hyderabadupdates.com movies ఉత్త‌రాదిలో లోకేష్ హవా.. బాబు స్ట్రాట‌జీ.. !

ఉత్త‌రాదిలో లోకేష్ హవా.. బాబు స్ట్రాట‌జీ.. !

రాష్ట్రంలో కీలక పాత్ర పోషిస్తున్న మంత్రి నారా లోకేష్ ఇటు పార్టీలోనూ అటు ప్రభుత్వంలోనూ మంచి పేరు తెచ్చుకుంటున్నారు. భవిష్యత్తులో టిడిపి పగ్గాలు చేపట్టడం ఖాయం అనే విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎక్కడ ఏ విధంగా వ్యవహరించాలి.. ఎవరితో ఎలా మాట్లాడాలి? ఏ సమస్యను ఏ విధంగా పరిష్కరించాలి అదే సమయంలో పార్టీ నాయకులను ఏ విధంగా ముందుండి నడిపించాలి అనే అంశాలపై చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు.

ఈ పరంపరలో ఇప్పుడు ఉత్తరాది రాష్ట్రాల్లోనూ ఆయన గుర్తింపు పొందేలా అడుగులు వేయడం ప్రారంభించారు. ఇప్పటికే కేంద్రంలో ఉన్న మంత్రివర్గ బృందంతో నారా లోకేష్ కు మంచి సన్నిహిత్యం ఏర్పడింది. అనేకమంది మంత్రులకు ఆయన పరిచయమయ్యారు. అదేవిధంగా వారి సూచనలు సలహాలు తీసుకుంటూనే వారితో మమేకం కూడా అవుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఇప్పుడు బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తరపున ప్రచారం చేసేందుకు బయలుదేరారు.

వాస్తవానికి బీహార్లో ఎన్డీఏ తరపున భారీ ఎత్తున ప్రచారం జరుగుతోంది. ప్రధానమంత్రి నుంచి కేంద్ర మంత్రుల వరకు అనేక మంది ఈ ప్రచారంలో పాల్గొంటున్నారు. అయినప్పటికీ దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎన్డీఏ తరపున ప్రచారం చేసేందుకు మంత్రి నారా లోకేష్ వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీనివ ల్ల ఎన్డీఏ ఓటు బ్యాంకు పెరగడంతో పాటు మరోవైపు ఎన్డీఏ పాలిత రాష్ట్రాల నేతలకు మంత్రి నారా లోకేష్ మరింత చేరువ కానున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

అదే సమయంలో దేశవ్యాప్తంగా కూడా మరోసారి ఆయన గుర్తింపు తెచ్చుకునే అవకాశం ఈ ప్రచారం ద్వారా ఏర్పడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో ఏం జరిగినా కూడా దేశవ్యాప్తంగా ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా జాతీయ మీడియా పెద్ద ఎత్తున ఉత్తరాది రాష్ట్రాలపై మరీ ముఖ్యంగా బీహార్ పై దృష్టి పెట్టిన నేపథ్యంలో నారా లోకేష్ ప్రచారం మరింతగా వ్యక్తిగతంగా ఆయనకు దోహదపడుతుందని పరిశీలకులు చెబుతున్నారు.

ఇది.. రాబోయే రోజుల్లో ఆయనకు జాతీయస్థాయి నాయకుడిగా దోహదపడే అవకాశం ఉంటుందని కూడా అంచనా వేస్తుండడం విశేషం. దీని వెనుక సీఎం చంద్రబాబు వ్యూహం ఉందని భవిష్యత్తు నాయకుడిగా నారా లోకేషన్ తీర్చిదిద్దే క్రమంలో బీహార్ ఎన్నికల ప్రచారం కలిసి వస్తుందని కూడా ఆయన భావిస్తున్నట్టు పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. మరి ఏం జరుగుతుందనేది చూడాలి.

Related Post

ఇది సుకుమార్ సహా అందరికీ కౌంటరేఇది సుకుమార్ సహా అందరికీ కౌంటరే

మైత్రీ మూవీ మేకర్స్.. టాలీవుడ్లో ప్రస్తుతం బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్‌ల్లో ఒకటి. ఆ మాటకొస్తే ఇండియాలో కూడా పెద్ద బేనర్లలో ఒకటిగా ఎదిగింది. మలయాళంలో ‘ఏఆర్ఎం’, తమిళంలో ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’, హిందీలో ‘జాట్’ లాంటి భారీ చిత్రాలు తీసి పాన్ ఇండియా స్థాయిలో