hyderabadupdates.com movies ఈసారి కష్టపడి ఓడిన చెన్నై… పంజాబ్ పవర్ఫుల్ గేమ్

ఈసారి కష్టపడి ఓడిన చెన్నై… పంజాబ్ పవర్ఫుల్ గేమ్

ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు అస్సలు కలిసి రావడం లేదు. వరుసగా రెండో ఓటమిని చవిచూసి అభిమానులను నిరాశలో నెట్టేసింది. పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై పరాజయం పాలవ్వడానికి ప్రధాన కారణం పంజాబ్ బ్యాటర్ల పక్కా ప్లానింగ్ అనే చెప్పాలి. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్.. మొదట చెన్నై దూకుడుని ఆపి 209 పరుగులకు కట్టడి చేయడంలో సఫలమయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్ లో ఎక్కడా ఒత్తిడికి లోనవ్వకుండా ఒక ప్రణాళికాబద్ధంగా ఆడి 8 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. పంజాబ్ కు ఇది బ్యాక్ టు బ్యాక్ రెండో విజయం కావడం విశేషం.

సాధారణంగా చెన్నై తన సొంత మైదానం చెపాక్ లో తక్కువ స్కోర్లను కూడా కాపాడుకోవడంలో దిట్ట. కానీ ఈసారి పంజాబ్ బ్యాటర్లు ఆ అవకాశం ఇవ్వలేదు. ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య కేవలం 11 బంతుల్లోనే 39 పరుగులు బాది పవర్‌ప్లేలో ఇన్నింగ్స్ కు గట్టి పునాది వేశాడు. ఆ తర్వాత ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (43), కూపర్ కానోలీ (36) వికెట్లు పడకుండా జాగ్రత్త పడుతూ స్కోరు బోర్డును పరిగెత్తించారు. పంజాబ్ బ్యాటింగ్ లో ఒకరు దూకుడుగా ఆడుతుంటే మరొకరు యాంకర్ రోల్ పోషిస్తూ ఇన్నింగ్స్ ను నడిపించారు. దీనివల్ల రన్ రేట్ ఎక్కడా తగ్గకుండా పంజాబ్ జాగ్రత్త పడింది.

చెన్నై బ్యాటింగ్ లో ఆయుష్ మాత్రే 73 పరుగులతో ఒంటరి పోరాటం చేసినా అది జట్టును గట్టెక్కించలేకపోయింది. శివం దూబే (45), సర్ఫరాజ్ ఖాన్ (32) పర్వాలేదనిపించినా చెన్నై స్కోరు 220 దాటుతుందనుకున్న దశలో పంజాబ్ బౌలర్లు కట్టడి చేశారు. చెన్నై కనీసం ఒక 15 పరుగులు తక్కువ చేసిందనేది వాస్తవం. బౌలింగ్ లో కూడా సీఎస్‌కే కీలక సమయాల్లో విఫలమైంది. పంజాబ్ బ్యాటర్లకు కొంత అదృష్టం తోడవడంతో పాటు వారు అటాకింగ్ గేమ్ ఆడటం చెన్నై బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టింది.

మ్యాచ్ క్లైమాక్స్ లో ఒక చిన్న ట్విస్ట్ చోటు చేసుకుంది. నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్ ను విజయతీరాలకు చేరుస్తున్న కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 52 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. వెంటనే నెహాల్ వధేరా కూడా పెవిలియన్ కు చేరడంతో చెన్నై క్యాంప్ లో ఆశలు చిగురించాయి. వికెట్లు టకటక పడితే మ్యాచ్ తమ వైపు తిరుగుతుందని చెన్నై ఫ్యాన్స్ ఆశపడ్డారు. కానీ ఆ అంచనాలను పటాపంచలు చేస్తూ శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్ ఏమాత్రం బెరకకుండా నిలబడ్డారు. ఎటువంటి కంగారు పడకుండా క్లియర్ షాట్స్ తో మ్యాచ్ ను ఫినిష్ చేసి పంజాబ్ కు ఘనవిజయాన్ని అందించారు.

ఇప్పటివరకు జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లతో పోలిస్తే ఈ మ్యాచ్ లో పంజాబ్ ఆడిన తీరు చాలా డిఫరెంట్ గా ఉంది. ఈసారి మాత్రం చాలా కంట్రోల్డ్ గా, క్యాలిక్యులేటెడ్ గా ఛేజింగ్ చేసింది. చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ బౌలింగ్ మార్పులు చేసినా అవి పెద్దగా ఫలించలేదు. ఈ గెలుపుతో పంజాబ్ పాయింట్ల పట్టికలో టాప్ లోకి దూసుకెళ్లగా.. చెన్నై టేబుల్ లిస్టులో చివరలోనే ఉండిపోతోంది.

Related Post

లోకేష్ వ‌ర్సెస్ క‌ర్ణాట‌క‌: వెరీ ఇంట్ర‌స్టింగ్‌!లోకేష్ వ‌ర్సెస్ క‌ర్ణాట‌క‌: వెరీ ఇంట్ర‌స్టింగ్‌!

మంత్రి నారా లోకేష్ కు కర్ణాటకలోని పలువురు మంత్రులకు మధ్య ఆసక్తికర చర్చ, వ్యాఖ్యలు తెర‌ మీదకు వస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం తమ పెట్టుబ‌డుల‌ను లాగేసుకుంటోంద‌న్నది కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖ‌ర్గే చెబుతున్న మాట. దీనికి తాజాగా ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్

కన్న వాళ్ళే పిల్లల ఉసురు తీస్తున్నారు.. అంత ఘోరమా…?కన్న వాళ్ళే పిల్లల ఉసురు తీస్తున్నారు.. అంత ఘోరమా…?

కన్నవారే కసాయిలా మారి తమ పిల్లల ప్రాణాలు తీస్తున్న దారుణ ఘటనలు సమాజాన్ని కలచివేస్తున్నాయి. ఒక చోట తల్లి పిల్లలకు విషం పెట్టి తనూ ప్రాణాలు తీసుకుంటే, మరోచోట తండ్రి పిల్లలను చంపి ఆత్మహత్యకు పాల్పడుతున్నాడు. ఇలాంటి సంఘటనలు వెలుగులోకి వచ్చినప్పుడల్లా

Santhana Prapthirasthu Success: Team Overwhelmed by Audience LoveSanthana Prapthirasthu Success: Team Overwhelmed by Audience Love

Santhana Prapthirasthu is enjoying a strong and steady run across both Telugu states, winning hearts with its clean entertainment and family-friendly message. Starring Vikranth and Chandini Chowdary, the film is