంగులు, సహాయకులకు లబ్ది చేకూర‌నుంది. దివ్యాంగులకు సహయకులుగా వచ్చే వారికి 50 శాతం టిక్కెట్ రాయితీ ఇస్తోంది. 40 శాతం వైకల్యం దాటిన దివ్యాంగులకు పథకం వర్తిస్తుంది. 4 నుంచి 21 వర్గాల దివ్యాంగులకు ‘దివ్యాంగ శక్తి’ విస్తరించింది స‌ర్కార్. ఈ పథకం అమలు కోసం ఏడాదికి రూ.207 కోట్లను ఆర్టీసీకి చెల్లించనుంది స‌ర్కార్.
The post ఇమామ్, మౌజ‌న్ల‌కు ఏపీ స‌ర్కార్ భారీ తోఫా appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

ఇండియాలో వ‌ర‌ల్డ్ కప్ మ్యాచ్ లు ఆడబోంఇండియాలో వ‌ర‌ల్డ్ కప్ మ్యాచ్ లు ఆడబోం

బంగ్లాదేశ్ : బంగ్లాదేశ్, ఇండియా దేశాల మ‌ధ్య తీవ్ర ఉద్రిక్త‌త‌లు చోటు చేసుకున్న నేప‌థ్యంలో సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ). వ‌చ్చే ఫిబ్ర‌వ‌రి నెల‌లో భార‌త్, శ్రీ‌లంక దేశాలు సంయుక్తంగా ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టి20

Red Fort Blast: దిల్లీ ఘటనలో కొత్త కోణం ! డిసెంబర్‌ 6న భారీ పేలుళ్లకు కుట్ర ?Red Fort Blast: దిల్లీ ఘటనలో కొత్త కోణం ! డిసెంబర్‌ 6న భారీ పేలుళ్లకు కుట్ర ?

    దిల్లీ ఎర్ర కోట సమీపంలో పేలుడుపై ముమ్మర దర్యాప్తు చేస్తున్న భద్రతా సంస్థలు.. అనేక కోణాల్లో సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ క్రమంలో మరో కీలక విషయం వెల్లడైంది. డిసెంబర్‌ 6న (బాబ్రీ మసీదు కూల్చివేత రోజు)

శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలుశ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

తిరుపతి : శ్రీనివాస మంగాపురం లోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో ఫిబ్రవరి 8 నుండి 16వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 7వ తేదీ సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభ‌మ‌వుతాయి. ఫిబ్రవరి 05న కోయిల్ ఆళ్వార్