hyderabadupdates.com Gallery ఐపీఎల్ లో స‌త్తా చాటేందుకు ప్ర‌య‌త్నం చేస్తా

ఐపీఎల్ లో స‌త్తా చాటేందుకు ప్ర‌య‌త్నం చేస్తా

ఐపీఎల్ లో స‌త్తా చాటేందుకు ప్ర‌య‌త్నం చేస్తా post thumbnail image

చెన్నై : కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ప్ర‌ముఖ క్రికెట్ కామెంటేట‌ర్ హ‌ర్ష భోగ్లేతో జ‌రిగిన చిట్ చాట్ సంద‌ర్బంగా ప‌లు అంశాల గురించి త‌న అభిప్రాయాల‌ను పంచుకున్నాడు. ఈ సంద‌ర్భంగా త‌న 11 ఏళ్ల క్రికెట్ ప్ర‌స్థానం ఇప్ప‌టి వ‌ర‌కు సాఫీగా సాగ‌లేద‌న్నాడు. ఈ జ‌ర్నీలో విజ‌యాల కంటే ఎక్కువ‌గా ఎదురు దెబ్బ‌లు ఉన్నాయ‌ని తెలిపాడు సంజు శాంస‌న్. మ‌రి ఈసారి జ‌రిగే ఐపీఎల్ లో ఎలాంటి ప్లాన్ చేశావ‌ని అడిగిన ప్ర‌శ్న‌కు చాలా కూల్ గా స‌మాధానం ఇచ్చాడు. ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ -2026లో నా ఆట‌తీరు కొంచెం మొద‌ట్లో ఇబ్బందిక‌రంగా ఉండింది. కానీ నాకు మిగ‌తా మ్యాచ్ ల‌లో ఛాన్స్ ఇచ్చారు హెడ్ కోచ్ గంభీర్. ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ గాయ‌డ‌డంతో నేను త‌న స్థానంలో ఆడాల్సి వ‌చ్చింద‌ని తెలిపాడు.
దీంతో ఆ స‌మ‌య‌లో నా కెరీర్ ముగిసి పోతుంద‌ని అనుకున్నా. ఎందుకంటే అప్ప‌టికే నేను కీవీస్ తో జ‌రిగిన సీరీస్ లో దారుణంగా విఫలం చెందాను. అన‌వ‌స‌ర షాట్స్ ఆడి వికెట్ల‌ను పారేసుకున్నాన‌ని తెలిపాడు. ఐదు మ్యాచ్ ల‌లో నేను చేసింది కేవ‌లం 50 ప‌రుగులు మాత్ర‌మే. ఆ స‌మ‌యంలో నేను పూర్తిగా నిరాశ చెందాను. కానీ ఆత్మ విశ్వాసం కోల్పోలేదు. డూ ఆర్ డై అన్న రీతిలో మైదానంలోకి వెళ్లాను. న‌మీబియాతో 22 , జింబాబ్వేతో 24 ప‌రుగులు చేశాడు. గౌతీ భాయ్ నా వ‌ద్ద‌కు వ‌చ్చాడు. త‌దుప‌రి మ్యాచ్ ల‌లో వికెట్ కీపింగ్ చేయాల్సింది నువ్వేన‌ని అన్నాడు. దీంతో నా పొజిష‌న్ ఏమిటో తెలిసి వ‌చ్చింద‌న్నాడు సంజు శాంస‌న్. ఈసారి జ‌రిగే ఐపీఎల్ లో నా వంతు బాగా ఆడేందుకు ప్ర‌య‌త్నం చేస్తాన‌ని అన్నాడు. చెన్నై సూప‌ర్ కింగ్స్ ను విజ‌య తీరాల‌కు చేర్చేందుకు కృషి చేస్తాన‌ని చెప్పాడు.
The post ఐపీఎల్ లో స‌త్తా చాటేందుకు ప్ర‌య‌త్నం చేస్తా appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Minister Giriraj Singh: 100% పత్తి కొనుగోలు చేస్తాం – కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌Minister Giriraj Singh: 100% పత్తి కొనుగోలు చేస్తాం – కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌

Giriraj Singh : తెలంగాణ రైతులు పండించే పత్తిని 100% సీసీఐ ద్వారా కొనుగోలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర జౌళిశాఖ మంత్రి గిరిరాజ్‌సింగ్‌ (Giriraj Singh) ప్రకటించారు. ఇందుకోసం రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలను 110 నుంచి 122కి

సీఎం మురికి భాషపై కేటీఆర్ సీరియ‌స్సీఎం మురికి భాషపై కేటీఆర్ సీరియ‌స్

హైద‌రాబాద్ : మిర్యాల‌గూడ వేదిక‌గా జ‌ర‌గిన బ‌హిరంగ స‌భ‌లో త‌న తండ్రి, తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి కేసీఆర్ ను ఉద్దేశించి చేసిన కామెంట్స్ పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు మాజీ మంత్రి కేటీఆర్. గ‌రువారం కేటీఆర్ సోష‌ల్ మీడియా ఎక్స్

జగన్ హ‌యాంలో మొత్తం క‌ల్తీనే : ఎస్. స‌వితజగన్ హ‌యాంలో మొత్తం క‌ల్తీనే : ఎస్. స‌విత

శ్రీసత్యసాయి జిల్లా : జగన్ హయాంలో అన్ని కల్తీలే జరిగాయని, చివరికి తిరుపతి ప్రసాదాన్ని కూడా అపవిత్రం చేశారని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత మండిపడ్డారు. ఆయన్ను ప్రజలెప్పుడూ నమ్మరని, వైసీపీకి ఎప్పుడో పాడి