చెన్నై : ప్రముఖ నటుడు, టీవీకే పార్టీ చీఫ్ దళపతి విజయ్ సంచలనంగా మారాడు. త్వరలోనే తమిళనాడు రాష్ట్రంలో శాసన సభ ఎన్నికలు జరగబోతున్నాయి. తనకు లెక్కకు మించిన ఆస్తులు ఉన్నాయి. మరో వైపు తనకు తన భర్త విజయ్ నుండి విడాకులు కావాలంటూ భార్య సంగీత విజయ్ కోర్టును ఆశ్రయించారు. దీంతో పిటిషన్ స్వీకరించిన కోర్టు విచారణకు రావాల్సిందిగా విజయ్ కు నోటీసులు జారీ చేసింది. ఈ వివాదాలు కొనసాగుతుండగానే మహిళా దినోత్సవం సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తన భార్య గురించి చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. దీనిపై స్వంత పార్టీకి చెందిన మహిళా నేత సంచలన ఆరోపణలు చేశారు విజయ్. ఇలా మాట్లాడటం మంచి పద్దతి కాదన్నారు. ఇక మహిళలకు ఏం న్యాయం చేస్తారంటూ ప్రశ్నించారు.
ఓ వైపు అన్ని వైపుల నుంచి వ్యక్తిగత జీవితానికి సంబంధించి వస్తున్న విమర్శలు, దాడుల నుంచి ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు జోసెఫ్ విజయ్. ఇదే క్రమంలో ఊహాగానాలకు మరింత ఊతం ఇచ్చేలా నటి త్రిష కృష్ణన్ తో కలిసి విజయ్ ఓ ఫంక్షన్ కు బహిరంగంగానే హాజరు కావడం వైరల్ అయ్యింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. వీరిపై మీమ్స్ కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి. వీరి సంబంధానికి సంబంధించి బాలీవుడ్ డైరెక్టర్ విక్రమ్ భట్ సమర్థించారు . వారి వ్యక్తిగత జీవితాల ఆధారంగా నటులపై తీర్పు చెప్పవద్దని కోరారు. వారి సినిమాలు మనవి. వారి జీవితాలు మనవి కావు అనే క్యాప్షన్ కూడా జోడించారు.
The post ఔను వాళ్లిద్దరు ఇష్టపడ్డారు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
ఔను వాళ్లిద్దరు ఇష్టపడ్డారు
Categories: