hyderabadupdates.com Gallery ఎమ్మెల్యే గాలి జనార్ధన్ రెడ్డి ఇంటికి నిప్పు

ఎమ్మెల్యే గాలి జనార్ధన్ రెడ్డి ఇంటికి నిప్పు

ఎమ్మెల్యే గాలి జనార్ధన్ రెడ్డి ఇంటికి నిప్పు post thumbnail image

రాయ‌చూర్ జిల్లా : క‌ర్ణాట‌క‌లోని రాయ‌చూర్ జిల్లాలో బీజేపీ వ‌ర్సెస్ కాంగ్రెస్ పార్టీల మ‌ధ్య ప‌చ్చ గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటోంది. ఇప్ప‌టికే ఇరు వ‌ర్గాల మ‌ధ్య చోటు చేసుకున్న ఆధిప‌త్య పోరు చివ‌ర‌కు దాడులు చేసుకునేంత దాకా వెళ్లింది. ఒక‌రు మృతి చెందారు. ప‌లువురిపై కేసు న‌మోదు చేశారు. ఇదే స‌మ‌యంలో రాయ‌చూర్ జిల్లా ఎస్పీ విధుల ప‌ట్ల నిర్ల‌క్ష్యం వ‌హించారంటూ కాంగ్రెస్ ప్ర‌భుత్వం అత‌డిపై వేటు వేసింది. ఈ త‌రుణంలో తాజాగా శ‌నివారం మ‌రో ఘ‌ట‌న చోటు చేసుకుంది. బీజేపీ ఎమ్మెల్యే గాలి జ‌నార్ద‌న్ రెడ్డి ఇంటికి గుర్తు తెలియ‌ని దుండ‌గులు ఇంటికి నిప్పంటించారు. దీంతో ప్ర‌మాద ఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేక పోవడంతో బ‌తికి బ‌య‌ట ప‌డ్డారు గాలి జ‌నార్ద‌న్ రెడ్డి కుటుంబీకులు.
అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బెంగళూరులో ఉన్నారు గాలి జనార్ధన్ రెడ్డి. ఘటనపై బళ్లారి జిల్లా పోలీసులకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. గాలి జనార్ధన్ రెడ్డి ఇంటి కి నిప్పు పెట్టిన ఘటన వెనుక బళ్లారి కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి ఉన్నారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఈ ఘాతుకానికి పాల్పడ్డారని గాలి సోదరుడు సోమశేఖర్ రెడ్డి ఆరోపించారు. ఈ మేర‌కు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండ‌గా జనవరి 1వ తేదీన గాలి జనార్ధన్ రెడ్డి ఇంటి వద్ద కాల్పులకు తెగబడ్డారు ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి వర్గీయులు. కాగా ఆ ఘటనపై విచారణ జరుగుతుండగానే బళ్లారిలోని గాలి జనార్ధన్ రెడ్డి మోడల్ హౌస్ కు నిప్పు పెట్టడం పై సర్వత్రా చర్చ జ‌రుగుతోంది.
The post ఎమ్మెల్యే గాలి జనార్ధన్ రెడ్డి ఇంటికి నిప్పు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Ram Charan’s Action Thriller ‘Peddi’ Heads to Sri Lanka for Key ShootRam Charan’s Action Thriller ‘Peddi’ Heads to Sri Lanka for Key Shoot

The much-anticipated action thriller Peddi, starring global superstar Ram Charan and helmed by acclaimed director Buchchi Babu Sana, has embarked on its next shooting schedule in Sri Lanka. The team

ఎట్ట‌కేల‌కు అమెరికాపై గెలిచిన పాకిస్తాన్ఎట్ట‌కేల‌కు అమెరికాపై గెలిచిన పాకిస్తాన్

శ్రీ‌లంక : టి 20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో భాగంగా శ్రీ‌లంక రాజ‌ధాని కొలంబో వేదిక‌గా జ‌రిగిన కీల‌క‌మైన మ్యాచ్ లో అమెరికా జ‌ట్టుపై విజ‌యం సాధించింది పాకిస్తాన్. పాక్ జ‌ట్టుకు చెందిన ఫ‌ర్హాన్ అద్భుతంగా ఆడాడు. హాఫ్ సెంచ‌రీతో ఆక‌ట్టుకున్నాడు.

ధ‌వ‌ళేశ్వ‌రం బ్యారేజ్ గేట్లు మార్చేందుకు రూ. 150 కోట్లుధ‌వ‌ళేశ్వ‌రం బ్యారేజ్ గేట్లు మార్చేందుకు రూ. 150 కోట్లు

అమ‌రావ‌తి : రాష్ట్రంలో నీటి పారుద‌ల ప్రాజెక్టుల‌పై కూట‌మి స‌ర్కార్ ఫుల్ ఫోక‌స్ పెట్టింద‌ని స్ప‌ష్టం చేశారు రాష్ట్ర భారీ నీటి పారుద‌ల శాఖ మంత్రి నిమ్మ‌ల రామానాయుడు. శ‌నివారం శాస‌న స‌భ‌లో ఎమ్మెల్యేలు అడిగిన ప‌లు ప్ర‌శ్నల‌కు స‌మాధానం ఇచ్చారు.