hyderabadupdates.com Gallery ఇరాన్ ఎయిర్ స్పేస్ మూసి వేత ఫ్లైట్స్ ర‌ద్దు

ఇరాన్ ఎయిర్ స్పేస్ మూసి వేత ఫ్లైట్స్ ర‌ద్దు

ఇరాన్ ఎయిర్ స్పేస్ మూసి వేత ఫ్లైట్స్ ర‌ద్దు post thumbnail image

న్యూఢిల్లీ : ఎయిర్ ఇండియా బిగ్ షాక్ ఇచ్చింది ప్ర‌యాణీకుల‌కు. ప్ర‌స్తుతం ఇరాన్ ప్ర‌భుత్వం త‌మ గ‌గ‌న త‌లాన్ని మూసి వేస్తున్న‌ట్లు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. దీంతో అమెరికాతో పాటు ఇత‌ర దేశాల‌కు ప్ర‌యాణం చేసే, ముంద‌స్తు బుకింగ్ చేసుకున్న ట్రావెల‌ర్స్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది. గురువారం అధికారికంగా వెల్ల‌డించింది. గ‌గ‌న త‌లం మూసివేత కార‌ణంగా ప‌లు విమానాల‌ను ర‌ద్దు చేసిన‌ట్లు తెలిపింది. అమెరికా, యూర‌ప్ ల‌కు వెళ్లేందుకు మార్గం మూసి వేయ‌డంతో ఈ నిర్ణ‌యం తీసుకోవాల్సి వ‌చ్చింద‌ని స్ప‌ష్టం చేసింది ఎయిర్ ఇండియా. ప్ర‌స్తుతం అమెరికా, ఇరాన్ దేశాల మ‌ధ్య తీవ్ర ఉద్రిక్త‌త‌లు చోటు చేసుకున్నాయి. ఇదిలా ఉండ‌గా రెండు దేశాల మధ్య సంఘర్షణకు దారి తీస్తుందనే భయాలు నెల‌కొన్నాయి.
ఇరానియన్ ఎయిర్‌స్పేస్ మూసివేత కారణంగా ఎయిర్ ఇండియా యుఎస్‌కు కనీసం మూడు విమానాలను రద్దు చేసింది. మ‌రికొన్నింటిని దారి మళ్లించాల‌ని నిర్ణ‌యించామ‌ని పేర్కొంది . సామాజిక మాధ్య‌మం ఎక్స్ వేదిక‌గా వెల్ల‌డించింది. ఇరాన్‌లో ఉద్భవిస్తున్న పరిస్థితి, దాని వైమానిక ప్రాంతం మూసి వేయడం వ‌ల్ల ప్ర‌యాణీకుల భ‌ద్ర‌త దృష్ట్యా ఇలా చేయాల్సి వ‌చ్చింద‌ని, ప్ర‌యాణీకులు స‌హ‌క‌రించాల‌ని కోరింది ఎయిర్ ఇండియా. ప్రస్తుతం రూటింగ్ సాధ్యం కాని కొన్ని ఎయిర్ ఇండియా విమానాలు రద్దు చేశామ‌ని తెలిపింది. ఈ ఊహించని అంతరాయం కారణంగా ప్రయాణీకులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు పేర్కొంది. అయితే యుఎస్ కు వెళ్లాలంటే విధిగా విమానాల‌న్నీ ఇరాన్ గ‌గ‌న త‌లాన్ని వాడుకుంటోంది.
The post ఇరాన్ ఎయిర్ స్పేస్ మూసి వేత ఫ్లైట్స్ ర‌ద్దు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

మాజీ మంత్రి అతి.. కేసులో చిక్కుకోక తప్పదా?మాజీ మంత్రి అతి.. కేసులో చిక్కుకోక తప్పదా?

అనుచరుడిని విచారణ కోసం పోలీసులు స్టేషన్‌కు పిలిస్తే మాజీ మంత్రి అక్కడకు వచ్చి నానా హడావుడి చేశారు. అనుచరులందరినీ గుంపులుగా వెంటబెట్టుకొచ్చి పోలీసు అధికారుల విధులకు ఆటంకం కలిగించారు. వారిని బెదిరించారు. విచారణ కోసం పిలిపించిన నిందితుడిని పోలీసులు అనుమతి లేకుండా

జగ్జీవ‌న్ రాం అందించిన సేవ‌లు ప్ర‌శంస‌నీయంజగ్జీవ‌న్ రాం అందించిన సేవ‌లు ప్ర‌శంస‌నీయం

అమ‌రావ‌తి : దివంగ‌త‌, మాజీ ఉప ప్ర‌ధాన‌మంత్రి బాబు జ‌గ్జీవ‌న్ రామ్ దేశానికి అందించిన సేవ‌లు ప్ర‌శంస‌నీయ‌మ‌ని అన్నారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు.బాబూ జగజ్జీవన్ రామ్ 118వ జయంతిని పురస్కరించుకుని ఆదివారం క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నివాళులు