hyderabadupdates.com movies కమల్ కు చిన్మయి చురకలు

కమల్ కు చిన్మయి చురకలు

మహిళల మీద వివిధ రంగాల్లో జరుగుతున్న లైంగిక వేధింపులు, అఘాయిత్యాల మీద కొన్నేళ్ల ముందు మొదలైన ‘మీ టూ’ ఉద్యమాన్ని పెద్ద స్థాయికి తీసుకెళ్లి, సినీ రంగంలో ఎంతోమంది మహిళలు గళం విప్పేలా చేసిన ఘనత సింగర్ కమ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి సొంతం. చాలామంది నెమ్మదిగా ఈ ఉద్యమాన్ని పక్కన పెట్టేశారు కానీ.. చిన్మయి మాత్రం పట్టు వదల్లేదు.

ఒకవైపు తనకు జరిగిన అన్యాయం గురించి పదే పదే గుర్తు చేస్తూనే, మరోవైపు ఫిలిం ఇండస్ట్రీలోనే కాక వివిధ రంగాల్లో మహిళల మీద జరిగే అఘాయిత్యాల విషయంలో ఏళ్లుగా అలుపెరగని పోరాటం చేస్తోంది చిన్మయి. ముఖ్యంగా తమిళ లెజెండరీ లిరిసిస్ట్ వైరముత్తు మీద ఆమె చేసిన ఆరోపణలు.. చేసిన పోరాటం చర్చనీయాంశంగా మారింది.

కానీ చిన్మయి ఎన్ని ఆరోపణలు చేసినా.. ఫిర్యాదులు చేసినా.. ఎన్ని ఉదంతాలను ఉదాహరణగా చూపించినా.. వైరముత్తు మీద ఇప్పటిదాకా ఎలాంటి చర్యలు లేవు. సినీ, రాజకీయ ప్రముఖులతో వైరముత్తుకు ఉన్న సన్నిహిత సంబంధాల వల్లే ఆయన దర్జాగా తిరిగేస్తున్నారని.. తమకు న్యాయం చేయట్లేదని చిన్మయి ఆరోపిస్తూ వస్తోంది. వైరముత్తు గురించి ఎవరు పాజిటివ్ గా మాట్లాడినా ఆమె ఊరుకోవట్లేదు.

తాజాగా లెజెండరీ నటుడు కమల్ హాసన్ వైరముత్తును కొనియాడుతూ ఒక పోస్టు పెడితే.. చిన్మయి ఆయననూ తప్పుబట్టింది. కొంచెం ఘాటుగానే కమల్ మీద విమర్శలు చేసింది. వైరముత్తుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక జ్ఞానపీఠ్ అవార్డును ప్రకటించిన నేపథ్యంలో ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ కమల్ పోస్టు పెట్టాడు. ఈ సందర్భంగా వైరముత్తును ‘అంకుల్ మెంటార్’ అని సంబోధించాడు కమల్. చిన్మయి ఇదే విషయాన్ని ఎత్తు చూపుతూ కోట్ చేసింది.

సదరు అంకుల్ – మెంటార్ మహిళలకు చేసిన అన్యాయాల గురించి ఎంతగా మొర పెట్టుకున్నా.. సినీ రంగంలో పేరొంది, రాజకీయాల్లోనూ చురుగ్గా ఉన్నవాళ్ళు మహిళల బాధలను అసలు వినిపించుకోరని చిన్మయి కమల్ కు చురకలంటించింది. పురుషులు ఎప్పుడూ మహిళల వైపు ఉండరని.. వాళ్లందరూ వాళ్ళ అన్నతమ్ములు, మామలు, తండ్రులు, స్నేహితులు, మెంటార్ల వైపే నిలుస్తారని.. ఎంతో మనోవేదన అనుభవించిన మహిళల గోడు పట్టేది ఎవరికని చిన్మయి ప్రశ్నించింది.

Related Post

మహేష్‌ రీల్‌తో మొత్తం మారిపోయిందిమహేష్‌ రీల్‌తో మొత్తం మారిపోయింది

నిహారిక.ఎం.. సోషల్ మీడియాను బాగా ఫాలో అయ్యే వాళ్లకు ఈమె పేరును కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇన్‌స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్‌లో ఆమె బాగా పాపులర్. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా నిహారిక ఎప్పుడో స్టార్ స్టేటస్ సంపాదించింది. ‘మిషన్ ఇంపాజిబుల్’ ఇండియా

వచ్చే ఎన్నికల్లోనూ తమదే విజయమంటున్న సీఎంవచ్చే ఎన్నికల్లోనూ తమదే విజయమంటున్న సీఎం

2029లో జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ తామే విజ‌యం దక్కించుకుంటామ‌ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఎవ‌రు ఎన్ని జిమ్మిక్కులు చేసినా.. ప్ర‌జ‌లు కాంగ్రెస్ పార్టీ వెంటే ఉన్నార‌ని తెలిపారు. ప్ర‌స్తుతం ముగిసిన మూడు ద‌శ‌ల పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు అద్భుత‌మైన