hyderabadupdates.com movies ఐబొమ్మ రవి మారిపోతే… పైరసీ ఆగిపోతుందా

ఐబొమ్మ రవి మారిపోతే… పైరసీ ఆగిపోతుందా

వారం రోజులుగా కస్టడీలో ఉన్న ఐబొమ్మ రవి నుంచి వీలైనన్ని నిజాలు రాబట్టేందుకు పోలీసులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మొదట్లో కొంచెం బెట్టు చేసినా ఇప్పుడు కాళ్లబేరానికి వస్తున్నాడని ఇన్ సైడ్ టాక్. పలు కీలక వివరాలు వెల్లడిస్తూ ఎక్కడెక్కడ తన నెట్ వర్క్ ఉందో వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఇస్తున్నట్టు సమాచారం. వాటిని ట్రేస్ చేసే పనిలో డిపార్ట్ మెంట్ బిజీగా ఉందట. తాను బయటికి వచ్చిన తర్వాత పైరసీ జోలికి వెళ్లనని, కోర్టు ఆదేశాల ప్రకారం నడుచుకుంటూ ఉద్యోగం చేసుకుంటానని చెబుతున్నాడట. అతను అడిగినంత మాత్రాన ఇది తేలికగా అయిపోయే వ్యవహారం కాదు.

ఐబొమ్మ రవి మారినా మారకపోయినా ఇప్పటికిప్పుడు పైరసీని పూర్తిగా నాశనం చేయడం కష్టం. మాజీ కమీషనర్ సివి ఆనంద్ చెప్పినట్టు ఏదో ఒక రూపంలో అది మళ్ళీ పురుడు పోసుకుంటుంది. సింపుల్ లాజిక్ ఏంటంటే ప్రపంచంలో ఉన్న పైరసీ మొత్తం రవి సృష్టించలేదు. అందులో తానొక భాగమై కొత్త ప్రపంచాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఐబొమ్మ మూతబడింది కానీ భారతీయ సినీపరిశ్రమకు శనిలా దాపురించినా కొన్ని వెబ్ సైట్స్ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కొత్త సినిమాల ప్రింట్లు పెడుతూనే ఉన్నాయి. మరి రవి లోపల ఉన్నప్పుడు ఇవన్నీ ఆగిపోవాలి కదా. వేరే దొంగలు ఇంకా సేఫ్ గా ఉన్నారు.

జనాలు ఉచితంగా పైరసీ చూసే ప్రహసనానికి మాత్రమే ప్రస్తుతం అడ్డుకట్ట పడింది. ఇది థియేటర్ వ్యవస్థకు చాలా మేలు చేసిన మాట వాస్తవం. అయితే చదువుకున్న వాళ్ళు వాడే టొరెంట్స్, టెలిగ్రామ్ ఛానల్స్ లాంటి వాటి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం చాలా ఉంది. వీటి వెనుక ఉన్న అసలు బాస్ ఎవరో పట్టుకోవాలి. అయితే ఇది సులభం కాదు. ప్రాక్సీ సర్వర్లు వాడుతూ, లొకేషన్లను పట్టుబడకుండా సరికొత్త టెక్నాలజీలు వాడే ఇంటెలిజెంట్ క్రిమినల్స్ ని జైల్లో వేయడం మాటల్లో చెప్పుకున్నంత తేలిక కాదు. రవి అరెస్టుతో ప్రారంభమైతే అదిరిపోయింది. దీన్ని క్లైమాక్స్ దాకా తీసుకెళ్లడమే మిగిలింది.

Related Post

‘స్లమ్ డాగ్’ సౌండ్ లేదేంటి?‘స్లమ్ డాగ్’ సౌండ్ లేదేంటి?

దర్శకుడు పూరి జగన్నాథ్ కంబ్యాక్ మూవీగా షూటింగ్ మొదలైనప్పటి నుంచే పాజిటివ్ వైబ్స్ మోస్తున్న స్లమ్ డాగ్ ( ప్రచారంలో ఉన్న టైటిల్) చిత్రీకరణ పూర్తి చేసుకుని నెల రోజులు దాటేసింది. అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తూనే ఉన్నారు కానీ

తండ్రినే డామినేట్ చేసిన హృతిక్ తనయులుతండ్రినే డామినేట్ చేసిన హృతిక్ తనయులు

ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే అత్యుత్తమ డ్యాన్సర్ల లిస్టు తీస్తే.. అగ్ర స్థానానికి గట్టి పోటీదారుగా ఉంటాడు హృతిక్ రోషన్. తన తొలి చిత్రం ‘కహోనా ప్యార్ హై’తోనే అతను టాప్ డ్యాన్సర్‌గా పేరు తెచ్చుకున్నాడు. అందులో ఇక్‌బల్ కా జీనా స్టెప్పులకు

“జగన్ నీకు ఏం అన్యాయం చేశాడు షర్మిలమ్మా?”“జగన్ నీకు ఏం అన్యాయం చేశాడు షర్మిలమ్మా?”

వైయస్ షర్మిల ఇటీవల చేసిన తీవ్ర వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి స్పందిస్తూ, “జగన్ నీకు ఏం అన్యాయం చేశాడో చెప్పమ్మా?” అంటూ ప్రశ్నించారు. ఇటీవల షర్మిల మాట్లాడుతూ,