hyderabadupdates.com movies ఐబొమ్మ రవి మారిపోతే… పైరసీ ఆగిపోతుందా

ఐబొమ్మ రవి మారిపోతే… పైరసీ ఆగిపోతుందా

వారం రోజులుగా కస్టడీలో ఉన్న ఐబొమ్మ రవి నుంచి వీలైనన్ని నిజాలు రాబట్టేందుకు పోలీసులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మొదట్లో కొంచెం బెట్టు చేసినా ఇప్పుడు కాళ్లబేరానికి వస్తున్నాడని ఇన్ సైడ్ టాక్. పలు కీలక వివరాలు వెల్లడిస్తూ ఎక్కడెక్కడ తన నెట్ వర్క్ ఉందో వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఇస్తున్నట్టు సమాచారం. వాటిని ట్రేస్ చేసే పనిలో డిపార్ట్ మెంట్ బిజీగా ఉందట. తాను బయటికి వచ్చిన తర్వాత పైరసీ జోలికి వెళ్లనని, కోర్టు ఆదేశాల ప్రకారం నడుచుకుంటూ ఉద్యోగం చేసుకుంటానని చెబుతున్నాడట. అతను అడిగినంత మాత్రాన ఇది తేలికగా అయిపోయే వ్యవహారం కాదు.

ఐబొమ్మ రవి మారినా మారకపోయినా ఇప్పటికిప్పుడు పైరసీని పూర్తిగా నాశనం చేయడం కష్టం. మాజీ కమీషనర్ సివి ఆనంద్ చెప్పినట్టు ఏదో ఒక రూపంలో అది మళ్ళీ పురుడు పోసుకుంటుంది. సింపుల్ లాజిక్ ఏంటంటే ప్రపంచంలో ఉన్న పైరసీ మొత్తం రవి సృష్టించలేదు. అందులో తానొక భాగమై కొత్త ప్రపంచాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఐబొమ్మ మూతబడింది కానీ భారతీయ సినీపరిశ్రమకు శనిలా దాపురించినా కొన్ని వెబ్ సైట్స్ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కొత్త సినిమాల ప్రింట్లు పెడుతూనే ఉన్నాయి. మరి రవి లోపల ఉన్నప్పుడు ఇవన్నీ ఆగిపోవాలి కదా. వేరే దొంగలు ఇంకా సేఫ్ గా ఉన్నారు.

జనాలు ఉచితంగా పైరసీ చూసే ప్రహసనానికి మాత్రమే ప్రస్తుతం అడ్డుకట్ట పడింది. ఇది థియేటర్ వ్యవస్థకు చాలా మేలు చేసిన మాట వాస్తవం. అయితే చదువుకున్న వాళ్ళు వాడే టొరెంట్స్, టెలిగ్రామ్ ఛానల్స్ లాంటి వాటి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం చాలా ఉంది. వీటి వెనుక ఉన్న అసలు బాస్ ఎవరో పట్టుకోవాలి. అయితే ఇది సులభం కాదు. ప్రాక్సీ సర్వర్లు వాడుతూ, లొకేషన్లను పట్టుబడకుండా సరికొత్త టెక్నాలజీలు వాడే ఇంటెలిజెంట్ క్రిమినల్స్ ని జైల్లో వేయడం మాటల్లో చెప్పుకున్నంత తేలిక కాదు. రవి అరెస్టుతో ప్రారంభమైతే అదిరిపోయింది. దీన్ని క్లైమాక్స్ దాకా తీసుకెళ్లడమే మిగిలింది.

Related Post

ఈసీ ఎఫెక్ట్: సోష‌ల్ మీడియా ప్ర‌భావం అంతంతే!ఈసీ ఎఫెక్ట్: సోష‌ల్ మీడియా ప్ర‌భావం అంతంతే!

బీహార్ అసెంబ్లీ సహా, తెలంగాణ సహా ప‌లు రాష్ట్రాల్లోని అసెంబ్లీలలో ఖాళీ అయిన ఎమ్మెల్యే స్థానాలకు ఉప ఎన్నిక జరగనున్నాయి. నవంబరు 9, 11 తేదీల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. జమ్ము కశ్మీర్‌లోని సీఎం ఒమర్ అబ్దుల్లా నియోజకవర్గం బుడ్గమ్ నియోజకవర్గానికి,

న‌వీన్ యాద‌వ్‌కు మంత్రి ప‌ద‌వి.. తీవ్ర క‌స‌ర‌త్తు?న‌వీన్ యాద‌వ్‌కు మంత్రి ప‌ద‌వి.. తీవ్ర క‌స‌ర‌త్తు?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌లో భారీ మెజారిటీ ద‌క్కించుకుని విజ‌యం సాధించిన న‌వీన్ యాద‌వ్‌కు మంత్ర వ‌ర్గంలో చోటు ల‌భించ‌నుందా? ఆ దిశ‌గా సీఎం రేవంత్ రెడ్డి ఆలోచ‌న చేస్తున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు కాంగ్రెస్ పార్టీనాయ‌కులు. ఇది అతిశ‌యోక్తి కాద‌ని కూడా