hyderabadupdates.com Gallery ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ జోష్ ప‌వ‌న్ ఖుష్

ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ జోష్ ప‌వ‌న్ ఖుష్

ఉస్తాద్ భ‌గ‌త్  సింగ్ జోష్ ప‌వ‌న్ ఖుష్ post thumbnail image

హైద‌రాబాద్ : ద‌మ్మున్న ద‌ర్శ‌కుడు, తెలంగాణ‌కు చెందిన హ‌రీష్ శంక‌ర్ తీసిన తాజా చిత్రం ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్. ఇందులో కీ రోల్ పోషించాడు ప‌వ‌ర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ . త‌న‌తో పాటు అందాల భామ‌లు శ్రీ‌లీల‌, రాశీ ఖ‌న్నా కీ రో ల్స్ పోషించారు. మార్చి 19న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది ఈ చిత్రం. విడుద‌లైన తొలి షో నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకు పోతోంది. ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ మూవీని ప్ర‌తిష్టాత్మ‌క‌మైన నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించారు. భారీ ఖ‌ర్చు పెట్టారు. సినిమా కాసుల వ‌ర్షం కురిపించ‌డంతో తెగ సంతోషానికి లోన‌య్యాడు ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్. ఈ చిత్రానికి ఇద్ద‌రు సంగీత ద‌ర్శ‌కులు మ్యూజిక్ ఇచ్చారు. ఒక‌రు ఎస్ఎస్ థ‌మ‌న్ కాగా మ‌రొక‌రు దేవిశ్రీ ప్ర‌సాద్.
ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ చిత్రం భారీ విజ‌యం వైపు దూసుకు పోతుండ‌డం ప‌ట్ల స్పందించాడు ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్. చాలా సంతోషంగా ఉంద‌న్నాడు. తామిద్ద‌రి కాంబోలో గ‌తంలో వ‌చ్చిన గ‌బ్బ‌ర్ సింగ్ రికార్డుల‌ను తిర‌గ రాసింద‌న్నాడు. ఇప్పుడు కూడా అంత‌కు మించి ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ మూవీ ఉండ‌బోతోంద‌ని జోష్యం చెప్పాడు. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కులు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను చూసి మురిసి పోతున్నార‌ని, ఆద‌రిస్తున్నార‌ని అన్నాడు హ‌రీష్ శంక‌ర్. ద‌ర్శ‌కుడు మూవీ గురించి ఆశు క‌విత చెప్పాడు. మైత్రీ సంస్థ నిర్మాత నవీన్ యెర్నేని ది..”బాగా ఖర్చు పెట్టే గోత్రం.. కలెక్షన్లు రాబట్టే నక్షత్రంష‌. రాశి ఖన్నా ది: “నవ్వించే గోత్రం.. కవ్వించే నక్షత్రం, శ్రీ లీల ది “ముదురు గోత్రం.. దేశ ముదురు నక్షత్రం” .
“అందమైన గోత్రం.. ఆహ్లాదకరమైన నక్షత్రం హరీష్ శంకర్ ది: “శ్రమించే గోత్రం.. సహించే నక్షత్రం అంటూ త‌న గురించి కూడా గొప్ప‌గా చెప్పాడు.
The post ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ జోష్ ప‌వ‌న్ ఖుష్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

CP Sajjanar: చాదర్‌ఘాట్ కాల్పులపై స్పందించిన వీసీ సజ్జనార్CP Sajjanar: చాదర్‌ఘాట్ కాల్పులపై స్పందించిన వీసీ సజ్జనార్

  చాదర్‌ఘాట్ (Chaderghat) విక్టోరియా గ్రౌండ్‌లో  మొబైల్ దొంగపై డీసీపీ చైతన్య కాల్పులు జరిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ క్రమంలో సంఘటనా స్థలాన్ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ పరిశీలించారు. ఇందుకు గల కారణాలను పోలీసు

దావోస్ వ‌ర‌ల్డ్ ఆర్థిక ఫోరంలో సీఎందావోస్ వ‌ర‌ల్డ్ ఆర్థిక ఫోరంలో సీఎం

హైద‌రాబాద్ : ప్రపంచ ఆర్థిక ఫోరం వార్షిక సమావేశాల్లో పాల్గొనేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం స్విట్జర్లాండ్‌లోని దావోస్ పర్యటనకు బయలు దేరనుంది. సోమవారం మేడారంలో పునర్నిర్మించిన సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్ద ముఖ్యమంత్రి పూజలు నిర్వహిస్తారు.

Pawan Kalyan: కుంకీ ఏనుగుల ఆపరేషన్ కేంద్రాన్ని ప్రారంభించిన పవన్ కల్యాణ్Pawan Kalyan: కుంకీ ఏనుగుల ఆపరేషన్ కేంద్రాన్ని ప్రారంభించిన పవన్ కల్యాణ్

    పలమనేరు ముసలిమడుగు వద్ద కుంకీ ఏనుగుల ఆపరేషన్ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గజరాజుల విన్యాసాలను పవన్ కల్యాణ్, అధికారులు తిలకించారు. ఏనుగులు కృష్ణా, అభిమన్యులకు పవన్ స్వయంగా ఆహారాన్ని అందించారు.