hyderabadupdates.com movies ఐబొమ్మ కథ – సినిమాని మించిన ట్విస్టులు

ఐబొమ్మ కథ – సినిమాని మించిన ట్విస్టులు

గ్యాంగ్ స్టర్లు, నేరస్థులను తెరమీద చూసి ఇలా ఎలా చేస్తారని ఆశ్చర్యపోతాం కానీ నిజ జీవితంలో పైరసీ దొంగల స్టోరీలు అంతకు మించిన ట్విస్టులతో ఉన్నాయి. సుప్రసిద్ధ పైరసీ యాప్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపిన సంగతి తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించిన వివరాలు పంచుకునేందుకు పోలీస్ కమీషనర్ సజ్జనార్ తో పాటు సినీ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున, దిల్ రాజు, సురేష్ బాబు తదితరులు ప్రత్యేకంగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వెల్లడి చేసిన విషయాలతో ఏకంగా ఒక వెబ్ సిరీస్ తీసేంత మ్యాటర్ ఉండటం అతిశయోక్తి కాదు.

ఇమ్మడి రవి స్వస్థలం విశాఖపట్నం. బిఎస్సి కంప్యూటర్స్ చదివాడు. ప్రహ్లాద్ కుమార్ వెల్లల పేరుతో డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు తీసుకుని దందాలు మొదలుపెట్టాడు. ఒకటి రెండు కాదు ఏకంగా 65కి పైగా మిర్రర్ సైట్లు నిర్వహించి వాటి ద్వారా పైరసీని వ్యాప్తం చేయడమే కాక బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం ద్వారా కోట్ల డబ్బు సంపాదించాడు. ఫోన్ నెంబర్లు సంపాదించి వాటికి ఏపికె ఫైల్స్ పంపేవాడు. ఎవరైనా దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే వాళ్ళ డేటా మొత్తం హ్యాక్ చేసి వ్యక్తిగత ప్రయోజనాలకు వాడుకునేవాడు. అతని దగ్గర ఉన్న హార్డ్ డిస్కుల్లో హాలీవుడ్ గాడ్ ఫాదర్ నుంచి టాలీవుడ్ ఓజి దాకా ఇరవై వేల సినిమాలున్నాయి.

ఇప్పటిదాకా ఇమ్మడి రవి పైరసీ ద్వారా సంపాదించిన మొత్తం 20 కోట్ల పైమాటే. అందులో 3 కోట్లు పోలీసులు సీజ్ చేశారు. 50 లక్షల మందికి సంబంధించిన సబ్స్క్రైబర్ డేటా ఇతని దగ్గర ఉందంటే ఏ స్థాయిలో నెట్ వర్క్ ని వాడుకున్నాడో అర్థం చేసుకోవచ్చు. ఇతర రాష్ట్రాల్లో వేరే పేర్లతో ఐడి కార్డులు తీసుకున్నాడు. సినీ పెద్దలు ఫిర్యాదు చేసాక ఇండియన్ సిటిజెన్ షిప్ వదలుకుని కరేబియన్ దీవుల్లో పౌరసత్వం సంపాదించాడు. 2019లో ఐబొమ్మ మొదలుపట్టి 21 వేల సినిమాలను పైరసీ చేశాడు. అమెరికా, స్విజ్జర్ ల్యాండ్, నెదర్ లాండ్స్ లో సర్వర్లు పెట్టి ఆపరేట్ చేసేవాడు. 100కు పైగా డొమైన్లు కొన్నాడు. ఇలా ఒక పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించుకున్న ఇమ్మిడి రవి ఏ పోలీసులనైతే సవాల్ చేశాడో చివరికి వాళ్ళ చేతికే చిక్కి కటకటాల పాలయ్యాడు.

Related Post

భూమ‌న‌కు పోలీసుల నోటీసులు, రీజనేంటి?భూమ‌న‌కు పోలీసుల నోటీసులు, రీజనేంటి?

తిరుపతి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నాయ‌కుడు భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డికి తిరుప‌తి జాల్లా పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 23న విచార‌ణ‌కు రావాల‌ని ఆయ‌న‌కు సూచించారు. అదేవిధంగా గ‌తంలో తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానానికి సంబంధించిన తిరుప‌తిలోని గోశాల‌పై

ఎన్టీఆర్ శోభన్ బాబు… ప్రభాస్ మహేష్ బాబుఎన్టీఆర్ శోభన్ బాబు… ప్రభాస్ మహేష్ బాబు

తెలుగు ప్రేక్షకులకు రాముడు అంటే గుర్తొచ్చే రూపం స్వర్గీయ నందమూరి తారకరామారావుగారే. కృష్ణుడి పాత్రల ద్వారానే ఎక్కువ పాపులారిటీ వచ్చినప్పటికీ లవకుశలో ఆయన దివ్యమంగళ దర్శనం జరిగాక వేరొకరిని ఆ క్యారెక్టర్ లో చూసేందుకు జనం ఇష్టపడేవాళ్లు కాదు. అందుకే సంవత్సరాల