hyderabadupdates.com movies కనకరాజు కాస్త త్వరగా రావొచ్చుగా

కనకరాజు కాస్త త్వరగా రావొచ్చుగా

2026 వేసవి వృథా అయిపోతోందని బయ్యర్ వర్గాలు తెగ ఆందోళన చెందుతున్నాయి. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ దాకా యునానిమస్ బ్లాక్ బస్టర్ లేకపోవడం వాళ్ళ టెన్షన్ కు కారణం. డెకాయిట్ లాంటివి ఒకటి రెండు కమర్షియల్ గా గట్టెక్కినా అన్ని వర్గాలు, అన్ని సెంటర్లు కలెక్షన్లతో హోరెత్తించిన మూవీ లేకపోవడం ఇబ్బందికరమైన పరిస్థితిని తీసుకొచ్చింది. వచ్చిన చిన్నా చితకా చిత్రాలు ప్రమోషన్లలో హడావిడి చేయడం తప్ప కంటెంట్లో తేలిపోవడం చూస్తూనే ఉన్నాం.

ఇలాంటి వాక్యూమ్ ని వాడుకునే చొరవ మీడియం బడ్జెట్ సినిమాలు తీసుకోకపోవడం విచారకరం. వరుణ్ తేజ్ హీరోగా రూపొందిన కొరియన్ కనకరాజ్ దాదాపు పూర్తి కావొచ్చింది. ప్రమోషన్లు మొదలుపెట్టారు కానీ రిలీజ్ డేట్ తేల్చలేదు. కారణం ఆశించిన స్థాయిలో ఇంకా థియేటర్ బిజినెస్ పెరగకపోవడమేనని ఇన్ సైడ్ టాక్. ఓటిటి డీల్ కూడా పెండింగ్ ఉందంటున్నారు కానీ నెట్ ఫ్లిక్స్ కొనేసిందనే మాట యూనిట్ నుంచి వినిపిస్తోంది.

దర్శకుడు మేర్లపాక గాంధీ దీన్నో హారర్ కామెడీగా తీర్చిదిద్దారు. కొరియా వెళ్లిన ఆంధ్రుడు చేసే హాస్యంతో ఆద్యంతం నవ్వులు, భయం మిక్స్ అయ్యేలా కాస్త డిఫరెంట్ గా తీశారనే టాక్ వినిపిస్తోంది. నిజానికీ కొరియన్ కనకరాజు కనక ఏప్రిల్ లో వచ్చి ఉంటే క్యాష్ చేసుకునే అవకాశం ఉండేది. పెద్ది వాయిదా పడుతుందని ముందే పసిగట్టి గాయపడ్డ సింహం, జెట్లీ దాన్ని క్యాష్ చేసుకున్నాయి కానీ వరుణ్ తేజ్ బృందం ఆ ఛాన్స్ వాడుకోకపోవడం ట్రాజెడీ.

నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ కి కొరియన్ కనకరాజు సక్సెస్ కావడం కీలకం. ఘాటీ డిజాస్టర్ తర్వాత కొంచెం బ్రేక్ తీసుకున్న నిర్మాతలు ఫిబ్రవరిలో కపుల్ ఫ్రెండ్లీ రూపంలో డీసెంట్ మూవీ ఇచ్చారు. భారీ వసూళ్లు కాదు కానీ నష్టాలు రాకుండా గట్టెక్కింది. ఎక్కువ బడ్జెట్ పెట్టిన బైకర్ యావరేజ్ దగ్గర ఆగిపోయింది. కలెక్షన్స్ లెక్కలో ఫ్లాపనే అంటున్నారు. సో కొరియన్ కనకరాజు కనక హిట్ అయితే రిలీఫ్ దక్కుతుంది. ఇది సరే కానీ యువి నుంచి విశ్వంభర అప్డేట్ ఎప్పుడు ఇస్తుందో అంతు చిక్కడం లేదు.

Related Post

గతంలో బాబు, కేసీఆర్… ఇప్పుడు రేవంత్ – జీవన్ రెడ్డిగతంలో బాబు, కేసీఆర్… ఇప్పుడు రేవంత్ – జీవన్ రెడ్డి

మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి కొంతకాలంగా సొంతపార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి రాజీనామా చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఊహాగానాలకు తగ్గట్లుగానే జీవన్ రెడ్డి నేడు