hyderabadupdates.com movies ఎట్టకేలకు చెవిరెడ్డికి బెయిల్

ఎట్టకేలకు చెవిరెడ్డికి బెయిల్

ఏపీ లిక్కర్ స్కాం కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఎట్టకేలకు ఊరట లభించింది. ఆ కేసులో చెవిరెడ్డికి హైకోర్టు నేడు బెయిల్ మంజూరు చేసింది. భాస్కర్ రెడ్డితోపాటు సజ్జల శ్రీధర్ రెడ్డి, వెంకటేష్ నాయుడులకు కూడా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది.

2025 జూన్ 17న బెంగుళూరులో చెవిరెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. 226 రోజుల తర్వాత చెవిరెడ్డికి బెయిల్ మంజూరైంది.

వైసీపీ హయాంలో ఢిల్లీ మద్యం కుంభకోణం కంటే పెద్ద లిక్కర్ స్కాం జరిగిందని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. డిస్టిలరీలు, లిక్కర్ సరఫరా కంపెనీల నుంచి కోట్ల రూపాయలను వైసీపీ నేతలు దండుకున్నారని, ఈ స్కాంలో ప్రధాన నిందితుడు రాజ్ కేసిరెడ్డి అని కేసు నమోదైంది.

ఇక, కేసిరెడ్డి నుంచి వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కోట్ల రూపాయలు అందుకున్నారని, ఆ డబ్బును 2024 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు చెవిరెడ్డి ఇచ్చారని సిట్ అభియోగాలు మోపింది. అంతేకాదు, ఈ లిక్కర్ స్కాంకు సూత్రధారి చెవిరెడ్డి అని ఆయనను ఏ-38గా, చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని ఏ-39 నిందితులుగా పేర్కొంది.

Related Post

లోకేశ్ దర్బార్..అర కిలోమీటరు క్యూ!లోకేశ్ దర్బార్..అర కిలోమీటరు క్యూ!

ప్రజా ప్రతినిధి…అంటే ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ప్రజలు ఎన్నుకున్న నేత. తమ నియోజకవర్గం నుంచి గెలిపించి శాసన సభకు పంపితే ప్రజా సమస్యలు పరిష్కరిస్తారని ప్రజలు నమ్మి ఆ నేతకు ఓటేస్తారు. అసెంబ్లీలో కావచ్చు…బయట కావచ్చు…తమ ప్రాంత సమస్యలు తీరుస్తారని ప్రజలు