hyderabadupdates.com Gallery ఉత్కంఠ భ‌రితం భార‌త్ అద్భుత విజ‌యం

ఉత్కంఠ భ‌రితం భార‌త్ అద్భుత విజ‌యం

ఉత్కంఠ భ‌రితం భార‌త్ అద్భుత విజ‌యం post thumbnail image

ముంబై : క్రికెట్ ఆట‌లో ఉన్న మ‌జా ఏమిటో ముంబై వేదిక‌గా జ‌రిగిన సెమీ ఫైన‌ల్ మ్యాచ్ తెలియ చేసింది. అందుకే కోట్లాది మంది క్రికెట్ అంటే ప‌డి చ‌స్తారు. నువ్వా నేనా అన్న రీతిలో జ‌రిగిన ఈ కీల‌క పోరు చివ‌రి ఓవ‌ర్ దాకా ఉత్కంఠ భ‌రితంగా సాగుతోంది. ఇక కేవ‌లం ఒకే ఒక్క అడుగు దూరంలో నిలిచి ఉంది టీం ఇండియా. తొలి సెమీ ఫైన‌ల్ లో బ‌ల‌మైన ద‌క్షిణాఫ్రికాకు చుక్క‌లు చూపించింది న్యూజిలాండ్. ఆ జ‌ట్టును 9 వికెట్ల తేడాతో ఓడించి ఫైన‌ల్ కు చేరుకుంది. ఈనెల 8న భార‌త్ తో త‌ల‌ప‌డ‌నుంది. దీంతో కోట్లాది మంది భార‌తీయులు ఈ కీల‌క పోరు కోసం వేచి చూస్తున్నారు.
ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే టాస్ ఓడిన భార‌త్ ముందుగా బ్యాటింగ్ కు దిగింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు కోల్పోయి 253 ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది. కేర‌ళ స్టార్ శాంస‌న్ మ‌రోసారి రెచ్చి పోయాడు. ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. ఇంగ్లండ్ బౌల‌ర్ల భ‌ర‌తం ప‌ట్టాడు. ప్ర‌త్యేకించి జోఫ్రా ఆర్చ‌ర్ ను ఉతికి ఆరేశాడు. క‌ళ్లు చెదిరే షాట్స్ తో ఆకట్టుకున్నాడు. 89 ప‌రుగులు చేసిన త‌ను 8 ఫోర్లు 7 సిక్స‌ర్లు కొట్టాడు. త‌న‌కు తోడుగా ఇషాన్ కిష‌న్, హార్దిక్ పాండ్యా, తిల‌క్ వ‌ర్మ‌, శివ‌మ్ దూబేలు కీల‌క పాత్ర పోషించారు. ఇరు జ‌ట్లు 499 ర‌న్స్ చేశాయి. ఇది కూడా ఓ రికార్డ్ అని చెప్ప‌క త‌ప్ప‌దు. భార‌త బౌల‌ర్లు ప్ర‌త్య‌కించి బుమ్రా, ప‌టేల్, పాండ్యాలు అవ‌స‌ర‌మైన స‌మ‌యంలో కీల‌క పాత్ర పోషించారు. ఇండియాను ఒడ్డుకు చేర్చారు.
The post ఉత్కంఠ భ‌రితం భార‌త్ అద్భుత విజ‌యం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

ఒంటిమిట్ట‌లో విశిష్ట సేవ‌లు అందించిన శ్రీ‌వారి సేవకులుఒంటిమిట్ట‌లో విశిష్ట సేవ‌లు అందించిన శ్రీ‌వారి సేవకులు

ఒంటిమిట్ట / తిరుపతి : ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగ‌రంగ వైభ‌వంగా కొన‌సాగుతున్నాయి. ఉత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకుని నిర్వహించిన శ్రీ సీతారాముల కల్యాణాన్ని ఘ‌నంగా నిర్వ‌హించారు. 80 వేల మందికి పైగా భ‌క్తులు ద‌ర్శించుకున్నారు. భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు

పేద‌ల ఆకలి తీరుస్తున్న అన్న క్యాంటీన్లుపేద‌ల ఆకలి తీరుస్తున్న అన్న క్యాంటీన్లు

అమరావతి : రాష్ట్రంలో అన్న క్యాంటీన్లు అన్నం పెట్టే అమ్మను తలపిస్తున్నాయని నారా భువనేశ్వరి అన్నారు. అన్న క్యాంటీన్ల సేవలు ఎంతో మన్నన పొందాయని, లక్షల మంది పేదల కడుపు నింపే మహోన్నత కార్యక్రమంగా కూటమి ప్రభుత్వం దీన్ని నిర్వహించడం గొప్ప

CM Chandrababu: డేటా ఆధారిత పాలనసై సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశంCM Chandrababu: డేటా ఆధారిత పాలనసై సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం

  డేటా డ్రైవెన్‌ గవర్నెన్స్‌పై సీఎం చంద్రబాబు నాయుడు గురువారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రులు, కార్యదర్శులు, హెచ్ఓడీలు పాల్గొనగా… జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ… దీర్ఘకాలిక, మధ్యకాలిక,