hyderabadupdates.com movies ఏం చేసినా కాపులు టెంప్ట్ కావట్లేదా?

ఏం చేసినా కాపులు టెంప్ట్ కావట్లేదా?

రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల్లో కాపులను కేంద్రంగా చేసుకుని నాయకులు కామెంట్లు కురిపిస్తున్నారు. దీనిలో భాగంగానే అంబటి రాంబాబు వ్యవహారం పెద్ద ఎత్తున దుమారం రేపే ప్రయత్నం చేశారు. ఇక, కాపు ఉద్యమ మాజీ నాయకుడు ముద్రగడ పద్మనాభం సైతం సీఎం చంద్రబాబుకు భారీ లేఖ సంధించారు. కాపులను టార్గెట్ చేసుకుని దాడులు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇది సరికాదన్నారు. ఇక, దీనికి కౌంటర్‌గా ఆయన కుమార్తె క్రాంతి కూడా స్పందించారు.

మొత్తంగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలకు కాపులకు మధ్య అవినాభావ సంబంధాన్ని ముడిపెట్టేలా పరిస్థితులు ముందుకు సాగుతున్నాయి. ముఖ్యంగా టీడీపీతో కలిసి ఉన్న జనసేనను దూరం చేస్తే, తద్వారా ఓటు బ్యాంకు చీలిపోయి తమకు మేలు చేస్తుందనే అంచనాలో వైసీపీ నాయకులు ఉన్నట్టు చర్చ సాగుతోంది. ఇది ఏమేరకు ఆ పార్టీకి లాభం చేకూరుస్తుందన్నది చూడాలి. కానీ ప్రస్తుతానికి మాత్రం కాపులు చాలా వరకు నిలకడగానే ఉన్నారన్నది వాస్తవం.

ఎక్కడా కీలక నాయకులు పెద్దగా నోరు విప్పడం లేదు. కాపు నేతల్లో ఐకాన్‌లుగా ఉన్న కొత్తపల్లి సుబ్బారాయుడు, తోట త్రిమూర్తులు, కన్నా లక్ష్మీనారాయణ వంటి వారు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాపులను రెచ్చగొట్టినా వారిలో పెద్దగా మార్పు రావడం ఊహించలేమన్న వాదన వినిపిస్తోంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను భేరీజు వేసుకుని, ఏ వైపు మొగ్గు చూపినా ఇబ్బందులు తప్పవన్న ధోరణిలో ఉన్నట్టు తెలుస్తోంది.

గతంలో తుని ఘటన జరిగినప్పుడు కాపులు బలంగా స్పందించారు. కానీ ఇప్పుడు జరుగుతున్న అంబటి ఎపిసోడ్‌కు, అప్పటి పరిస్థితులకు మధ్య స్పష్టమైన తేడా ఉంది. అందుకే నాడు కనిపించిన వేగవంతమైన ప్రతిస్పందన ఇప్పుడు కనిపించడం లేదు. ప్రతి విషయాన్నీ ఆచితూచి పరిశీలిస్తున్నారు. ప్రతి అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నారు.

అందుకే ఎన్ని రాజకీయ పరిణామాలు జరిగినా కాపులు ప్రస్తుతం నిలకడగానే ఉండాలనే స్థిర నిర్ణయంతో ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ముందెం జరుగుతుందన్నది చూడాలి.

Related Post

Who is Beatriz Taufenbach? Meet Yash’s Toxic co-star everyone is talking aboutWho is Beatriz Taufenbach? Meet Yash’s Toxic co-star everyone is talking about

The Rocking Star, Yash’s upcoming film Toxic: A Fairy Tale for Grown-Ups has landed in controversy. Toxic’s teaser has come under fire a formal complaint was filed with the Karnataka