hyderabadupdates.com movies ఉదయం వస్తేనే మంచిది ఉస్తాద్

ఉదయం వస్తేనే మంచిది ఉస్తాద్

ఉస్తాద్ భగత్ సింగ్ కు మార్చి 18 రాత్రి నుంచే ప్రీమియర్లు ఉంటాయనే వార్త మొన్నటి నుంచి చక్కర్లు కొడుతోంది. అయితే నిర్మాణ సంస్థ మైత్రి తీసుకున్న నిర్ణయం మేరకు మార్చి 19 తెల్లవారుఝామున 5 గంటలకు షోలు మొదలుపెట్టబోతున్నారని ఇన్ సైడ్ టాక్. దీనికి కారణం దురంధర్ ది రివెంజ్ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రభంజనమా లేక ఇంకేదైనా ఉందా అంటే కాస్త లోతుగా విశ్లేషించుకోవాలి.

మాస్ సినిమాలకు ముందు రోజు ప్రీమియర్లు వేయడం ఎంతైనా రిస్కుతో కూడుకున్నదే. ఒక్కోసారి యావరేజ్ టాక్ ని ఫ్లాప్ గా మార్చే ప్రమాదం కూడా ఉంటుంది. అందులోనూ ఉస్తాద్ భగత్ సింగ్ కు ఓజి రేంజ్ లో హడావిడి లేదు కాబట్టి మౌత్ టాక్ ప్రాపర్ గా రావాలి. నాలుగు గంటల దురంధర్ రివెంజ్ చూసిన కళ్ళతో వెంటనే పవన్ కళ్యాణ్ మూవీకి వచ్చిన ప్రేక్షకులకు ఆ అలసట ఇబ్బంది పెట్టే ప్రమాదముంది.

అందులోనూ తెలంగాణలో బెనిఫిట్ షో అనుమతుల కోసం ప్రయాస పడటం కంటే నేరుగా ఉదయం నుంచి మొదలుపెట్టడం మంచి ఆలోచనగా చెప్పొచ్చు. ఇప్పటికైతే మైత్రి నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఎందుకంటే డబ్బింగ్, రీ రికార్డింగ్ పనుల్లో టీమ్ చాలా ఒత్తిడిలో ఉంది. ఇంకో నాలుగైదు రోజుల్లో సెన్సార్ కు వెళ్ళిపోవాలి. ఓవర్సీస్ కు హార్డ్ డిస్కులు వీలైనంత త్వరగా పంపించాలి.

ఈ గొడవ అంతా ఎందుకు అనుకుంటే చక్కగా మార్చి 19 ఫ్రెష్ గా ఉస్తాద్ భగత్ సింగ్ దర్శనం చేయించడం తెలివైన నిర్ణయమే అవుతుంది. తగినంత సమయం లేకపోవడంతో ప్రమోషన్లు ఫుల్ స్వింగ్ లో చేసేందుకు తక్కువ ఛాన్స్ ఉంది. ఆల్రెడీ శ్రీలీల రంగంలోకి దిగింది. రాశిఖన్నా ఎంట్రీ కూడా ఉంటుంది. దేవి, తమన్, ఇతర ఆర్టిస్టుల ఇంటర్వ్యూలను ఆఘమేఘాల మీద ప్లాన్ చేస్తున్నారు.

ఓపెనింగ్స్ విషయంలో ఎలాంటి అనుమానాలు లేవు కానీ వీకెండ్ వరకు స్ట్రాంగ్ మూమెంట్ ని కొనసాగించాలంటే దురంధర్ 2కి ధీటుగా టాక్ తెచ్చుకోవాలి. ఎటొచ్చి పండక్కు ఫ్యామిలీ ఆడియన్స్ ఛాయస్ పవన్ కళ్యాణ్ మూవీ ఒకటే ఉంటుంది బట్టి బయ్యర్లు ఈ విషయంలో ధీమాగానే ఉన్నారు. తెలంగాణలో రెగ్యులర్ టికెట్ రేట్లు, ఏపీలో కొంత హైక్ తీసుకున్న ధరలతో ఉస్తాద్ భగత్ సింగ్ ఓపెన్ అవుతుందని ఇప్పటికి ఉన్న సమాచారం.

Related Post

పది రోజుల స్టాక్ మాత్రమేనా? తర్వాత ఏమవుతుంది?పది రోజుల స్టాక్ మాత్రమేనా? తర్వాత ఏమవుతుంది?

అదును చూసుకుని వ్యాపార సంస్థలు తమ నైజాన్ని బయట పెట్టుకుంటాయి. పది రూపాయలు పోగేసుకునేందుకు ప్రయత్నిస్తాయి. ఇప్పుడు చమురు విషయంలోనూ అదే పరిస్థితి నెలకొంది. ఇరాన్ యుద్ధం సహా పాకిస్థాన్ – అఫ్ఘానిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ దేశాలకు చమురు

ఊహించని షాక్ తిన్న వారణాసి విలన్ఊహించని షాక్ తిన్న వారణాసి విలన్

సలార్ తో మనకు పరిచయమైనప్పటికి ఇప్పుడు మహేష్ బాబు వారణాసి విలన్ గా నటిస్తున్న మలయాళం స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్ దీని ద్వారా మరింత చేరువ కాబోతున్నాడు. ముందు నుంచి తెలుగు మార్కెట్ మీద పట్టు సాధించాలని ట్రై చేస్తున్న ఈ