hyderabadupdates.com movies ఏ చిన్న అవ‌కాశాన్నీ వ‌ద‌ల‌ట్లేదుగా బాబూ!

ఏ చిన్న అవ‌కాశాన్నీ వ‌ద‌ల‌ట్లేదుగా బాబూ!

ఏపీ సీఎం చంద్ర‌బాబు ఏ చిన్న అవ‌కాశాన్నీ వ‌ద‌ల‌ట్లేదా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. పెట్టుబడుల‌కు ఎక్క‌డ అవ‌కాశం ఉంటే.. అక్క‌డ ఆయ‌న వాలిపోతున్నారు. దేశ విదేశాల్లో ఎక్క‌డ ఏ చిన్న అవ‌కాశం చిక్కినా ముందుంటున్నారు. సింగ‌పూర్ నుంచి దుబాయ్ వ‌ర‌కు.. ఎక్క‌డ పెట్టుబ‌డుల స‌మావేశాలు నిర్వ‌హించినా.. అక్క‌డ‌కు వెళ్తున్నారు. అవ‌కాశాల‌ను ఒడిసి ప‌ట్టుకుని ఏపీకి దూసుకువ‌స్తున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా మ‌రికొన్ని కీల‌క ఒప్పందాలు చేసుకున్నారు.

ఢిల్లీలో జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ స‌ద‌స్సులో శుక్ర‌వారం ప్ర‌త్య‌క్ష‌మైన చంద్ర‌బాబు.. ప‌లు సంస్థ‌ల‌తో ఐటీకి సంబంధించిన ఒప్పందాలు చేసుకున్నారు. శుక్ర‌వారం ఉద‌యం ఢిల్లీకి చేరుకున్న ముఖ్య‌మంత్రి ఏఐ స‌ద‌స్సుకు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా స‌ద‌స్సుకు వ‌చ్చిన అంత‌ర్జాతీయ ప్ర‌తినిధుల‌తో ఆయ‌న చ‌ర్చించారు. ఏపీలో ఉన్న అపార అవ‌కాశాల‌ను ఆయ‌న వారికి వివ‌రించారు. ఇండియ‌న్ బిజినెస్ మేనేజ్‌మెంట్‌(ఐబీఎం) స‌హా .. ప్ర‌ముఖ సంస్థ‌ల ప్ర‌తినిధుల‌తో చంద్ర‌బాబు చ‌ర్చించారు.

ఈ క్ర‌మంలో అమ‌రావ‌తిలో ఏర్పాటు చేస్తున్న క్వాంటం కంప్యూటింగ్ గురించి వివ‌రించారు. అదేవిధంగా విశాఖ‌లో ఏర్పాటు కానున్న డేటా కేంద్రం.. ఐటీ సంస్థ‌ల వివ‌రాల‌ను తెలిపారు. ఆయా రంగాల్లో పెట్టుబ‌డులు పెట్టేందుకు ముందుకు రావాల‌ని కోరారు. ఈ క్ర‌మంలో ప‌లు సంస్థ‌లు.. చంద్ర‌బాబు స‌మ‌క్షంలో ఏపీ అధికారుల‌తో ఒప్పందాలు చేసుకున్నాయి.

ఇవీ తాజా ఒప్పందాలు..

+ క్వాంటం – ఏఐ రంగాల్లో  నైపుణ్యాభివృద్ధికి ఏడు సంస్థ‌లతో ఒప్పందం.+ ఏపీని క్వాంటం-ఏఐ హబ్ గా తీర్చిదిద్దేందుకు ఈ సంస్థ‌లు ముందుకు వ‌చ్చాయి.+ క్వాంటం, ఏఐలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు అమెరికా సంస్థ ఒప్పందం.+ ఇంటర్నేషనల్ కంప్యూటింగ్ సెంటర్.. రాష్ట్ర ప్రభుత్వంతో  ఒప్పందం చేసుకుంది.

Related Post

పవన్ ఫ్యాన్స్ అంటే అంతే మరి…పవన్ ఫ్యాన్స్ అంటే అంతే మరి…

అభిమానులందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు వేరు అని చెప్పొచ్చు. పవన్ ఎంచుకునే కొన్ని సినిమాల విషయంలో వాళ్ల నుంచి మొదట తీవ్ర వ్యతిరేకత వస్తుంటుంది. రీమేక్‌లను ఎంచుకోవడం.. సరైన డైరెక్టర్లతో పని చేయకపోవడం పట్ల వారు తమ అసహనాన్ని

Pennsylvania defense attorney shocked: FBI nabs explicit child abuse suspect in courtPennsylvania defense attorney shocked: FBI nabs explicit child abuse suspect in court

Content warning: This article describes child sexual abuse. Please take care while reading. On Monday, September 29, 2025, Richard Allen Adamsky, a former teacher and youth sports coach from Warminster,