hyderabadupdates.com Gallery క‌మ‌నీయం శ్రీ సీతారాముల క‌ళ్యాణోత్స‌వం

క‌మ‌నీయం శ్రీ సీతారాముల క‌ళ్యాణోత్స‌వం

క‌మ‌నీయం  శ్రీ సీతారాముల క‌ళ్యాణోత్స‌వం post thumbnail image

ఒంటిమిట్ట : ఒంటిమిట్ట‌ల‌ని శ్రీ కోదండ రామ‌స్వామి వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు అంగ‌రంగ వైభ‌వంగా కొన‌సాగుతున్నాయి. ఉత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకుని ప్ర‌త్యేకంగా శ్రీ సీతారాముల క‌ల్యాణోత్స‌వం జ‌రిగింది. దాదాపు 80 వేల మంది భక్తులు ఈ ఉత్స‌వానికి హాజ‌ర‌య్యారు. రాష్ట్ర స‌ర్కార్ త‌ర‌పున సీఎం చంద్ర‌బాబు నాయుడు కుటుంబంతో క‌లిసి హాజ‌ర‌య్యారు. స్వామి, అమ్మ‌వార్ల‌కు ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించారు. సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేసిన రామభక్తులు . ఈ సంద‌ర్బంగా సీఎంకు ధ‌న్య‌వాదాలు తెలిపారు. టీటీడీకి చెందిన అన్ని విభాగాలు జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుని భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేశారు. కల్యాణ వేదిక ప్రాంగణంలో విశాలమైన 121 గ్యాలరీలను ఏర్పాటు చేసి, భక్తులు సౌకర్యవంతంగా కూర్చుని కల్యాణోత్సవాన్ని వీక్షించేలా చర్యలు తీసుకున్నారు. కల్యాణానికి విచ్చేసిన ప్రతి భక్తుడికి ముత్యాల తలంబ్రాలు, శ్రీవారి లడ్డూ ప్రసాదం, కంకణాలను టీటీడీ అందించింది. ప్రతి భక్తుడికి లెమన్ రైస్‌, కేసరి, బిస్కెట్ ప్యాకెట్‌, మ్యాంగో జ్యూస్‌, వాటర్ బాటిల్‌, స్వీట్‌, కారా పదార్థాలతో కూడిన కిట్‌ను అందజేశారు.
గ్యాలరీలలో భక్తులకు శ్రీవారి సేవకులు నిరంతరం మజ్జిగ ప్యాకెట్లు, తాగునీరు పంపిణీ చేశారు. నడిచి వచ్చే భక్తుల కోసం 11 ప్రాంతాల్లో, ఆలయ సమీపంలో 3 వేల మంది భక్తులు వేచి ఉండేలా ప్రత్యేక షెడ్లు ఏర్పాటు చేశారు. పానకం, మజ్జిగ, చలివేంద్రాలు, వాటర్ కూలర్లు, సిబ్బంది అందుబాటులో ఉంచారు. శ్రీ సీతారాముల కల్యాణోత్సవాన్ని వీక్షించేందుకు 21 ఎల్ఈడీ స్క్రీన్‌లు ఏర్పాటు చేశారు. అలాగే ట్రాఫిక్ డైవర్షన్ ప్రాంతాల నుండి కల్యాణ వేదిక వరకు టీటీడీ 20 ఉచిత బస్సులను నడిపింది. భక్తుల ఆరోగ్య పరిరక్షణకు 13 వైద్య శిబిరాలు, 35 మంది వైద్య నిపుణులు, 250 మంది పారామెడికల్ సిబ్బంది, 8 అంబులెన్సులు సిద్ధంగా ఉంచి అవసరమైన వైద్యసేవలు అందించారు.
పారిశుద్ధ్య పరిరక్షణలో భాగంగా 250 మరుగుదొడ్లు ఏర్పాటు చేసి, 3,268 మంది పారిశుద్ధ్య కార్మికులు విధులు నిర్వహించారు. సుమారు 2,600 మంది శ్రీవారి సేవకులు, ప్రభుత్వ, పోలీస్, టీటీడీ సిబ్బంది సమన్వయంతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సేవలు అందించారు. శ్రీ సీతారాముల కల్యాణోత్సవాన్ని ఎస్వీబీసీ ద్వారా హెచ్‌డీ నాణ్యతతో ప్రసారం చేయగా, ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు వీక్షించి ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు.
The post క‌మ‌నీయం శ్రీ సీతారాముల క‌ళ్యాణోత్స‌వం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

ISRO Chief Narayanan: అంతరిక్షానికి 80వేల కేజీలను మోసుకెళ్లేలా రాకెట్లు – ఇస్రో చీఫ్‌ISRO Chief Narayanan: అంతరిక్షానికి 80వేల కేజీలను మోసుకెళ్లేలా రాకెట్లు – ఇస్రో చీఫ్‌

ISRO Chief Narayanan : అంతరిక్ష రంగ అభివృద్ధి కోసం ప్రస్తుతం ఇస్రో అనేక ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు చేపట్టినట్లు ఇస్రో చీఫ్‌ వి. నారాయణన్‌ వెల్లడించారు. వాటిలో 80వేల కేజీలను మోసుకెళ్లే రాకెట్లను తయారుచేయడం, 2026లో వ్యోమమిత్ర అనే రోబోను అంతరిక్షంలోకి

సెమీస్ ఆశ‌లు సజీవం ఇండియా ఘ‌న విజ‌యంసెమీస్ ఆశ‌లు సజీవం ఇండియా ఘ‌న విజ‌యం

చెన్నై : చెన్నై వేదిక‌గా గురువారం జ‌రిగిన కీల‌క మ్యాచ్ లో ఎట్ట‌కేల‌కు సమిష్టిగా రాణించింది. అద్భుత విజ‌యాన్ని న‌మోదు చేసింది. చావో రేవో తేల్చుకోవాల్సిన ప‌రిస్థితిలో 72 ప‌రుగుల తేడాతో ప్ర‌త్య‌ర్తి జింబాబ్వేను ఓడించింది. సెమీ ఫైన‌ల్ కు చేరుకునేందుకు

సంక్రాంతి పండుగ వేళ ప్ర‌త్యేక రైళ్లుసంక్రాంతి పండుగ వేళ ప్ర‌త్యేక రైళ్లు

హైద‌రాబాద్ : ద‌క్షిణ మ‌ధ్య రైల్వే శాఖ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. సంక్రాంతి పండుగ సంద‌ర్బంగా పెద్ద ఎత్తున ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు ఇక్క‌డ ఉన్న వారంతా జ‌ర్నీ చేస్తారు. ఇప్ప‌టికే ఆర్టీసీ సంస్థ భారీ ఎత్తున బ‌స్సుల‌ను ఏర్పాటు చేసింది. అయితే