hyderabadupdates.com movies ఎప్పుడూ కామ్ గా ఉండే మంత్రి నిమ్మల ఈసారి సీరియస్!

ఎప్పుడూ కామ్ గా ఉండే మంత్రి నిమ్మల ఈసారి సీరియస్!

మంత్రి నిమ్మల రామానాయుడుకు సౌమ్యుడు అన్న పేరుంది. వివాదాస్పద వ్యాఖ్యలకు, కాంట్రవర్సీలకు ఆయన దూరంగా ఉంటారు. వైసీపీ నేతలపై పదునైన విమర్శలు చేస్తూ వారిని ఇరకాటంటో పెడుతుంటారు. అధికారులపై కూడా ఆయన ఎప్పుడూ సీరియస్ అయిన దాఖలాలు లేవు. అయితే, తొలిసారిగా విద్యుత్ శాఖ అధికారులు నిమ్మలకు చిరాకు తెప్పించారు. దీంతో, ఎప్పుడూ కామ్ గా ఉంటే నిమ్మల అధికారులపై సీరియస్ అయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ప్రకాశం జిల్లా వెలుగొండ ప్రాజెక్టు పరిశీలన సందర్భంగా విద్యుత్ శాఖ అధికారుల అలసత్వంపై నిమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు. మొంథా తుపాను వల్ల విద్యుత్ వైర్లు తెగి పది రోజులవుతున్నా దోర్నాల మండలం కొత్తూరులో కరెంటు సరఫరాల లేదని ఆయన ఫైర్ అయ్యారు. ప్రజలకు కరెంటు సరఫరా లేదని…కరెంటు లేక బోర్లు నడవక పొలాలు ఎండిపోతున్నాయని రైతులు తనతో మొరపెట్టుకుంటున్నారని అన్నారు. వరద వచ్చింది..వైర్లు తెగిపోయాయి..వాటిని సరిచేయడం, పాడైన ట్రాన్స్ ఫార్మర్ స్థానంలో కొత్తది వేయడం..మీ బాధ్యత కదా? ఎందుకు వేయలేదు అని ప్రశ్నించారు.

టౌన్ లో నిమిషంలో ట్రాన్స్ ఫార్మర్లు వేసి వైర్లు వేస్తారు…ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్లకు నిమిషం కూడా కరెంటు పోకూడదు అంటూ అధికారులపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. డబ్బున్నోళ్లకు జనరేటర్, ఇవ్వర్టర్లు ఉంటాయి…పేదోళ్లకేం ఉంటాయి? అని నిలదీశారు. వారం క్రితం చెప్పినా ఇంకా ఎందుకు చేయలేదని విద్యుత్ శాఖ అధికారులను ఆయన నిలదీశారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో కొందరు అధికారులకు ఇది అలవాటయిందని, కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర అవుతున్నా వారు ఇంకా మారడం లేదని క్లాస్ పీకారు. ఎక్కడికక్కడ అలవాటైపోయిందని..కొందరు అధికారులు ఇంకా వైసీపీ ప్రభుత్వం స్టైల్లోనే ఉన్నారని మండిపడ్డారు.

Related Post

మెగా పోటీకి సై అంటున్న సితార సంస్థమెగా పోటీకి సై అంటున్న సితార సంస్థ

కాకతాళీయమే అయినా కొన్ని టాలీవుడ్ క్లాషులు ఆసక్తికరంగా ఉంటాయి. అలాంటిదే ఇది. సితార ఎంటర్ టైన్మెంట్స్ లో ఒకేసారి ఆరేడు సినిమాలు నిర్మాణంలో ఉన్న సంగతి తెలిసిందే. వీటికి రిలీజ్ డేట్లు సెట్ చేసుకోవడం నిర్మాత నాగవంశీకి పెద్ద సవాల్ గా