hyderabadupdates.com movies ఊరి కోసం పోరాడే రియల్ ‘ఛాంపియన్’

ఊరి కోసం పోరాడే రియల్ ‘ఛాంపియన్’

నటుడు శ్రీకాంత్ వారసుడిగా పెళ్లి సందడితో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోషన్ మేక తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో ఒకటి రెండు ప్రాజెక్టులు ఒప్పుకున్నాక చేయి జారినా వైజయంతి బ్యానర్ తో తన రెండో అడుగును వేస్తున్నాడు. స్వప్న సినిమా సంస్థ నిర్మిస్తున్న ఛాంపియన్ డిసెంబర్ 25 విడుదల కానుంది. ఇవాళ రామ్ చరణ్ ముఖ్యఅతిథిగా గ్రాండ్ గా ట్రైలర్ లాంచ్ చేశారు. ఇప్పటిదాకా దీని కథేంటో లీక్స్ కాకుండా టీమ్ జాగ్రత్త పడింది. అందుకే పెద్దగా అవి బయటికి రాలేదు. ఈ రోజు వాటికి చెక్ పెట్టారు. స్టోరీ, బ్యాక్ డ్రాప్ మొత్తం అరటిపండు వలిచినట్టు చూపించారు దర్శకుడు ప్రదీప్ అద్వైతం.

1947లో భారతదేశానికి స్వతంత్రం వచ్చాక తెలంగాణలో ఉండే భైరాన్ పల్లి ఇంకా రజాకార్ల చేతుల్లోనే ఉంటుంది. అరాచకం రాజ్యమేలే ఆ ఊరిలో నోరెత్తిన వాడికి మరణమే శిక్ష. అలాంటి చోట ఒక కుర్రాడు (రోషన్ మేక) ఫుట్ బాల్ అట ద్వారా విదేశాలకు వెళ్లే లక్ష్యంతో ఉంటాడు. అయితే తాను పుట్టి పెరిగిన చోట జరుగుతున్న దారుణాలు అతన్ని కదలనివ్వవు. నాటకాలు వేసుకునే అమ్మాయి (అనస్వర రాజన్) ని ప్రేమించిన ఈ అబ్బాయి మైదానంలో కాకుండా యుద్ధభూమిలో అడుగు పెట్టే పరిస్థితి వస్తుంది. అసలు బ్రిటిషర్లు వెళ్ళిపోయాక కూడా అక్కడెందుకు ఘోరాలు జరిగాయనేది తెరమీద చూడాలి.

ఊహించని స్థాయిలో విజువల్స్ సర్ప్రైజ్ చేశాయని చెప్పాలి. నిర్మాతలు అశ్వినిదత్, ప్రియాంక, స్వప్నల గురించి కొత్తగా చెప్పేదేముంది. ప్రొడక్షన్ వేల్యూస్ తోనే ఆసక్తి పెంచారు. రోషన్ మేకకు ఛాంపియన్ పెద్ద ప్రమోషన్ కానుంది. కంటెంట్ కనక క్లిక్ అయితే ఎక్కడికో వెళ్ళిపోతాడు. ఇంటెన్స్ పెర్ఫార్మన్స్ డిమాండ్ చేసే క్యారెక్టర్ రెండో సినిమాకే దొరకడం అదృష్టం. మిక్కీ జె మేయర్ సంగీతం, ఆర్ట్ వర్క్. కెమెరా నైపుణ్యం ఒకదానితో మరొకటి పోటీ పడ్డాయి. మూడు దశాబ్దాల తర్వాత నందమూరి కళ్యాణ చక్రవర్తి ఎంట్రీ ఇవ్వడం విశేషం. అంచనాలు పెంచడంలో ఛాంపియన్ టీమ్ సక్సెసయ్యింది.

Related Post

నా కేసు క్లోజ్ చెయ్యడానికి 25 ఏళ్ళా… స్టార్ హీరో అసహనంనా కేసు క్లోజ్ చెయ్యడానికి 25 ఏళ్ళా… స్టార్ హీరో అసహనం

90వ దశకంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముంబయి పేలుళ్ల సందర్భంగా అక్రమంగా ఆయుధాలు దాచిపెట్టిన కేసులో బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ అరెస్టవడం.. ఆ కేసు సుదీర్ఘ కాలం విచారణ దశలో ఉండడం.. కొన్నేళ్లు జైలు శిక్ష పూర్తి చేసుకుని 2016లో

Allu Aravind Says “The Girlfriend” Gave Him Pure Creative SatisfactionAllu Aravind Says “The Girlfriend” Gave Him Pure Creative Satisfaction

“The Girlfriend,” starring National Crush Rashmika Mandanna and Dheekshith Shetty, is all set for a grand release. The emotional love drama, written and directed by Rahul Ravindran, is jointly produced