hyderabadupdates.com movies ఎన్టీఆర్ నీల్… ఇంకో ఏడాది ఆలస్యంగా

ఎన్టీఆర్ నీల్… ఇంకో ఏడాది ఆలస్యంగా

అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు. రిలీజ్ ఇంకో సంవత్సరం వాయిదా వేస్తూ 2027 జూన్ 11 థియేటర్లలో వస్తున్నామని తారక్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ముందు అనుకున్న ప్రకారం చూసుకుంటే ఇప్పటిది మూడో వాయిదా. వచ్చే నెల మే 20 యంగ్ టైగర్ పుట్టినరోజు సందర్భంగా టీజర్ లాంచ్ చేయబోతున్నారు. అందులోనే టైటిల్ రివీల్ ఉంటుంది.

ఇలా జరగడానికి రకరకాల కారణలున్నాయి. విదేశాల్లో ప్లాన్ చేసుకున్న షెడ్యూల్ అక్కడి పరిస్థితుల వల్ల ముందే ఆపేసి తిరిగి రావాల్సి వచ్చింది. ముఖ్యమైన నెగటివ్ పాత్రకు ఓకే అనుకున్న టోవినో థామస్ తీరా శిక్షణ తీసుకుని సెట్స్ లో అడుగు పెట్టే టైంలో తప్పుకున్నాడు. ఎక్కువ కాల్ షీట్స్ ఇవ్వలేకపోవడమే దానికి రీజన్ గా చెప్పుకున్నాడు. తన స్థానంలో ఎవరు వస్తారనేది ఇంకా క్లారిటీ లేదు. ఏవేవో పేర్లు వినిపిస్తున్నాయి కానీ ఇంకా నిర్ధారణ కాలేదు.

ఇది తారక్ అభిమానులకు నిరాశ కలిగించే పరిణామమే, ఎందుకంటే దేవర వచ్చి దాదాపు రెండేళ్లవుతోంది. వార్ 2 హిందీ మూవీ అందులోనూ మల్టీస్టారర్ కావడంతో ఫ్యాన్స్ దాన్ని పట్టించుకోలేదు. కానీ నీల్ ప్రాజెక్టు మీద కొండంత ఆశలున్నాయి. కెజిఎఫ్ తర్వాత తను తీస్తున్న మూవీ కావడంతో అంచనాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ఇప్పటిదాకా తెలుగు తెరపై చూడని బ్యాక్ డ్రాప్ ఎంచుకున్నారనే టాక్ హైప్ ని అంతకంత పెంచుతోంది.

సో ఏదైతేనేం ఫ్యాన్స్ అయితే ఇంకో పదిహేను నెలలు ఎదురు చూడక తప్పదు. మే 20 టీజర్ తర్వాత ప్రమోషన్లు ఆపేస్తారు. టైం చాలా ఉంది కాబట్టి ఇప్పుడప్పుడే ఎలాంటి హడావిడి ఉండదు. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ యాక్షన్ డ్రామాకు రవి బస్రూర్ సంగీతం సమకూరుస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మాణ భాగస్వామిగా ఉంటోంది. డ్రాగన్ టైటిల్ పరిశీలనలో ఉంది కానీ ఇంకా నిర్ధారణ కాలేదు. బర్త్ డే దాకా వెయిట్ చేయాలి.

Related Post

మూడు రోజులుగా లడ్డూ లడాయి.. వైసీపీ ట్రాప్‌లో చిక్కారా?మూడు రోజులుగా లడ్డూ లడాయి.. వైసీపీ ట్రాప్‌లో చిక్కారా?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి పార్టీలు కలిసి కట్టుగా వైసీపీకి కౌంటర్ ఇవ్వాలని నిర్ణయించాయి. దీనిపై సుదీర్ఘంగా సీఎం చంద్రబాబు నేతృత్వంలో పార్టీలు మంతనాలు చేశాయి.

తొమ్మిదేళ్ళుగా ‘బంధం’ .. పెళ్ళికి నో: హైకోర్టు సంచలన తీర్పుతొమ్మిదేళ్ళుగా ‘బంధం’ .. పెళ్ళికి నో: హైకోర్టు సంచలన తీర్పు

తొమ్మిదేళ్లు సంబంధంలో ఉండి, పెళ్లికి నిరాకరించాడంటూ ఓ యువకుడిపై నమోదైన కేసును కొట్టివేస్తూ మద్రాసు హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమిళనాడు – తిరునెల్వేలికి చెందిన దేవా విజయ్ తాను కాలేజీ రోజుల నుండి తొమ్మిదేళ్లుగా ప్రేమించుకున్నామని ఓ యువతి తెలిపింది.