hyderabadupdates.com Gallery ఏపీ రాష్ట్ర బ‌డ్జెట్ కొత్త సీసాలో పాత సారా : వైఎస్ ష‌ర్మిల

ఏపీ రాష్ట్ర బ‌డ్జెట్ కొత్త సీసాలో పాత సారా : వైఎస్ ష‌ర్మిల

ఏపీ రాష్ట్ర బ‌డ్జెట్ కొత్త సీసాలో పాత సారా :  వైఎస్ ష‌ర్మిల post thumbnail image

అమ‌రావ‌తి : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ స‌ర్కార్ తాజాగా ప్ర‌వేశ పెట్టిన 2026-27 రాష్ట్ర బడ్జెట్ పై స్పందించారు. కొత్త సీసాలో పాత సారా సామెతను తలపించిందని అన్నారు. అంతా ఊహా జనితంగా, అభూత కల్పనలతో ఉందంటూ మండిప‌డ్డారు. అంకెలు ఘనం.. అప్పుల కుప్ప. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు బారెడుంటే, బడ్జెట్ లో కేటాయింపులు మూరెడంత లేవన్నారు. ఇచ్చిన వాగ్దానాలను పూర్తిగా విస్మరించి, సూపర్ సిక్స్ హామీలకు పంగనామాలు పెట్టారంటూ ధ్వ‌జ‌మెత్తారు ష‌ర్మిలా రెడ్డి.. ఇతర ఎన్నికల హామీలకు ఎగనామం పెట్టారని పేర్కొన్నారు. ఇది మంచి ప్రభుత్వం కాద‌ని, ముంచే ప్రభుత్వమని మరోసారి నిరూపితం చేసుకున్నారంటూ ఎద్దేవా చేవారు.
బడ్జెట్ లో ఆడబిడ్డ నిధి ప్రస్తావనే లేదన్నారు. కూటమి గెలిచి రెండేళ్లు అవుతున్నా మహాశక్తి పథకం అసలుందో లేదో తెలియదన్నారు ష‌ర్మిలా రెడ్డి. నెలకు రూ . 15 వందలు ఇస్తామని నమ్మించి కోటిన్నర మంది మహిళలను రెండేళ్లుగా చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు. రూ.10 లక్షల వరకు ఉచిత రుణాలు అని చెప్పి సున్నావడ్డి పథకానికి ఒక్క రూపాయి కేటాయించ లేద‌న్నారు. నిరుద్యోగులకు మళ్లీ టోకరా పెట్టారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. బడ్జెట్ లో నిరుద్యోగ భృతి హామీపై ఊసే లేదన్నారు. నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3 వేలు ఇస్తామని చెప్పి బడ్జెట్ లో ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా 50 లక్షల మంది నిరుద్యోగులను మళ్లీ మోసం చేశారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు వైఎస్ ష‌ర్మిలా రెడ్డ. జనవరి నెలలో ఇస్తామని చెప్పిన జాబ్ క్యాలెండర్ గురించి కూడా చెప్పనే లేదన్నారు. ఫీజు రీయింబర్స్ పథకానికి చిల్లిగవ్వ ఇచ్చిన పాపాన పోలేద‌న్నారు. 50 ఏళ్లకే పెన్షన్ హామీకి దిక్కు లేద‌న్నారు. ప్రభుత్వ ఉద్యోగులను సైతం వంచించారని ఆరోపించారు.
The post ఏపీ రాష్ట్ర బ‌డ్జెట్ కొత్త సీసాలో పాత సారా : వైఎస్ ష‌ర్మిల appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

2.65 ల‌క్ష‌ల ఎక‌రాల‌లో ప‌శుగ్రాసాల అభివృద్ది2.65 ల‌క్ష‌ల ఎక‌రాల‌లో ప‌శుగ్రాసాల అభివృద్ది

అమ‌రావ‌తి : ఏపీ కూట‌మి ప్ర‌భుత్వం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. వ్య‌వ‌సాయ రంగానికి అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇస్తున్న‌ట్లు తెలిపింది. తాజా బ‌డ్జెట్ లో ప‌శు పోష‌ణ‌కు ప్రోత్సాహం క‌ల్పిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. షెడ్యూల్డు కులాలు /

‘Kiss Kiss Bang Bang’ Video Song from They Call Him OG Released, Goes Viral Online‘Kiss Kiss Bang Bang’ Video Song from They Call Him OG Released, Goes Viral Online

The blockbuster gangster action drama They Call Him OG, starring Power Star Pawan Kalyan and directed by Sujeeth, continues to make waves even after its successful theatrical run. The makers

గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం స‌ర్కార్ కు రోడ్ మ్యాప్గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం స‌ర్కార్ కు రోడ్ మ్యాప్

హైద‌రాబాద్ : సీఎం ఎ. రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాజకీయాల్లో వ్యక్తిగత డ్యామేజీ ఉండదన్నారు. అది వ్యవస్థ మొత్తాన్ని డ్యామేజ్ చేస్తుందన్నారు సీఎల్పీ సమావేశంలో .ప్రజా ప్రభుత్వంలో మూడవ బడ్జెట్ ప్రవేశ పెట్టబోతున్నాం. ప్రభుత్వ ప్రాధాన్యతలు, భవిష్యత్ ప్రణాళికలకు