విజయవాడ : ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ జాతీయ 11 వ ప్లీనరీ ముగింపు సందర్భంగా నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికయ్యింది. ఐ.జే.యు. అధ్యక్షునిగా బల్విందర్ సింగ్ జమ్మూ (పంజాబ్) , సెక్రటరీ జనరల్ గా డి.సోమసుందర్ (ఆంధ్రప్రదేశ్) గతంలోనే ఏకగ్రీవంగా ఎన్నిక కాగా వారు ప్లీనరీ వేదికపై తాజాగా తమ బాధ్యతలు చేపట్టారు. మిగిలిన ఆఫీస్ బేరర్ పోస్టులకు, కార్యవర్గ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ జరిగింది. ఐజేయూ జాతీయ కార్యవర్గం సీనియర్ పాత్రికేయుడు ఎం.ఎ. మాజిద్ ను ఎన్నికల అధికారిగా నియమించింది. ఉదయం 9 గంటల నుండి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయ్యింది. నామినేషన్ల స్వీకరణ, ఉపసంహరణ ప్రక్రియ పూర్తయ్యాక ఫలితాలను ఎన్నికల అధికారి ఎం.ఎ. మాజిద్ ప్లీనరీలో ప్రకటించారు.
జాతీయ ఉపాధ్యక్షులుగా అమర్ మోహన్ ప్రసాద్ (బీహర్), వై.నరేందర్ రెడ్డి (తెలంగాణా ), జాతీయ కార్యదర్శులుగా నరేంద్ర భరద్వాజ్ ( ఉత్తర ప్రదేశ్ ), డి.ఎస్.ఆర్.సుభాష్ ( తమిళనాడు) , పి. భాస్కర్ రెడ్డి ( కర్ణాటక) , కోశాధికారిగా బల్బీర్ సింగ్ జంబు (పంజాబ్) ఎన్నికయ్యారు. జాతీయ కార్యవర్గ సభ్యులుగా రవీందర్ సింగ్ ( ఉత్తర ప్రదేశ్) , కే.సత్యనారాయణ (తెలంగాణా ), కే. అజిత ( తెలంగాణా) , నగునూరి శేఖర్ (తెలంగాణా ) కూన అజయ్ బాబు , ( ఆంధ్ర ప్రదేశ్) ఈ.ఎన్.రాజు ( ఆంధ్రప్రదేశ్) , కుణాల్ జే. మాత్రే ( మహారాష్ట్ర), మోహన్ రాజ్ శ్రీనివాసన్ (తమిళనాడు), బిందూ సింగ్ ( పంజాబ్ , చండీఘర్), ఎం.పీ. మహారాజ ( పాండిచ్చేరి), సి.ఎం.సాబిర్ అలీ ( కేరళమ్), జయశ్రీ భట్టాచార్య ( పశ్చిమ బెంగాల్), వినీతా మండల్ హల్దర్ ( ఛత్తీస్ ఘడ్), శివేంద్ర నారాయణ్ సింగ్ ( బీహార్) టి. శ్రీనివాసరావు ( న్యూఢిల్లీ), ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
The post ఐజేయూ అధ్యక్షునిగా బల్విందర్ జమ్మూ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
ఐజేయూ అధ్యక్షునిగా బల్విందర్ జమ్మూ
Categories: